పోలీస్ సేవలు భేష్
Published Thu, Aug 29 2013 4:08 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. స్థానిక ఎస్‌బీ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలీసులు అనేక సమస్యలను అధిగమిస్తూ గణనీయమైన ప్రగతి సాధించారని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పక్కా ప్రణాళికతో విధులు నిర్వహించారని అన్నారు. అన్ని వర్గాల వారి ప్రయోజనాలను కాపాడటంలో పోలీస్ సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాని అభినందించారు.
మన రాష్ట్ర పోలీసులకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దోషులకు శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయని, అప్పుడు పోలీసుల్లో నైతిక స్థైర్యం పెరుగుతుందని అన్నారు. అందుకు అవసరమైన సాక్షులను గుర్తించడంతోపాటు సకాలంలో చార్జిషిట్ దాఖలు చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచిం చారు. అటవీ భూముల పరిరక్షణకు పోలీస్, రెవెన్యూ, అటవీశాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చా రు. ఎస్పీ ఎ.వి. రంగనాధ్ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు నిర్ధిష్టమైన ప్రణాళిక ఉండాలని చెప్పారు. క్రిమినల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు.
చైన్‌స్నాచింగ్, దొంగతనాల నివారణకు స్పెషల్ పార్టీలను వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా డయల్ 100పై నిర్వహించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శిం చారు. డాక్యుమెంటరీని రూపొందించిన టి.ఆనందరావు, వెంకటేశ్వర్లు, ఖాదర్‌బాబు, కార్తనందంలను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్, ఏఎస్పీలు భాస్కర్ భూషణ్, ప్రకాష్‌రెడ్డి, డీఎస్పీలు బాలకిషన్‌రావు, కృష్ణ, సా యిశ్రీ, అశోక్‌కుమార్, రవీందర్, కుమారస్వామి,సురేష్‌కుమార్, ఎస్‌బీఐ వెంకట్రావు, ఏవో వెంకట్, డీసీఆర్‌బీ సీఐ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement