ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ప్రధానమైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దనికలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ కోరారు. శనివారం జాతీ య ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లాపరి షత్ సమావేశ మందిరంలో జరిగిన వేడుకలనుద్దేశించి ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో జిల్లాలో 70 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నట్టు చెప్పారు.
జిల్లాలో ఇప్పటివరకు 19.72లక్షల మంది ఓటర్లు నమోదైనట్టు చెప్పా రు. జిల్లాలో ఓటరునమోదు ప్రత్యేక డ్రైవ్ ద్వారా 45వేల మంది ఓటు హక్కు పొందారని తెలి పారు. 18,19సంవత్సరాల వయసుగల యువత జిల్లాలో 40వేల మంది ఉన్నారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ దిశ గా రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. ఎస్పీఎవి.రంగనాథ్ మాట్లాడుతూ.. డబ్బు ఖర్చు లేకుండా అభ్యర్థులు గెలిస్తే ప్రజాస్వామ్యం విలువ పెరుగుతుందని అన్నారు.
యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే మంచి వ్యక్తులు ఎన్నికయ్యే అవకాశముంటుందన్నారు. ఓటర్లు ఓటు వినియోగాన్ని హక్కుగా మాత్రమే కాకుండా బాధ్యతగా కూడా భావించాలని కోరారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ తన బాధ్యతను నిర్వర్తిస్తుందన్నా రు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ ప్రభావం లేకుండా చూస్తుందన్నారు. హాజరైన వారితో కలెక్టర్ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు.
సీనియర్ ఓటర్లకు సన్మానం
క్రమం తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్న పదిమంది సీనియర్ సిటిజన్లను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. జాతీయ ఓట రు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, డ్రాయింగ్, వక్తృత్వ పోటీల విజేతలకు మెమెంటోలను కలెక్టర్, ఎస్పీ ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ్, డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ భానుప్రకాష్, డీఈఓ రవీంద్రనాథ్, డీడీ ఎస్‌డబ్ల్యూ లక్ష్మిదేవి, డీపీఆర్‌ఓ వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
భారీ ప్రదర్శన, మానవహారం
జాతీయ ఓటరుదినోత్సవం సందర్భంగా నగరం లో భారీ ప్రదర్శన జరిగింది. తొలుత, ఈ ప్రదర్శనను పెవిలియన్ గ్రౌండ్‌లో కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, ఎస్పీ ఎవి.రంగనాథ్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబురావు, జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ ప్రారంభించారు. పెవిలి యన్ గ్రౌండ్ నుంచి మయూరిసెంటర్, బస్టాం డ్, వైరారోడ్, జడ్పీసెంటర్ కు ప్రదర్శన సాగింది. అక్కడప్రదర్శకులు మానవహారంగా ఏర్పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సందేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ చదివి వినిపించారు.
ఓటర్ల ప్రతిజ్ఞ
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాపరిషత్ ఆవరణలోని పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో.. ప్రజాస్వామ్య సాంప్రదాయాలను నిలబెడతాం. మతం, జాతి,కులం, వర్గం, భాష తదితర ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తాం’ అని ప్రతిజ్ఞ చేశారు. నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులను ఇక్కడి సిబ్బంది స్వీకరించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లలో బీఎల్‌ఓలు అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేశారు.
ప్రలోభాలకు లొంగవద్దు
Published Sun, Jan 26 2014 5:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
Advertisement