
అమరావతి, సాక్షి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ గుంటూరుకు వెళ్లి మరీ మిర్చి రైతులకు సంఘీభావం ప్రకటించిన వేళ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త నాటకానికి తెర తీశారు. మిర్చి రైతుల సమస్యలంటూ కేంద్రానికి ఓ లేఖ రాశారాయన.
గుంటూరు మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఆందోళన బాట పట్టారు కూడా. అయితే.. సీఎం హోదాలో చంద్రబాబు(CM Chandrababu) ఇన్నాళ్లు మిర్చి రైతుల కన్నీళ్లను పట్టించుకుంది లేదు. గిట్టుబాటు ధరల కోసం ఒక్క సమీక్ష జరిపిందీ లేదు. కనీసం మంత్రులను కూడా అక్కడికి పంపించలేదు.
అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్(YS Jagan) స్వయంగా వెళ్లి పరామర్శించాలనుకోగా.. ప్రభుత్వం అడుగడుగునా ఆటంకం కలిగించబోయింది. అయినా కూడా ఆయన ముందుకు వెళ్లారు. రైతులను కలిసి జగన్ వాళ్ల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. మీడియా ముఖంగా వాటిని వినిపించారు కూడా.
మిర్చి రైతుల గోడు విన్న జగన్‌కు పేరు దక్కవద్దనే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. జగన్ పర్యటన వేళ.. ఆగమేఘాల మీద మిర్చి రైతుల కోసం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు లేఖ రాసింది. మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం చంద్రబాబు.. రాష్ట్ర ప్రభుత్వం నుండి మాత్రం రైతులకు ఎటువంటి మద్దతు అందిస్తున్నారో తెలియజేకపోవడం గమనార్హం.

ఇదీ చదవండి: చంద్రబాబూ.. ఇకనైనా కళ్లు తెరిచి రైతుల్ని పట్టించుకో
Comments
Please login to add a commentAdd a comment