ttdc
-
రేపు టీటీడీసీలో ఉద్యోగ మేళా
అనంతపురం అగ్రికల్చర్: డీఆర్డీఏ– వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులకు రేపు స్థానిక ఫంగల్రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీలో శనివారం ఉద్యోగ మేళా ఉంటుందని పీడీ ఎం.వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు ఫ్లిఫ్కార్డు వేర్‌హౌస్‌లో స్కానింగ్, డేటాఎంట్రీ ఉద్యోగాలకు అర్హులన్నారు. 18 నుంచి 30 ఏళ్ల యవస్సున్న యువకులు పది, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నవారు ఉండాలన్నారు. బయోడేటా, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జెరాక్స్‌తో పాటు విద్యార్హత సర్టిఫికెట్లతో ఈనెల 16న ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు. -
సెక్యూరిటీ ఉద్యోగాలకు 7న ఇంటర్వ్యూలు
అనంతపురం టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 7న అనంతపురం శివారులోని టీటీడీసీలో ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. జీఎంఆర్ సంస్థ రక్షా అకాడమీ, ఓరియన్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ఉచిత భోజనం, వసతి ఉంటుందని, శిక్షణ తర్వాత బెంగళూరు, చెన్నై, విజయవాడ, ముంబయి, ఢిల్లీల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండి, టెన్త్ ఉత్తీర్ణులైన వారు ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలన్నారు. బయోడేటా ఫారం, రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు. -
రేపు టీటీడీసీలో జాబ్‌మేళా
అనంతపురం టౌన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–వెలుగు, ఈజీఎం ఆధ్వర్యంలో ఈనెల 22న టీటీడీసీలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. 18 నుంచి 21 ఏళ్లలోపు ఉన్న యువకులు ఎంపీసీ/బైపీసీలో 60 శాతం ఉత్తీర్ణులై ఉండాలన్నారు. -
రేపు జాబ్ మేళా
అనంతపురం రూరల్: ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ కంపెనీలో ఉద్యోగాల కోసం శుక్రవారం అర్హుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) మేనేజర్ సూర్యనారాయణ తెలిపారు. రాప్తాడు సమీపంలో ధర్మవరం పంగల్ రోడ్డులో ఉన్న టీటీడీసీలో ఉదయం పది గంటలకు ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. ఐటీఐ చేసి, 24 సంవత్సరాల లోపు వయసున్న వారు ఇందుకు అర్హులని తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, రేషన్, ఆధార్‌కార్డుల జిరాక్స్‌లతోపాటు విద్యా అర్హత పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. -
హమ్మయ్యా..!
ఒంగోలు టూటౌన్ : ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) ఇంటర్వూ్యలకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్ అనుమతితో ఈ నెల 24, 25వ తేదీల్లో అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఒంగోలులోని టెక్నాలాజీ అండ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్ (టీటీడీసీ)లో ఇంటర్వూ్యలు నిర్వహించనున్నారు. 24వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) రుణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు, అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఖాధీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు (కేవీఐబీ) దరఖాస్తుదారులకు ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. 25న జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహిస్తామని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ టి.ఆనంద్‌కుమార్ తెలిపారు. డీఐసీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న రూరల్ అభ్యర్థులకు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్బన్ అభ్యర్థులకు ఇంటర్వూ్యలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ అభ్యర్థులను ఇంటర్వూ్య చేస్తుంది. ఫలించిన ఎదురు చూపులు పీఎంఈజీపీ రుణాల కోసం రెండేళ్లుగా ఇంటర్వూ్యలు నిర్వహించలేదు. బ్యాంకు లింకేజీ రుణాలు కావడంతో నిరుద్యోగులకు రుణాలు అందని ద్రాక్షే అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పరిశ్రమలతో ఉపాధి పొందాలనుకునే నిరుద్యోగులు జిల్లాలో లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పేదరికంతో చదువులు మధ్యలో మానేసిన వారే. ఇటు ఉన్నత చదువులు చదవలేక అటు వ్యవసాయ భూములు లేక కొట్టుమిట్టాడుతున్న ఎంతోమంది పీఎంఈజీపీ రుణాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. సిమెంట్ ఇటుకల తయారీ, కారం మిల్లులు, డిటర్జంట్ పౌడర్ల తయారీ, గ్రానైట్ ఫాలిషింగ్, ఐస్ క్రీమ్ తయారీ, మహిళలు ఇంటి వద్ద ఉండి తయారు చేసే పలు కుటీర పరిశ్రమలకు సంబంధించిన యూనిట్లకు పీఎంఈజీపీ కింద బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇస్తారు. యూనిట్ విలువ ఆధారంగా రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు రుణాలు ఇస్తారు. కనీసం 8వ తరగతి వరకు చదివిన వారు రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్వయం సహాయక సంఘాల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల వారికి 15 శాతం, గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగులకు 25 శాతం వరకు యూనిట్ విలువలో రాయితీ ఇస్తారు. 15 ఏళ్లుగా ప్రభుత్వం లక్ష్యాలకు.. బ్యాంకులు మంజూరు చేసే రుణాలకు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. దీంతో లక్ష్యాల్లో పురోగతి కనిపించకపోవడంతో పీఎంఈజీపీ రుణాలను ప్రభుత్వం ఏటా తగ్గిస్తూ వస్తోంది. దీనికి తోడు బ్యాంకు నుంచి లభించే రుణ సదుపాయం, సాంకేతిక సహకారం వంటి వాటిని ప్రభుత్వం గాలికొదిలేసింది. కేవలం లబ్ధిదారుల ఎంపికతోనే చేతులు దులుపుకోవడంతో పథకం నీరుగారింది. 2009 నుంచి కనీసం 132 యూనిట్ల వరకు లక్ష్యాలు ఇస్తున్న సర్కార్.. రానురానూ క్రమంగా 32 యూనిట్లకు కుదించింది. దీనికి తోడు రెండేళ్లుగా ఇంటర్వూ్యలు నిర్వహించిన పాపాన పోలేదు. దీంతో నిరుద్యోగుల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి పీఎంఈజీపీ ఇంటర్వూ్యల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగుల్లో ఆసక్తి పెరిగింది. ఈ ఏడాది కనీసం 500 మంది నిరుద్యోగులకైనా పీఎంఈజీపీ రుణాలు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిక్కీ జిల్లా కో ఆర్డినేటర్ భక్తవత్సలం డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్లుగా ఇంటర్వూ్యలు నిర్వహించక పోవడంతో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఆన్లైన్లో రుణాలకు దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని గమనించి చిన్న పరిశ్రమలతోనైనా జీవితంలో స్థిరపడేందుకు తోడ్పాటునందించాల్సిన అవసరం ఉందంటున్నారు. అధికారులు ఆ దశగా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికే.. 01–07–2016 నుంచి 2017 జనవరి 31లోపు ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుదారులకు మాత్రమే ప్రస్తుతం ఇంటర్వూ్యలకు కాల్ లెటర్లు పంపుతారు. అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ,ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులు), ప్రత్యేక అర్హత సంబంధిత పత్రం (వికలాంగులు, మాజీ సైనిక ఉద్యోగులు), రూరల్ ఏరియా సర్టిఫికెట్, పాపులేషన్ సర్టిఫికెట్, అభ్యర్థి స్థాపించబోయే ప్రాజెక్టు నివేదిక, విద్యార్హత పత్రాలు, ఆన్లైన్ దరఖాస్తు కాపీ, పాస్‌పోర్టు సైజు ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్‌లను వెంట తెచ్చుకోవాలని జీఎం సూచించారు. -
20న టీటీడీసీలో జాబ్‌మేళా
అనంతపురం అగ్రికల్చర్ : బెంగళూరు ఐసీఐసీఐ బ్యాంకు, అనంతపురం ఫ్లిప్‌కార్టు సంస్థలో డెలివరీ విభాగంలో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన నిరుద్యోగులకు ఈనెల 20న ఉదయం 10 గంటలకు స్థానిక టీటీడీసీ కేంద్రంలో జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు డీఆర్డీఏ– వెలుగు పీడీ ఎం.వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు రూ.10 వేలు వేతనం కలిగిన ఐసీఐసీఐ బ్యాంకుకు సంబంధించి 20 నుంచి 28 సంవత్సరాల వయస్సు, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉండాలన్నారు. నెలకు రూ.8 వేలు, అదనంగా టీఏ కలిగిన ఫ్లిప్కార్డుకు సంబంధించి 20 నుంచి 28 సంవత్సరాల వయస్సు, ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత ఉండాలని తెలిపారు. బయోడేటా, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జెరాక్స్‌తో స్థానిక పంగల్‌రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీ కేంద్రంలో హాజరు కావాలని సూచించారు. -
నవత ట్రాన్స్‌పోర్టులో ఉద్యోగావకాశాలు
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, కడప ఈజీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు (పురుషులకు మాత్రమే) నవతా ట్రాన్స్‌పోర్ట్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ సంచాలకులు అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్లర్క్ ఉద్యోగానికి ఇంటర్/ డిగ్రీ పాస్, వేతనం రూ 7635, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి డిగ్రీ పాస్, అనుభవం ఉన్న వారికి రూ 10,000, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి డిగ్రీ పాస్, అనుభవం ఉన్న వారికి రూ 20,000, పై ఉద్యోగాలకు వయసు 1826 మధ్యలో ఉండాలన్నారు. అర్హతలు ఉన్న వారు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, రేషన్, ఆధార్ కార్డు, ఒరిజినల్, జిరాక్స్ కాపీలు తీసుకుని ఈ నెల 3వ తేదీ టీటీడీసీలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9063125346, 7794044274 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
రేపు టీటీడీసీలో జాబ్‌మేళా
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఉన్న ప్రముఖ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు శనివారం పంగల్ రోడ్డు సమీపంలో ఉన్న టీటీడీసీలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ ఎం.వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, గుత్తి, గుంతకల్లులో పనిచేయాల్సి ఉంటుందన్నారు. నెలకు రూ.10 వేలకు పైగా వేతనం ఉంటుందని తెలిపారు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ విద్యార్హత కలిగి 19 నుంచి 25 సంవత్సరాల వయస్సున్న వారు బయోడేటా, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ప్రతులతో శనివారం ఉదయం 10 గంటలకు టీటీడీసీలో హాజరు కావాలని సూచించారు. -
నేడు టీటీడీసీలో వర్క్‌షాప్
అన ంతపురం టౌన్ : నగర శివారులోని టీటీడీసీలో శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు డ్వామా పీడీ నాగభూషణం తెలిపారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఉపాధి హామీ నిధులను అనుసంధానం చేసిన నేపథ్యంలో గృహనిర్మాణ శాఖ, డీఆర్డీఏ అధికారులతో సమావేశమై ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. -
పారదర్శకంగా సర్వే నిర్వహించాలి
సామర్లకోట/పెద్దాపురం :సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే పూర్తి పారదర్శకంగా చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. ఈ సర్వే నిర్వహణపై సామర్లకోట టీటీడీసీలో బుధవారం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మెప్మా అధికారులు, ఐటీడీఏ అధికారులు, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 82 రోజులపాటు సర్వే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. దీనికి సంబంధించిన మెటీరియల్‌ను సంబంధిత అధికార కార్యాలయాలకు పంపించామన్నారు. ఈసర్వేలో ప్రతి కుటుంబ ఆర్థిక స్థితిగతులు, సమగ్ర సమాచారం, కుల వివరాలు, సామాజిక అంశాలు సేకరించాలన్నారు. ఈ సర్వేను ఆధారంగా చేసుకొనే నిధుల కేటాయింపు, బడ్జెట్ రూపకల్పన ఉంటుందన్నారు. గతంలో చేసిన సర్వేలో లోపాలు ఈ సర్వేలో లేకుండా అన్ని స్థాయిల్లో సిబ్బంది కృషి చేయాలన్నారు. సర్వేలో ప్రజలు పూర్తిగా భాగస్వాములయ్యేలా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలన్నారు. అలాగే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఇందులో సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులను, అవసరమైతే భారత్ నిర్మాణ్ వలంటీర్లను భాగస్వాములను చేయాలన్నారు. జిల్లాలో 2011లో సేకరించిన సర్వే వివరాలను ఈ నెల 26వ తేదీన ప్రచురిస్తారని, ఆముసాయిదా జాబితాపై 30 రోజుల లోపు ప్రజల నుంచి ఫిర్యాదులు, ఆక్షేపణలను పరిష్కరించాలన్నారు. ముసాయిదా జాబితా ప్రచురించిన 52వ రోజు నుంచి 80వ రోజు వరకు అప్పీళ్లను పరిష్కరించాలన్నారు. 82వ రోజున తుది జాబితా ప్రచురించాలన్నారు. జాబితాను ప్రజలు తిలకించేందుకు వీలుగా ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పంచాయతీ కార్యాలయం, గ్రామసంఘాల వద్ద ఉంచాలన్నారు. సెక్ రాష్ట్ర అధికారి రాంబాబు మాట్లాడుతూ 2011లో సేకరించిన డేటా ముసాయిదా జాబితాలోని దిద్దుబాట్లు, సవరణకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 2011లో గణన సమయంలో తొలగించబడిన నివాస స్థలం నుంచి దూరంగా ఉన్న ఆయా కుటుంబాలను చేర్చడానికి అవసరమైన సూచనలు చేశారు. డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ ఈసర్వే కార్యక్రమం విజయవంతానికి అధికారులు సహకరించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలన్నారు. అనంతరం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమగ్ర సర్వేపై అవగాహన కల్పించారు. ట్రైనీ కలెక్టర్ శశాంక్, ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, మెప్మా పీడీ శైలజావల్లి, ఆర్డీవోలు అంబేద్కర్, కూర్మనాథ్, సుబ్బారావు, శంకరవరప్రసాద్ పాల్గొన్నారు. -
అధికారిక భవనం లేక.. అతిథిలా..!
►క్యాంపు కార్యాలయం ఖాళీ లేక కలెక్టర్‌కు ఇబ్బందులు ►నెల రోజులుగా గెస్ట్‌హౌస్‌లోనే బస ►అధికారిక నివాసం ఖాళీ చేయని అహ్మద్‌బాబు ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం.. అబ్బో ఎన్ని హంగులు.. మరెన్ని సౌకర్యాలో.. ఈ విషయం అందరికీ తెలిసిందే. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ క్యాంపు కార్యాలయం ప్రస్తుతం కొనసాగుతున్న కలెక్టర్‌కు ఏ విధంగానూ ఉపయోగపడడంలేదు. దానికీ కారణం లేకపోలేదు.. మొన్నటి వరకు కలెక్టర్‌గా కొనసాగిన అహ్మద్‌బాబు ఆ క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయకపోవడమే..! కొత్త కలెక్టర్ ఎం.జగన్మోహన్ బసచేస్తున్న అతిథిగృహం వద్ద కనీస సౌకర్యాలు లేక ఆయన్ను కలిసేందుకు వస్తున్న ప్రజలు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. అసలే వర్షాకాలం.. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. అంతటి వర్షంలోనూ తమ సమస్యలు కలెక్టర్‌కు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారూ వర్షంలోనే వేచి చూడాల్సి వస్తోంది. ఈ బాధ ప్రజలకే కాకుండా అధికారులకూ తప్పడం లేదు. వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు అతిథిగృహం ఆవరణలోనే పడిగాపులు కాయాల్సి వస్తోం ది. ఇక్కడ మొన్నటి వరకు కలెక్టర్‌గా కొనసాగిన అహ్మద్‌బాబు జూన్ 26న బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లోని జలమండలి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆయన స్థానంలో జగన్మోహన్ జూన్ 29న బాధ్యతలు స్వీకరించారు. అయితే.. బదిలీ అయిన కలెక్టర్ అహ్మద్‌బాబు క్యాంపు కార్యాలయా న్ని ఖాళీ చేయలేదు. దీంతో కొత్త కలెక్టర్ టీటీడీసీ (సాంకేతిక శిక్షణ అభివృద్ధి కేంద్రం) అతిథిగృహంలో బస చేయాల్సి వస్తోంది. ఇందులో కనీసం పది మంది కూడా నిలబడేందుకు స్థలం కూడా లేదు. వేచి చూడడానికి వెయిటింగ్ హాల్ కూడా లేదు. దీంతో అటు అధికారులు, ఇటు ప్రజలకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా శాఖల సమీక్ష సమావేశాలు కలెక్టర్ అధికారిక నివాసంలో నిర్వహిస్తున్న సమయంలో అధికారులు గంటల కొద్దీ బయటే ఉండాల్సి వస్తోంది. అందుబాటులో మంచినీటి సౌకర్యం కూడా లేదు. ప్రభుత్వ అధికారిక బంగ్లా (క్యాంప్ కార్యాలయం)లో పాత కలెక్టర్ అహ్మద్‌బాబు ఇంటి సామగ్రి ఉంది. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తుండటంతో ప్రస్తుత కలెక్టర్ అతిథిగృహంలోనే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. -
అసంపూర్తి పనులు పూర్తి చేస్తా
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని కలెక్టర్ ఐ.శ్రీనివాసశ్రీనరేష్ హామీ ఇచ్చారు. గురువారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఎస్పీ రంగనాధ్, జాయింట్ కలెక్టర్ కె.సురేంద్రమోహన్ విలేకరులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపకార వేతనాలకు ఆధార్ అనుసంధానం, గ్యాస్ నగదు బదిలీ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. భూసేకరణ చట్టం కొత్తగా అమలులోకి వచ్చిందని తెలిపారు. రాజీవ్ యువ కిరణాలు పథకం, ఐఏపీ (ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్) నిధులు, ఆర్వీఎం తదితర పథకాలను పటిష్టంగా అమలు చేస్తామన్నారు. త్వరలో ఎన్నికల ప్రక్రియ ఉంటుందని, అప్పటి వరకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సూర్యాపేట నుంచి దేవరపల్లి రోడ్డు ఫోర్‌లైన్ రోడ్డుకు సర్వే జరుగుతోందని చెప్పారు. హెవీవాటర్ ప్లాంట్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, అక్కడ మరోప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గోదావరి తీర ప్రాంతాలైన మణుగూరు నుంచి అశ్వాపురం వరకు పరి శ్రమలకు అనుకూలంగా ఉంటుందని, పరి శ్రమలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొం దిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్నారని, వారి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. ఎస్పీ రంగనాధ్ మా ట్లాడుతూ జిల్లాలో నక్సల్స్‌ను నియంత్రించామని, పూర్తిస్థాయిలో ఈ సమస్యను రూపుమాపుతామని చెప్పారు. భద్రాచలం డివిజన్లో రోడ్లను అభివృద్ధిచేస్తామన్నారు. దొంగతనాలను నియంత్రిస్తామని, మధిరలో జరిగిన దోపిడీకి సంబంధించిన అత్యాధునిక పరి జ్ఞానం సహాయంతో దొంగలను పట్టుకున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిచేసేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటామని తెలిపారు. జిల్లా అనేక పథకాల నిర్వహణలో ముందంజలో ఉందన్నారు. నూతన సంవత్సరంలో అర్హులకు పథకాలను అందించి జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్‌కలెక్టర్ బాబూరావు, జెడ్పీ సీఈవో జయప్రకాష్‌నారాయణ, డ్వామా పీడీ శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ పద్మజారాణి, మెప్మా పీడీ వేణుమనోహర్, ఆర్డీవో సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గందరగోళం మధ్య ...
ఎచ్చెర్ల, న్యూస్‌లైన్: ఇటీవల వాయిదా పడిన ఎచ్చెర్ల మండల మహిళా సమాఖ్యకు తీవ్ర గందరగోళం మధ్య పాతకార్యవర్గాన్నే మార్చి వరకు కొనసాగించాలని తీర్మానించారు. ఎంఎంఎస్ అధ్యక్షురాలిగా పైడి రాజులమ్మ ఎన్నికయ్యారు. ఎచ్చెర్ల టీటీడీసీ కేంద్రంలో గురువారం ఉదయం జరిగిన ఎన్నికకు 25 వీవోల నుంచి అధ్యక్షులు హాజరయ్యారు. ఐబీ మాస్టర్ ట్రైనర్ మరయమ్మ, జిల్లా సమాఖ్య ఐబీ కమిటీ సభ్యులు ముగ్గురితో కలిసి ఎన్నికను నిర్వహించారు. టీటీడీసీ కేంద్రానికి వచ్చిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.టీటీడీసీ కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి వీవో అధ్యక్షులు మల్లగుల్లాలుపడ్డారు. రెండు వర్గాలుగా చీలిపోయారు. పాత అధ్యక్షురాలు, కుశాలపురం వీవీ అధ్యక్షులు పైడి రాజులమ్మ, టీడీపీ మద్దతుదారు ఎస్ఎంపురం వీవో అధ్యక్షురాలు ఎస్.పద్మ, కాంగ్రెస్ మద్దతుదారు, కేశవరావుపేట వీవో అధ్యక్షురాలు పైడికళావతి పోటీ చేసేందుకు తముందుకొచ్చారు. రాజులమ్మకు మద్దతుగా ఒక్కరూ ముందుకు రాలేదు. కళావతి, పద్మకు చెరో 11 మంది మద్దతు తెలిపారు. రాజులమ్మ మద్దతు తెలపడంతో ఒక వోటుతేడాతో టీడీపీ మద్దతుదారైన పద్మను అధ్యక్షురాలిగా ఎన్నిక చేశారు. పద్మకు మద్దతుగా నిలిచిన ఫరీదుపేట వీవో అధ్యక్షురాలు తాను ఎవరికీ మద్దతు తెలపలేదని, తాను పోటీ చేస్తానని చెప్పడంతో కథ మొదటికొచ్చింది. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ మద్దతుదారులు సద్వినియోగం చేసుకున్నారు. పాత అధ్యక్షురాలైన రాజులమ్మకు పదవి ఇస్తామని చెప్పారు. దీంతో కాంగ్రెస్ మద్దతుదారులతో పాటు ఫరీదుపేట వీవో, పాత అధ్యక్షురాలు మొత్తం 14 మంది ఒక్కటవడంతో టీడీపీ మద్దతుదారులు కంగు తిన్నారు. మళ్లీ ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు చెప్పినా అంగీకరించకుండా టీడీపీ మద్దతుదారులు ఎన్నికను బహిష్కరించి బయటకు వచ్చేశారు. అనంతరం 14 మంది వీవో అధ్యక్షులు పాతకార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తీర్మానించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిక నిబంధనలకు విరుద్ధంగా ఎన్నిక నిర్వహించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతుతో అధికారులను తొత్తులుగా వాడుకుంటున్నారన్నారు. ఒక సారి ఎన్నిక జరిగిందని అధ్యక్షురాలిని అధికారులు ప్రకటించారని, కానీ తర్వాత నిబంధనలను తుంగలో తొక్కారని వారు ఆరోపించారు.