చింతూరు, న్యూస్‌లైన్: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించి, ప్రజా సమస్యల పరిష్కా రం కోసమే ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోందని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అ న్నారు. బుధవారం చింతూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీలో రాష్ట్రస్థాయిలోనే ఆంక్షలు ఉండడంతో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. అర్హులను గుర్తించి, వారికి మంజూరు చేస్తున్నామని, రేషన్ కార్డుల్లో తప్పులను సరిచేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తున్నామని చెప్పారు. పోలవరం ముంపులో భాగంగా ఆర్‌ఆర్ ప్యాకేజీ కింద బాధితులకు ఇతర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేస్తామని, వీరికి అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
జిల్లాలో ఐఏపీ కింద రహదారుల నిర్మాణాలకు రూ. 90 కోట్లు మంజూరు కాగా, అందులో 90 శాతం నిధులను భద్రాచలం డివిజన్‌కే ఖర్చు చేస్తున్నామని చెప్పా రు. ఆస్పత్రుల్లో సరిపడా వైద్యులు, సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భద్రాచలం డివిజన్‌లో గత విద్యా సంవత్సరంలో ఇంటర్, పదో తరగతిలో మెరుగైన ఫలితాలు రాలేదని, ఈ ఏడాది ఫలితాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తామని, దీనికోసం విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కరించేందకు త్వరలో పరిష్కృతి కార్యక్ర మం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐటీడీఏ పీ వో వీరపాండియన్ మాట్లాడుతూ గిరిజనుల అ భివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడతున్నామని, మారుమూల ప్రాంతాల అభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కుంజా సత్యవతి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఈ సందర్భం గా పలువురికి బంగారుతల్లి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ గణేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
Published Thu, Nov 14 2013 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement