కొత్తగూడెంలో టీడీపీ, కాంగ్రెస్ రాస్తారోకో
Published Fri, May 12 2017 11:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
టేకులపల్లి: మిర్చి రైతులను ప్రభుత్వం వేధిస్తున్నందుకు నిరసనగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, మిర్చి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి వారిని హంతకులుగా చిత్రీకరించడాన్ని నిరసిస్తూ టీడీపీ, కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
బోడు రోడ్డు సెంటర్‌లో బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పాలనను నాయకులు ఎండగట్టారు. అలాగే రైతుల అరెస్టులను నిరసిస్తూ హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Advertisement
Advertisement