మిర్చి రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ | ys jagan mohan reddy visits guntur mirchi yard | Sakshi
Sakshi News home page

మిర్చి రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ

Published Fri, Mar 24 2017 7:52 AM | Last Updated on Tue, Aug 21 2018 4:40 PM

మిర్చి రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ - Sakshi

మిర్చి రైతులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖీ

గుంటూరు : ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం గుంటూరు మిర్చి యార్డ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మిర్చిరైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదన్నారు. పంట అమ్మితే కూలి డబ్బులు కూడా రావడం లేదన్నారు. ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ...వైఎస్‌ జగన్‌ వద్ద వాపోయారు.

ఈ మధ్యనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మార్కెట్‌ యార్డ్‌ను సందర్శించారని, ఆ తర్వాత మిర్చి క్వింటాల్‌ ధర మరింత పడిపోయిందని రైతులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే 60శాతం ధరలు పడిపోయాయన్నారు. పట్టిసీమ నుంచి కృష్ణాలో ఏ కెనాల్‌కు నీళ్లు ఇవ్వలేదన్నారు. కల్తీ విత్తనాలు, నీరు అందకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, రోజురోజుకు రైతులపై రుణభారం పెరుగుతూ ఉందని రైతులు తమ గోడు వెలిబుచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement