general election votes counting
-
మైక్రో అబ్జర్వర్లే కీలకం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. స్థానిక జెడ్పీ మీటింగ్ హాల్లో గురువారం జిల్లా పరిషత్ మీటింగ్ హలులోసార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సూక్ష్మపరి శీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 16న ఉదయం 5గంట లకు తమకు కేటాయించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలకు వెళ్లి రిపోర్టు చేసి విధులకు హజరుకావాలని ఆదేశిం చారు. కౌంటింగ్ కోసం ఖమ్మం సమీపంలోని 7 లెక్కింపు కేంద్రాలు, కొత్తగూడెం పట్టణంలో 3 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. కౌంటింగ్ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సూచనల మేరకు ఒక పరిశీలకుడితో పాటు ప్రతి లెక్కింపు టేబుల్‌కు సూక్ష్మపరిశీలకుడు ఉంటారన్నారు. ఖమ్మంపార్లమెంట్ పరిశీలకులు జశ్వంత్‌సింగ్ మాట్లాడుతూ కౌంటింగ్ జరుగుతున్న తీరును అప్రమత్తంగా ఉండి గమనించాలన్నారు. సూక్ష్మపరి శీలకులు సెల్ఫోన్లు తీసుకెళ్లొద్దని సూచించారు. శిక్షణలో సాధారణ పరిశీ లకులు అశిశ్‌కుమార్‌ఘోష్, గోబిందచంద్రసేధి, లెక్కింపు కేంద్రాల పరిశీలకులు పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు: కలెక్టర్ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలి పారు. నియోజకవర్గాల వారీగా టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌సిబ్బంది, సూపర్వైజర్లు, ఏజెంట్లు, అభ్యర్థులు నిర్ణీత సమయం కంటే అరగంట ముందు కేంద్రాలకు రావాలన్నారు. పోటీ చే సిన అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల ద్వారా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఓట్ల లెక్కింపులోఎలాంటి అనుమానాలకు తావీయకుండా సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. -
కౌంటింగ్‌కు మూడంచెల భద్రత
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ పేర్కొన్నారు. గురువారం స్థానిక కొలాం ఆశ్రమ పాఠశాలలో పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఆటంకం కలగకుండా పోలీసులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను వివరించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను క్రమబద్ధీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో బాగంగానే కేఆర్కే కాలనీ, తంతోలి గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రాలను పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా ప్రణాళిక ప్రకారం బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించి ఓట్ల లెక్కింపు విజయవంతానికి కృషి చేయాలన్నారు. మద్యం షాపులు మూసి ఉంచాలని, ఎలాంటి విజయోత్సవాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. లెక్కింపు సరళిపై పోలీసులు మాట్లాడకూడదన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. 2100 మంది పోలీసు బలగాలు.. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని 2100 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 120 మంది ఎస్సైలు, 180 మంది ఏఎస్సైలు, 320 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 800 మంది కానిస్టేబుళ్లు, 50 మంది మహిళా కానిస్టేబుళ్లు, 200 మంది హోంగార్డులు, 120 మంది ప్రత్యేక సాయుధ దళాలు బందోబస్తులో పాలుపంచుకుంటున్నాయి. కాగా, డాగ్‌స్క్వాడ్, బాంబుస్క్వాడ్‌లతో లెక్కింపు కేంద్రాలను అణువణువు తనిఖీ చేస్తున్నారు. డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టివ్ ద్వారానే ప్రతిఒక్కరినీ లోపలికి అనుమతించనున్నారు. నేటితో తెర.. ఎన్నికల ఫలితాల జాతరకు నేటితో తెరపడనుంది. రెండు నెలలుగా అవిరామంగా ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు చివరిదైన సార్వత్రిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను సైతం విజయవంతంగా ముగించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు. -
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుండగా, పది గంటల వరకు మొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం వరకు మొత్తం ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటృన్నారు. జిల్లాలో పది నియోజకవర్గాలకు, రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలోని గిరిజన, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలుర, బాలికల)లో జరుగుతుంది. జిల్లా కేంద్రంలో 20 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక నియోజకవర్గానికి చెందిన ఓట్లను రెండేసి హాళ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. నిరంతరం కౌంటింగ్‌ను పర్యవేక్షించేందుకు ఎనిమిది మంది పరిశీలకులకు అందుబాటులో ఉంచారు. వీరు ఒక రౌండ్ పూర్తయిన వెంటనే మళ్లీ పరిశీలించిన లెక్కింపు జరుపుతారు. వీరితోపాటు కలెక్టర్ అహ్మద్ బాబు, జేసీ లక్ష్మీకాంతంలు ఉంటారు. లెక్కింపునకు 1,164 మంది అధికారులు సాధారణ ఓట్ల లెక్కింపు కోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 20 హాళ్లలో 240 టేబుళ్ల ద్వారా ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించేందుకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు ఒక ప్రింటింగ్ కమ్ ఆక్సిలరీ డిస్ప్లే యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు మగ్గురు అధికారుల చొప్పున నియమించారు. 288 మంది సూపర్వైజర్లను, 288 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను, 288 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించారు. వీరు కాకుండా 300 మంది ఇతర కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు లెక్కించనున్నారు. ఓట్లను కౌంటింగ్ చేసిన అధికారులు ప్రతిదీ కౌంటింగ్ ఏజెంట్లకు చూపించాలి. సీల్ ఉందా.. లేదా.. అనే విషయాలు తెలుస్తాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి పోలీసు బందోబస్తు నియమించారు. ముందస్తు ఫలితాలతో ఉత్కంఠ సాధారణ ఎన్నికల ఫలితాలకు ముందు స్థానిక, మున్సిపల్ ఫలితాలు వెలువడడంతో అభ్యర్థుల్లో మూడు రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. ముందుగా వచ్చిన ఫలితాలు మరోసారి రిపీటు అవుతాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముందొచ్చిన ఫలితాలు అభ్యర్థులకు కంటిమీదా కునుకు లేకుండా చేస్తున్నా.. ఆ ఫలితాలు సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపేవిగా లేదనే ధీమాతో అభ్యర్థులు ఉన్నారు. ఇక కౌంటింగ్ కోసం పార్లమెంట్ అభ్యర్థులు ఇప్పటికే 336 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు జిల్లా కేంద్రంలో జరుగగా, పెద్దపల్లి పార్లమెంట్ స్థానం ఓట్ల లెక్కింపు పెద్దపల్లిలో జరుగనుందని కలెక్టర్ అహ్మద్ బాబు బుధవారం నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నారు.