
వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు సంబంధించి..
సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చి యార్డకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులను కలిసి వారి కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మిర్చి యార్డ్‌కు వైఎస్ జగన్ రాక నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు, రైతులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఇసుకేస్తే రాలనంత జనం అక్కడికి వచ్చారు. తమ కష్టాలను వైఎస్ జగన్‌కు చెప్పుకునేందుకు రైతులు భారీగా అక్కడికి చేరుకున్నారు.
మరోవైపు.. వైఎస్ జగన్ పర్యటన సందర్బంగా పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఎక్కడా ట్రాఫిక్‌ను క్లియర్ చేయలేదు. మిర్చి యార్డ్ వద్ద పోలీసు అధికారులు భద్రత కల్పించలేదు. ఉద్దేశపూర్వకంగానే భద్రతా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా మిర్చి యార్డ్ వద్ద ఎక్కడా పోలీసులు కనిపించకపోవడం గమనార్హం.
