ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని కలెక్టర్ ఐ.శ్రీనివాసశ్రీనరేష్ హామీ ఇచ్చారు. గురువారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఎస్పీ రంగనాధ్, జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ విలేకరులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపకార వేతనాలకు ఆధార్ అనుసంధానం, గ్యాస్ నగదు బదిలీ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. భూసేకరణ చట్టం కొత్తగా అమలులోకి వచ్చిందని తెలిపారు. రాజీవ్ యువ కిరణాలు పథకం, ఐఏపీ (ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్) నిధులు, ఆర్‌వీఎం తదితర పథకాలను పటిష్టంగా అమలు చేస్తామన్నారు. త్వరలో ఎన్నికల ప్రక్రియ ఉంటుందని, అప్పటి వరకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సూర్యాపేట నుంచి దేవరపల్లి రోడ్డు ఫోర్‌లైన్ రోడ్డుకు సర్వే జరుగుతోందని చెప్పారు. హెవీవాటర్ ప్లాంట్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, అక్కడ మరోప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గోదావరి తీర ప్రాంతాలైన మణుగూరు నుంచి అశ్వాపురం వరకు పరి శ్రమలకు అనుకూలంగా ఉంటుందని, పరి శ్రమలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొం దిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్నారని, వారి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. ఎస్పీ రంగనాధ్ మా ట్లాడుతూ జిల్లాలో నక్సల్స్‌ను నియంత్రించామని, పూర్తిస్థాయిలో ఈ సమస్యను రూపుమాపుతామని చెప్పారు. భద్రాచలం డివిజన్‌లో రోడ్లను అభివృద్ధిచేస్తామన్నారు. దొంగతనాలను నియంత్రిస్తామని, మధిరలో జరిగిన దోపిడీకి సంబంధించిన అత్యాధునిక పరి జ్ఞానం సహాయంతో దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు.
జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిచేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటామని తెలిపారు. జిల్లా అనేక పథకాల నిర్వహణలో ముందంజలో ఉందన్నారు. నూతన సంవత్సరంలో అర్హులకు పథకాలను అందించి జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్‌కలెక్టర్ బాబూరావు, జెడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణ, డ్వామా పీడీ శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణి, మెప్మా పీడీ వేణుమనోహర్, ఆర్డీవో సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అసంపూర్తి పనులు పూర్తి చేస్తా
Published Fri, Jan 3 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement
Advertisement