letter to center
-
లాక్‌డౌన్‌పై రాహుల్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కోవిడ్ విపత్తుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వ్యాక్సిన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలి.. కరోనాతో దెబ్బతిన్నవారికి ఆర్థిక సాయం అందజేయాలి అని రాహుల్ ప్రధానికి రాసిన లేఖలో కోరారు. "సెకండ్ వేవ్ సునామీలో దేశం విలవిల్లాడుతోంది. అధికారాన్ని ఉపయోగించి ఏం చేసైనా సరే ప్రజల ఇబ్బందులు తొలగించాలి. ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయుడే. దేశ జనాభా, జనసాంద్రత నేపథ్యంలో వైరస్ శరవేగంగా అనేక మ్యుటేషన్లకు గురవుతోంది. నియంత్రణ లేకుండా వైరస్‌ను వదిలేయడం వల్ల దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు" అని రాహుల్ ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. "వైరస్ మ్యుటేషన్లపై జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా అధ్యయనం చేయాలి. కొత్త మ్యుటేషన్లపై ప్రస్తుత వ్యాక్సిన్ల ప్రభావాన్ని పరీక్షించాలి. దేశ జనాభా మొత్తానికి మెరుపువేగంతో వ్యాక్సినేషన్ చేయాలి. మన అధ్యయనాల ఫలితాలను పారదర్శకంగా మిగతా ప్రపంచానికి తెలియజేయాలి. ప్రభుత్వానికి వ్యాక్సినేషన్‌పై స్పష్టమైన ప్రణాళిక లేదు. అలాగే విజయం సాధించకుండానే సంబరాలు జరుపుకున్నారు. ఫలితంగా దేశం అత్యంత ప్రమాదభరిత స్థితికి చేరుకుంది" అని రాహుల్ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. "ఈ విపత్తు అన్ని వ్యవస్థలు, యంత్రాంగాల సామర్థ్యాన్ని మించి సవాల్ విసురుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు మన దేశాన్ని మరో సంక్షోభంలోకి నెట్టి నేషనల్ లాక్డౌన్ దిశగా తీసుకెళ్తున్నాయి. దేశ ప్రజలకు తగిన ఆహార, ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించాలి. లాక్డౌన్ వల్ల జరిగే ఆర్థిక ఇబ్బందుల గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఆర్థికంగా లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే మహా విషాదకర సంక్షోభంలోకి దేశం వెళ్తుంది. ఈ సమయంలో అందరినికీ కలుపుకుని ముందుకెళ్లాలి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి మా మద్ధతు పూర్తిగా ఉంటుంది" అని రాహుల్ తెలిపారు. చదవండి: మన ప్రాణాల కన్నా ప్రధానికి అతడి స్వార్థమే ముఖ్యం -
ఘోర అన్యాయం: కేంద్రానికి ఘాటు లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ ఉ్యదమం చేస్తున్న రైతులకు మాజీ సివిల్ సర్వెంట్లు మద్దతుగా నిలిచారు. రైతులకు ఘోర అన్యాయం జరిగిందని, ఇది ఇంకా కొనసాగుతోంది అంటూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని మాజీ సివిల్ సర్వెంట్ల బృందం తప్పుబట్టింది. ఈ మేరకు 75 మంది మాజీ అధికారులు ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వానికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. హృదయపూర్వకంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా సర్కార్ అనుసరిస్తున్న విధానాలతో ఎప్పటికీ పరిష్కారం లభించదని స్పష్టం చేశారు. దేశంలో చాలా గందరగోళానికి కారణమైన సమస్యను ఇకనైనా పరిష్కరించాలని తమ లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. (‘చక్కా జామ్’ : 50 వేల మందితో భారీ భద్రత) రైతు ఉద్యమంలో పరిణామాలను తీవ్ర ఆందోళనతో గమనిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా జనవరి 26, రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో చోటుచేసుకున్న పరిణామాలు, సంఘటనలు, రైతులపై నిందలు వేయడానికి చేసిన ప్రయత్నాలపై మాజీ సివిల్ సర్వెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులకు తమ మద్దతును మరోసారి పునరుద్ఘాటించారు. తక్షణమే ఈ సమస్యను సంతృప్తికరంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. 18 నెలల పాటు చట్టాల అమలును నిలిపివేయడం లాంటి చర్యలను ప్రతిపాదించడానికి బదులుగా, ప్రభుత్వం ఒక స్నేహపూర్వక పరిష్కారంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. చట్టాలను ఉపసంహరించు , లేదా ఇతర సాధ్యమైన పరిష్కారాల గురించి ఆలోచించాలన్నారు. వ్యవసాయం రాజ్యాంగంలో రాష్ట్ర జాబితాలో ఉందని గుర్తు చేయడం విశేషం. (రైతులకు మద్దతు : గ్రెటా థన్‌బర్గ్‌పై కేసు) రైతుల నిరసన పట్ల ప్రభుత్వం మొదటినుంచీ మొండిగానే వ్యవహరిస్తోందని, ఈ వైఖరి ఘర్షణ సృష్టించేదిగానే ఉందని ఆరోపించారు. రైతులను ప్రతిపక్షంగా చూస్తూ, అపహాస్యం చేస్తున్నతీరును ఖండించారు. అలాగే కొంతమంది జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలపై దేశద్రోహ ఆరోపణలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాన్స్టిట్యూషనల్ కండక్ట్ కమిటీ (సీసీజీ)లో భాగమైన మాజీ ఐఏఎస్ ఆధికారులు నజీబ్ జంగ్, జూలియో రిబెరియో, అరుణ రాయ్ లతో పాటు జవహర్ సిర్కార్, అరబిందో బెహెరా, మాజీ ఐఎఫ్ఎస్ అధికారులు కెబి ఫాబియన్, అఫ్తాబ్ సేథ్, మాజీ ఐపిఎస్ అధికారులు జూలియో రిబెరియో, ఎకె సమతా తదితరులు ఈ లేఖపై సంతకం చేశారు. -
లక్షన్నర టన్నుల కందులు కొనండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సీజన్లో కందుల దిగుబడి 2.84 లక్షల మెట్రిక్ టన్నులు వస్తున్న నేపథ్యంలో లక్షన్నర టన్నులు సేకరించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రిహరీశ్‌రావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన మరో లేఖ రాశారు. మొదట 33,500 మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలుకు కేంద్రం అంగీకరించింది. మంత్రి విన్నపం మేరకు కేంద్రం 53,600 మెట్రిక్ టన్నుల సేకరణకు ఒప్పుకొంది. అయితే కంది దిగుబడి పెరగడంతో హరీశ్ ఆదేశాలతో ఎంపీ జితేందర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శి సి.పార్థసారథి కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌ను, ఆ శాఖ ఉన్నతాధికారులను ఢిల్లీలో కలసి విజ్ఞప్తి చేయడంతో 1.13 లక్షల మెట్రిక్ టన్నుల కందుల సేకరణకు అంగీకరిస్తున్నట్లు కేంద్రం బుధవారం రాష్ట్రానికి తెలిపింది. రాష్ట్రంలో కందుల దిగుబడి దృష్ట్యా కేంద్రం ఈ పరిమితిని సడలించాలని, లక్షలన్నర టన్నులు సేకరించాలని హరీశ్ కోరారు. 83,650 టన్నుల కొనుగోళ్లు.. తెలంగాణలో 83,650 మెట్రిక్ టన్నుల కందులను సేకరించారు.మొత్తం కందుల కొనుగోళ్ల విలువ రూ.455 కోట్లు. కొనుగోళ్ల అనంతరం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం తగదని హరీశ్ అన్నారు. కొనుగోలు చేసిన వెంటనే మార్క్‌ఫెడ్, హాకా సంస్థల అధికారులు కందులను గోడౌన్లకు తరలించి నాఫెడ్‌కు స్వాధీనపరచాలని సూచించారు. కందుల కొనుగోళ్లలో అక్రమాలు, అవకతవకలు జరిగితే సహించబోమన్నారు. కందుల రీ సైక్లింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంది రైతులకు మద్దతు ధర లభించాలన్నారు. జనగామ, భువనగిరిలలో కందుల క్రయవిక్రయాల్లో అవకతవకలు జరిగినందున జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. -
బాబు భూ సంతర్పణలపై కేంద్రానికి ఫిర్యాదు
- విలువైన భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు ఎలా కట్టబెడతారు? - ప్రభుత్వ భూ కేటాయింపుల ప్రక్రియపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించండి - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈ.ఏ.ఎస్. శర్మ లేఖాస్త్రం సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా అత్యంత విలువైన సర్కారీ భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కేటాయిస్తుండటాన్ని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆక్షేపించారు. విశాఖపట్నం జిల్లా మధురవాడలో రూ.338 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని ఓ ఐటీ సంస్థకు.. ఏపీఐసీకి చెందిన విలువైన 489 ఎకరాల భూమిని వీబీసీ ఫర్టిలైజర్స్‌కు అత్తెసరు ధరలకే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి.. ఈ భూదందా వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు శనివారం శర్మ లేఖాస్త్రం సంధించారు. రాజధాని నిర్మాణం నుంచి భూ కేటాయింపుల వరకూ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను ఆక్షేపిస్తూ, విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శర్మ ఎప్పటికప్పుడు లేఖాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు మరో లేఖ రాశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 2, 2012న ఇచ్చిన తీర్పులో భూ కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైన సూచనలు చేసిందని గుర్తు చేశారు. రోజు రోజుకూ భూముల ధరలు ఆకాశన్నంటోన్న నేపథ్యంలో.. ప్రభుత్వ భూములు లభ్యత, వాటి పరిరక్షణ కీలకంగా మారిందని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు. ప్రభుత్వ భూముల కేటాయించే సమయంలో ప్రజాభ్యుదయాన్ని దృష్టిలో ఉంచుకుని.. సర్కారుకు లాభం చేకూరేలా సమర్థవంతమైన సంస్థలకు మాత్రమే కేటాయించాలని సుప్రీం కోర్టు స్పష్టీకరించిందని ఆ లేఖలో వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు లేకుండా సర్కారీ భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడలో సర్వే నెంబరు 409లో ఏపీఐఐసీకి చెందిన రూ.338 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని భూమిని ఓ ఐటీ సంస్థకు తక్కువ ధరకు ధారదత్తం చేయడాన్ని తప్పుబట్టారు. కృష్ణా జిల్లాలో జగయ్యపేట మండలం జయంతిపురంలో సర్వే నెంబరు 93లో ఏపీఐఐసీకి చెందిన 499 ఎకరాల భూమిని అత్తెసరు ధరలకే వీబీసీ ఫర్టిలైజర్స్ సంస్థకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలపమెంట్ ఎనాబ్లింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములను 33 ఏళ్లకే లీజుకు ఇవ్వొచ్చునని.. కానీ 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేలా ఆ చట్టాన్ని సవరించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. భూ కేటాయింపుల తీరును పరిశీలిస్తే ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందని.. స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.