ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. స్థానిక జెడ్పీ మీటింగ్ హాల్‌లో గురువారం జిల్లా పరిషత్ మీటింగ్ హలులోసార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సూక్ష్మపరి శీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న ఉదయం 5గంట లకు తమకు కేటాయించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వెళ్లి రిపోర్టు చేసి విధులకు హజరుకావాలని ఆదేశిం చారు. కౌంటింగ్ కోసం ఖమ్మం సమీపంలోని 7 లెక్కింపు కేంద్రాలు, కొత్తగూడెం పట్టణంలో 3 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
కౌంటింగ్ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సూచనల మేరకు ఒక పరిశీలకుడితో పాటు ప్రతి లెక్కింపు టేబుల్‌కు సూక్ష్మపరిశీలకుడు ఉంటారన్నారు. ఖమ్మంపార్లమెంట్ పరిశీలకులు జశ్వంత్‌సింగ్ మాట్లాడుతూ కౌంటింగ్ జరుగుతున్న తీరును అప్రమత్తంగా ఉండి గమనించాలన్నారు. సూక్ష్మపరి శీలకులు సెల్‌ఫోన్‌లు తీసుకెళ్లొద్దని సూచించారు. శిక్షణలో సాధారణ పరిశీ లకులు అశిశ్‌కుమార్‌ఘోష్, గోబిందచంద్రసేధి, లెక్కింపు కేంద్రాల పరిశీలకులు పాల్గొన్నారు.
ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు: కలెక్టర్
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలి పారు. నియోజకవర్గాల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌సిబ్బంది, సూపర్‌వైజర్లు, ఏజెంట్లు, అభ్యర్థులు నిర్ణీత సమయం కంటే అరగంట ముందు కేంద్రాలకు రావాలన్నారు. పోటీ చే సిన అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఓట్ల లెక్కింపులోఎలాంటి అనుమానాలకు తావీయకుండా సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
మైక్రో అబ్జర్వర్లే కీలకం
Published Fri, May 16 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement
Advertisement