కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, కడప ఈజీఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు (పురుషులకు మాత్రమే) నవతా ట్రాన్స్‌పోర్ట్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ సంచాలకులు అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్లర్క్ ఉద్యోగానికి ఇంటర్/ డిగ్రీ పాస్, వేతనం రూ 7635, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి డిగ్రీ పాస్, అనుభవం ఉన్న వారికి రూ 10,000, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగానికి డిగ్రీ పాస్, అనుభవం ఉన్న వారికి రూ 20,000, పై ఉద్యోగాలకు వయసు 1826 మధ్యలో ఉండాలన్నారు. అర్హతలు ఉన్న వారు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, రేషన్, ఆధార్ కార్డు, ఒరిజినల్, జిరాక్స్ కాపీలు తీసుకుని ఈ నెల 3వ తేదీ టీటీడీసీలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9063125346, 7794044274 నంబర్లలో సంప్రదించాలన్నారు.
నవత ట్రాన్స్‌పోర్టులో ఉద్యోగావకాశాలు
Published Thu, Dec 1 2016 11:36 PM | Last Updated on Tue, Oct 30 2018 7:25 PM
Advertisement
Advertisement