ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: హెలెన్ తుపాను కారణంగా జిల్లాలో ఈ నెల 23, 24 తేదీల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నద ని, ఆ రోజుల్లో మండల, జిల్లా స్థాయి అధికారులంతా విధుల్లో ఉండాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. తుపాను పట్ల అప్రమత్తం చేసేందుకు శుక్రవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లోని ప్రజ్ఞసమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాను నష్టాన్ని కనిష్టస్థాయికి పరిమితం చేసేందుకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. వ్యవసాయాధికారులు మండల కేంద్రాల్లో ఉండి రైతులకు తగు సూచనలు, సలహాలు అందించాలని చెప్పారు. నీటి పారుదలశాఖ అధికారులు ఖమ్మం, పాల్వంచ, భద్రాచలం డివిజన్లలో చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా తగు చర్యలు తీసుకొని వరద ముంపునుంచి పంటలను కాపాడాలన్నారు.
ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండి వాటిని వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, సబ్ సెంటర్లలో అత్యవసర మందులు సమృద్ధిగా నిల్వ చేసుకోవాల ని అన్నారు. వైద్యాధికారులు, సిబ్బంది 24 గం టలు అందుబాటులో ఉండాలని అన్నారు. నిత్యావసర వస్తువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సివిల్‌సప్లయీస్ డీఎంకు సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలు నిరంతరాయంగా నడిపించేందుకు అన్నిరకాల సామగ్రి ని ముందస్తుగా నిల్వ చేసుకోవాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండి తగు సమాచారం వెంటనే తెలపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేఏసీ బాబురావు, డీఆర్వో శివశ్రీనివాస్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి... 23, 24 తేదీల్లో భారీ వర్షాలు
Published Sat, Nov 23 2013 5:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement