Guntur Market Yard
-
గుంటూరు మార్కెట్‌కు 'మిర్చి' వెల్లువ
సాక్షి, అమరావతి బ్యూరో: రాయలసీమ తదితర జిల్లాల నుంచి గుంటూరు మార్కెట్ యార్డుకు భారీగా మిర్చి తరలివస్తోంది. ఆది, సోమ, మంగళవారాల్లో వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, రైతులు పెద్దఎత్తున మిర్చి బస్తాల్ని తీసుకు రావడంతో 3.6 లక్షల బస్తాలతో మార్కెట్ యార్డు నిండిపోయింది. దీనివల్ల కొనుగోలు చేసిన సరుకుని బయటకు తరలించడం, బయటి నుంచి సరుకును లోనికి తీసుకు రావడానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో బుధవారం వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్కెట్ యార్డు అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టినప్పటికీ సాయంత్రానికి యార్డు ఆవరణలో 2.90 లక్షల బస్తాల సరుకు ఉండిపోయింది. దీంతో కొనుగోలు చేసిన సరుకును బయటకు తరలించేందుకు వీలుగా గురువారం మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, హడావుడి లేకుండా మిర్చి బస్తాలను యార్డుకు తరలించుకోవాలని అధికారులు సూచించారు. స్థిరంగా ధరలు గత ఏడాదితో పోలిస్తే మిర్చి ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. గుంటూరు మార్కెట్లో తేజ డీలక్స్ రకం క్వింటాల్ రూ.15,200, కర్ణాటక డబ్బీ బాడిగ రకం రూ.29 వేలు, బాడిగ రకం రూ.17 వేల నుంచి రూ.18 వేలు, నంబర్–5 రకం రూ.13,500, 341 రకం రూ.14 వేలు, 334 రకం రూ.11 వేలు, సూపర్–10 రకం రూ.11 వేల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. సరుకును యార్డులోకి తరలించాం గుంటూరు మిర్చి యార్డుకు మాచర్ల ప్రాంతం నుంచి కాయలు తీసుకొచ్చా. యార్డుకు పెద్దఎత్తున సరుకు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో సరుకును యార్డులోకి తరలించాం. – పంగా శ్రీనివాసులు, రైతు, మాచర్ల సరుకు భారీగా రావడంతో ఇబ్బందులు కర్నూలు నుంచి బుధవారం తెల్లవారుజామున మిర్చి తెచ్చా. సరుకు పెద్దఎత్తున రావడంతో యార్డులోకి సరుకు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడ్డా. సరుకును విక్రయించుకునేందుకు వీలుగా మార్కెట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. – లబాన్, రైతు, కర్నూలు జిల్లా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు మిర్చి క్రయ, విక్రయాలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వరుస సెలవు వల్ల మార్కెట్ యార్డుకు పెద్దఎత్తున సరుకు వచ్చింది. యార్డులో ఉన్న సరుకును క్లియర్ చేసేందుకు గురువారం సెలవు ప్రకటించాం. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సరుకును యథావిధిగా యార్డు పనిచేసే రోజుల్లో తీసుకు రావాలి. – వెంకటేశ్వరరెడ్డి, ఉన్నత శ్రేణి కార్యదర్శి, గుంటూరు మార్కెట్ యార్డు -
గుంటూరు: టిక్కీకి రూ.150 అద్దె
సాక్షి, అమరావతి: మిర్చిని నిల్వ చేసుకునే రైతుల నుంచి టిక్కీకి రూ.150 అద్దె వసూలు చేసేందుకు గుంటూరు కోల్డ్ స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకులు అంగీకరించారు. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డును ప్రభుత్వం మూసివేసింది. దీంతో కొందరు రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజి ప్లాంట్లలో నిల్వ చేసుకుంటున్నారు. దీన్ని తమకు అనుకూలంగా చేసుకునేందుకు కొందరు నిర్వాహకులు రైతుల నుంచి రూ.200 అద్దెను వసూలు చేస్తున్నారు. దీనిపై రైతులు బుధవారం మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాలను సేకరించిన ముఖ్యకార్యదర్శి కోల్డ్ స్టోరేజి ప్లాంట్ల నిర్వాహకులతో గురువారం చర్చలు జరిపి, ఇరువర్గాలకు ఆమోదయోగ్యంగా అద్దెను నిర్ణయించారు. సీజను పూర్తయ్యేవరకు రైతుల నుంచి ఒక్కో టిక్కీకి రూ.150 అద్దెను వసూలు చేసే విధంగా, హమాలీల ఎగుమతి, దిగుమతి ఖర్చులను నిర్వాహకులే భరించాలని నిర్ణయించారు. (259 మంది ఖైదీల విడుదల) -
ఆంధ్రా మిర్చి అ'ధర'హో..
కొరిటెపాడు(గుంటూరు): గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్కెట్లో గుంటూరు మిర్చి దుమ్ము రేపుతోంది. మిర్చి మార్కెట్లో శుక్రవారం తేజ రకం రికార్డు స్థాయిలో క్వింటా రూ.19,500ల ధర పలికింది. ఇప్పటికే రైతులు విక్రయించిన పంటను మినహాయిస్తే.. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన వారికి లాభాల పంట పండనుంది. ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చిని గతేడాది తక్కువ సాగు చేయగా.. చైనా, థాయిలాండ్ నుంచి ప్రస్తుతం భారీగా ఆర్డర్లు రావడంతో మిర్చి ఘాటు అ‘ధర’హో అనిపిస్తుంది. చైనా, థాయిలాండ్ నుంచి ఆర్డర్లు మిర్చి అమ్మకాలకు గుంటూరు మార్కెట్ దేశంలోనే పేరు పొందింది. ఏటా జనవరి మొదటి వారంలో సీజన్ ప్రారంభమవుతుంది. నెలరోజులు వేసవి సెలవులు మినహాయిస్తే నవంబర్ వరకు వ్యాపారం జోరుగా సాగుతుంది. ఈసారి బొబ్బర తెగులు, సాగునీటి కొరత వల్ల మిర్చి దిగుబడి భారీగా తగ్గింది. దీనికి తోడు రైతు ఆశించిన ధర దక్కలేదు. సగటున క్వింటాకు రూ.9 వేలు దక్కింది. అయితే ఒక్కసారిగా మిర్చికి అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది. విదేశాలకు గుంటూరు నుంచే ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తుతం చైనా, థాయిలాండ్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. మార్కెట్ యార్డులు, శీతల గిడ్డంగుల్లో సరుకు తక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగింది. మేలు రకం తేజ క్వింటా ధర రూ.19,500కు చేరింది. మిగిలిన మిర్చి రకాలు కూడా క్వింటా రూ.16 వేలు పలుకుతున్నాయి. క్వింటా రూ.22 వేలకు పెరిగే అవకాశం తేజ రకానికి ఇతర రాష్ట్రాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది పచ్చిమిర్చి ధర ఎక్కువగా ఉండటంతో ముందుగానే కోశారు. దీంతో పండు మిర్చి ఉత్పత్తి తగ్గడంతో ధరల పెరుగుదలకు కారణమైంది. పెరుగుదల ఇలాగే కొనసాగితే క్వింటా రూ.22 వేలకు చేరవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 10 లక్షల టన్నుల నిల్వలు ప్రస్తుతం రైతుల వద్ద మిర్చి నిల్వలు తక్కువగా ఉన్నాయి. శీతల గిడ్డంగుల్లో 10 లక్షల టన్నుల మేర నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలల నుంచి మిర్చి ధరలు పెరుగుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో తేజ, బాడిగ రకాలు క్వింటా రూ.13 వేలు, ఇతర రకాలు రూ.8 వేలు పలికాయి. ప్రస్తుతం తాలు రకాలు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్లోనూ రికార్డు ధర ఖమ్మం వ్యవసాయం: తెలంగాణలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం తేజ రకం మిర్చి క్వింటా ధర రికార్డు స్థాయిలో రూ.20,021లు పలికింది. గురువారం రూ.18,600 ఉండగా.. ఒక్క రోజులో ఏకంగా రూ.1,400లు పెరిగింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నర్సింహాపురం గ్రామానికి చెందిన ఎ.రామారావు నుంచి వ్యాపారులు ఈ ధరకు మిర్చిని కొనుగోలు చేశారు. ఖమ్మం మార్కెట్లో గతేడాది పండించిన పంటను వ్యాపారులు, కొందరు రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేశారు. ఆ నిల్వలకు జూన్ నుంచి ధర పెరుగుతూ వస్తోంది. జూన్‌లో రూ.11వేలు పలికిన ధర నవంబర్ నాటికి రూ.20 వేలకు చేరింది. ప్రస్తుతం పంటను ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. మిర్చికి ఈ స్థాయిలో ధర రావడంతో వ్యాపారులు, రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఈ ధర ఇలాగే కొనసాగితే ఈ ఏడాది సాగు చేసిన రైతులకు సిరులు కురుస్తాయని ఆనందంగా చెబుతున్నారు. పెరిగిన ధరలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.. మిర్చి ధరలు ఈ స్థాయిలో పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదు.. చాలా సంతోషంగా ఉంది. ధరలు ఇలానే కొనసాగితే రైతులు కష్టాల నుంచి గట్టెక్కడమే కాదు.. లాభాలనార్జిస్తారు కూడా. రెండెకరాలు కౌలుకు తీసుకుని పదేళ్లుగా మిర్చి సాగుచేస్తున్నా. అప్పులు తప్ప మిగిలిందేం లేదు.. ఈ దశలో మిర్చి ధరలు అమాంతంగా పెరగడం ఆశలు రేకెత్తిస్తోంది. మిర్చి రైతులకు మంచి రోజులొచ్చాయనిపిస్తోంది.. – కొక్కెర నాగేశ్వరరావు, విశదల, గుంటూరు జిల్లా -
సగం మిర్చికే రాయితీ
► ఇప్పటి వరకు ఈ పథకం వర్తించింది 5.25 లక్షల క్వింటాళ్లకే.. ► ఇంకా రైతుల వద్ద 5 లక్షల క్వింటాళ్లకుపైగా సరుకు ► కోల్డ్‌స్టోరేజీల్లో మిర్చికి వర్తించని రాయితీ పథకం మిర్చి..ఈ పేరు వింటేనే రైతుల కళ్లలో సుడులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు రైతు లోగిలిలో బంగారు సిరులు కురిపించిన పంట..గతేడాది ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, పెరిగిన పెట్టుబడులు, ధరల పతనంతో కుదేలైంది. ప్రతి ఇంటా అప్పుల కుంపటి రగిలించి రైతు గుండెల్లో ఆరని మంటలు మిగిల్చింది. పైపూతగా ప్రభుత్వం రాయితీ ప్రకటించినా..అదీ సగం సరుకుకు మాత్రమే అమలైంది. చివరకు మిర్చి రైతులను అప్పుల ఉరికొయ్యకు వేలాడదీసింది. సాక్షి, అమరావతి బ్యూరో: మిర్చి రైతులకు ఈ ఏడాది కోలుకోలేని దెబ్బ తగిలింది. మిర్చి రైతులను ఆదుకొంటామని, మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కోనుగోలు చేస్తామని ప్రభుత్వం మొదట్లో మభ్య పెట్టింది. చివరకు క్వింటాకు రూ.1500 రాయితీ ఇస్తామని ప్రకటించింది. అదీ 30 క్వింటాళ్ల వరకు మాత్రమే అంటూ పరిమితి విధించింది. దీనిని నమ్ముకొని గుంటూరు మార్కెట్ యార్డుకు మిర్చిని తీసుకొచ్చిన రైతులు నిలువునా మునిగిపోయారు. రాయితీ ప«థకం ప్రకటించాక మూడు రెట్లకుపైగా ధరలు పతనమయ్యాయి. సరుకు పెద్ద ఎత్తున యార్డుకు రావడంతో అమ్ముకోవటానికి రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేత ధర్నాతో.. మిర్చి రైతుల అవస్థలు చూసి చలించిపోయిన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి గుంటూరులో రెండు రోజులపాటు దీక్ష చేశారు. వెల్దుర్తి మండలంలో ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించారు. దీంతో హడావుడిగా మంత్రులు గుంటూరులో సమావేశం ఏర్పాటు చేసి మిర్చి యార్డుకు సెలవులు రద్దు చేస్తున్నామని, రైతుల నుంచి మిర్చి కోనుగోలు చేస్తామని ప్రకటించారు. అయితే అక్కడ హమాలీలు, వేమెన్, వ్యాపారులు, దిగుమతిదారులు మార్కెట్ యార్డు పాలకవర్గానికి సహకరించకపోవడంతో కొనుగోళ్లు నామమాత్రంగా జరిగాయి. సగం సరుకు రైతుల వద్దే.. ప్రస్తుతం ఇంకా రైతుల వద్ద 5 లక్షల క్వింటాళ్ల సరుకు ఉన్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో మార్కెట్ యార్డుకు సరుకు రాక తగ్గింది. ప్రస్తుతం యార్డులో మిర్చి బస్తాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాయితీ సొమ్ము చెల్లింపులో జాప్యం.. సరుకు కొనుగోలు చేసిన వ్యాపారులు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశాక..ఆ బ్యాంకు జిరాక్స్ కాపీ మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఇవ్వాలి. అప్పుడు మార్కెటింగ్ శాఖ రాయితీ సొమ్ము రూ.1500(క్వింటాకు) రైతుల ఖాతాకు జమ చేస్తుంది. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో రైతులకు వచ్చే కొద్దీగొప్పా మొత్తం కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ధర ప్రకటన చూసి మోసపోతున్నాం మార్కెటింగ్ శాఖ రోజూ ప్రకటిస్తున్న మోడల్ ధరను చూసి మోసపోతున్నామని కొంత మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఇక్కడికి మిర్చిని తీసుకొస్తే ధరలకు పొంతన ఉండడం లేదని పేర్కొంటున్నారు. మరో వైపు రైతుల వద్ద ఉన్న సరుకు నెలాఖరులోగా క్లియర్ కావడం గగనమేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ యార్డుకు సరుకు తక్కువగా వస్తున్నా..నాణ్యత సాకుతో వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. దీంతో మిర్చి రైతులు అన్ని విధాలా మునిగిపోతున్నారు. నెలాఖరు వరకు కోల్డ్‌స్టోరేజీల్లోనే.. ఈ నెల 30వ తేదీ వరకు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉన్న మిర్చిని బయటకు తీయొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కోల్డ్ స్టోరేజీల్లో సరుకు తీసి పెట్టుబడులకు ఉపయోగించుకుందామనుకున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నెలాఖరు వరకు ఆగాల్సి రావడంతో పెట్టుబడుల కోసం మళ్లీ వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. -
మిర్చి మంట
ఆగని ధరల పతనం.. సర్కారు మీనమేషాలు మిరప రైతు కడుపు రగిలిపోతోంది. ఏ అన్నదాతను కదిలించినా ఒకటే ఆవేదన.. సాయం చేస్తుందనుకున్న సర్కారే.. వ్యాపారులను మించిన లెక్కలు వేస్తోంది. నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో లేక అయినకాడికి సరుకును తెగనమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. మిర్చి యార్డులో ఖాళీ లేక, ఆరుబయట నిల్వ ఉంచితే అకాల వర్ష భయం రైతన్న గుండెను తొలిచేస్తోంది. సాక్షి, అమరావతి బ్యూరో: సరుకును ఇంట్లో ఉంచుకోలేక, మార్కెట్ యార్డుకు తెచ్చి వ్యాపారులు అడిగిన ధరకు అమ్మలేక మిర్చి రైతులు అయోమయంతో తల్లడిల్లిపోతున్నారు. మిర్చిని ఇంట్లో ఉంచితే వేడికి రంగు మారుతుందని, కల్లాల్లో ఉంచితే వర్షం వస్తే తడిసి పోతుందనే బెంగ రైతన్నను పట్టిపీడిస్తోంది. నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్ స్టోరేజిలు అందుబాటులో లేవు. దీంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు మార్కెట్ యార్డుకు సరుకు తీసుకొస్తే.. వ్యాపారులు, మార్కెటింగ్ పాలక వర్గం చుక్కలు చూపుతోంది. సరుకు అమ్ముకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరుకు నిల్వ అధికంగా ఉందనే సాకు చూపి వ్యాపారులు ధరలు పడిపోయేలా చేస్తున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నామ మాత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటోంది. ‘కాయలు పాడయిపోతున్నాయయ్యా.. ఇంట్లో ఉంచితే రంగు మారుతున్నాయి.. కల్లాల్లో ఉంచితే వర్షం వస్తే తడిసిపోతాయి.. తేజ మేలు రకం కాయలు మొదటి కోతయ్యా.. ఇంతకు మునుపు క్వింటాలు రూ.6000 కు అడిగితే ఇవ్వలేదు. ప్రభుత్వ బోనస్ వస్తుందని ఇక్కడకు తెస్తే, ఇక్కడ క్వింటా రూ.3500 – 4000కు మించి కొనుగోలు చేయడం లేదు. మీరే న్యాయం చేయండి’ అంటూ గుంటూరు మార్కెట్ యార్డులో శుక్రవారం ఉదయం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎదుట పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యార్డులో 7 లక్షల టిక్కీల సరుకు.... రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న రైతుకు 20 క్వింటాలు, క్వింటాకు రూ.1500 బోనస్ ప«థకమే కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.5000 గురించి ఆలోచించడం లేదు. రైతులు అందోళన చెందాల్సిన పని లేదని, జూలై చివరి వరకు మిర్చిని కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గుంటూరు మిర్చి యార్డులో శుక్రవారం ఉదయం స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన సరుకును ఇక్కడే ఉంచి పెద్ద ఎత్తున నిల్వ ఉన్నట్లు వ్యాపారులు, మార్కెటింగ్ సిబ్బంది కుమ్మక్కై ధరలు తగ్గించి అడుగుతున్నారు. దీంతో శుక్రవారం వచ్చిన 3.5 లక్షల టిక్కీలు, బయట 3.5 లక్షల టిక్కీలు.. మొత్తం 7 లక్షల టిక్కీల సరుకు ఉన్నట్లు సమాచారం. యార్డు మిర్చి బస్తాలతో నిండిపోయింది. సోమవారం మళ్లీ సరుకు అదనంగా వస్తే తిప్పలు తప్పవు. రూ.3 వేలకు కూడా కొనడం లేదు నేను మిర్చి యార్డుకు ఐదు క్వింటాళ్ల మిర్చిని తీసుకొచ్చా. ‘రాయితీ పథకం కింద వద్దు.. మామూ లుగా సరుకు అమ్ముకొని పో.. లేదంటే రెండు నెలల వరకు డబ్బులు రావు’ అని వ్యాపారులు చెబుతున్నారు. ‘తేజ’ రెండో కోత కాయలు క్వింటాలు రూ.3000కు కూడా అడగటం లేదు. ఇలాగైతే రైతుల గతేంటి? – బెల్లం అంజనేయలు, చీమకుర్తి రవాణా ఖర్చులూ రావట్లేదు మొన్నటి వరకు క్వింటాలు రూ.4000 – 5000 అమ్మిన మిర్చి.. ఇప్పుడు రూ.1500 – 2000కు కూడా అడగటం లేదు. రైతు పరిస్థితి దారుణంగా మారింది. ఆదుకునే నాథుడే లేరు. కోత కూలీల మాట దేవుడెరుగు.. కనీసం రవాణా ఖర్చులూ వచ్చే పరిస్థితి లేదు. – కేతవత్ గాసిరాం, హసన్‌బాద్ తాండ, మాచర్ల ఐదు కేంద్రాల్లో మిర్చి కొనుగోళ్లు శని, ఆదివారాల్లో గుంటూరు జిల్లా నడికుడి, వినుకొండ, కృష్ణా జిల్లా నందిగామ, కర్నూలు, ఒంగోలులో మిర్చి కొనుగోలు చేస్తామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా అనందబాబు ప్రకటించారు. మార్కెట్ యార్డులో జరిగిన సమీక్షలో పాల్గొన్న అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నందిగామ, నడికుడిలో శనివారం నుంచి, ఇతర ప్రాంతాల్లో ఆ తర్వాత మిర్చి కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ వెల్లడించారు. ఈ మార్కెట్లలో మిర్చి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు రవాణా చార్జీల్లో రాయితీ, అన్ని సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. కాగా, గుంటూరు మిర్చి యార్డుకు మే 16 నుంచి జూన్ 4 వరకు సెలవులు ప్రకటించారని, అయినా శని, ఆదివారాల్లో కొనుగోళ్లు కొనసాగుతాయని మంత్రులు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 రాయితీ పథకం ద్వారా ఇప్పటి వరకు 6,500 మంది రైతుల నుంచి 1.10 లక్షల క్వింటాళ్ల మిర్చిని కొనుగోలు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.5 వేల మద్దతు ధరలో స్పష్టత లేదని, రాష్ట్ర ప్రభుత్వ పథకాన్ని మాత్రమే కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా, అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మిర్చి కొనుగోళ్లపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది. క్వింటాల్‌కు మద్ధతు ధర రూ.8 వేలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు వెల్లడించింది. సమీక్షలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, మిర్చి యార్డు చైర్మెన్ మన్నవ సుబ్బారావు, జెసీ – 2 ముంగా వెంకటేశ్వరరావు, మార్కెట్ కార్యదర్శి దివాకర్, ఏడీ వరలక్ష్మి, పోలీసు, రవాణా, కార్మిక శాఖల అధికారులు, ఎగుమతి వ్యాపారుల సంఘం నాయకుడు దుగ్గిరాజు, హమాలీల సంఘం నాయకుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
మిర్చి రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖీ
-
రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం
-
రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం: వైఎస్ జగన్
గుంటూరు: రుణమాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రోజురోజుకు రైతులపై రుణభారం పెరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ శుక్రవారం గుంటూరు మిర్చి యార్డ్ సందర్శించి, మిర్చి రైతులతో ముఖాముఖీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓ వైపు పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, మరోవైపు బ్యాంకులు రుణాలు చెల్లించడం లేదంటూ రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదన్నారు. ఇక రైతులకు ఇవ్వాల్సిన నాణ్యమైన విత్తనాలను కిలో రూ.లక్ష చొప్పున బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్నారు. మార్కెట్లో విచ్చలవిడిగా కల్తీ విత్తనాలు విక్రయిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి...తక్షణమే మార్క్ ఫెడ్లను రంగంలోకి దించి మిర్చి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధరలు పడిపోయినపుడు ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. -
మిర్చి రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖీ
గుంటూరు : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు మిర్చి యార్డ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మిర్చిరైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదన్నారు. పంట అమ్మితే కూలి డబ్బులు కూడా రావడం లేదన్నారు. ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ...వైఎస్ జగన్ వద్ద వాపోయారు. ఈ మధ్యనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మార్కెట్ యార్డ్‌ను సందర్శించారని, ఆ తర్వాత మిర్చి క్వింటాల్ ధర మరింత పడిపోయిందని రైతులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే 60శాతం ధరలు పడిపోయాయన్నారు. పట్టిసీమ నుంచి కృష్ణాలో ఏ కెనాల్‌కు నీళ్లు ఇవ్వలేదన్నారు. కల్తీ విత్తనాలు, నీరు అందకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, రోజురోజుకు రైతులపై రుణభారం పెరుగుతూ ఉందని రైతులు తమ గోడు వెలిబుచ్చారు. -
'మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి'
గుంటూరు: మిర్చి మార్కెట్ యార్డును వైఎస్సార్సీపీ నేతలు శుక్రవారం సందర్శించారు. మిర్చి ధరలపై రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం క్వింటాకు రూ.5 వేలే ధర పలుకుతుండటంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు. వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్చి మార్కెట్‌ను సందర్శించిన వారిలో మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ముస్తాఫా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు తదితరులు ఉన్నారు. -
మార్కెట్ యార్డులో సీబీఐ విచారణ
గుంటూరు : గుంటూరు మార్కెట్ యార్డులో గత ఏడాది జరిగిన పత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు, అవకతవకలకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేసేందుకు వీలుగా దర్యాప్తును ముమ్మరం చేశారు. శుక్రవారం సీబీఐ అధికారులు గుంటూరు మిర్చి యార్డులో పలు వివరాలు సేకరించారు. అధికారులు, సిబ్బంది నుంచి పలు ఫైళ్లు తెప్పించుకొని క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. దీంతో పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరూ ఏ క్షణంలో ఏం ముంచుకొస్తుందోనని బెంబేలెత్తుతున్నారు. అక్రమాలకు మూలకారణమైన సీసీఐ బయ్యర్ల ఇళ్లపైనే ప్రధానంగా సీబీఐ గతంలో దాడులు నిర్వహించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అమరావతి మండలం లింగాపురం, క్రోసూరు, పొన్నూరు, పెదనందిపాడు, పిడుగురాళ్ల, మైలవరం, కుక్కునూరు, నందిగామ వ్యవసాయ కమిటీల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ ఇంతకుముందు దృష్టి పెట్టింది. అంతకంటే కిందిస్థాయి సిబ్బందిని కూడా విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని సీబీఐ అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీసీఐ బయ్యర్లకు సహాయకులుగా ఉన్న అసిస్టెంట్లతో పాటు మార్కెటింగ్ శాఖకు సంబంధించి వేమెన్లను కూడా విచారించేందుకు సీబీఐ రంగం సిద్ధం చేసుకుంటోంది. గుంటూరు మార్కెట్ యార్డులో కింది స్థాయి అధికారులను శుక్రవారం విచారించినట్లు సమాచారం. -
గుంటూరు యార్డు చైర్మన్‌గా మన్నవ
డెరైక్టర్లను నియమించని రాష్ట్ర {పభుత్వం టీడీపీలో అంతర్గత కలహాలే కారణం గుంటూరు : ఎట్టకేలకు గుంటూరు మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్‌గా మన్నవ సుబ్బారావు నియమితులయ్యారు. అయితే ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కార్యవర్గాన్ని నియమించలేదు. వాస్తవానికి చైర్మన్ పదవితో పాటు 19 మంది డెరైక్టర్ల పేర్లను సైతం ఒకేసారి ప్రకటించడం ఆనవాయితీ.అయితే పార్టీలో నెలకొన్న అంతర్గత వివాదాల కారణంగా డెరైక్టర్లను ఇప్పటి వరకు నియమించలేదని సమాచారం. డెరైక్టర్ల పదవులకు పేర్లు ఇవ్వని ఎమ్మెల్యే... తొలి నుంచి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి యార్డు ైచైర్మన్ పదవిని పెదకూరపాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై పోటీ చేసి ఓడిపోయిన వెన్నా సాంబశివారెడ్డికి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. గత నెలలో సీఎం చంద్రబాబు గుంటూరులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఆ సమయంలో సైతం డెరైక్టర్ల పేర్లను ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. దీంతో చైర్మన్ పదవిని మన్నవకు ఇస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలిచ్చినట్టయింది.అదేసమయంలో వెన్నాకు ఏదొక కార్పొరేషన్ పదవి ఇస్తామని, ఆయనకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మోదుగుల మాత్రం వెన్నా సాంబశివారెడ్డికి న్యాయం జరగని పక్షంలో యార్డు డైరక్టర్ల పదవులకు పేర్లు ఇచ్చేది లేదని భావిస్తున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఎంపీపీ నుంచి... ఇదిలాఉంటే యార్డు చైర్మన్‌గా నియమితులైన మన్నవ సుబ్బారావు 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 1987లో మేడికొండూరు మండల పరిషత్ అధ్యక్షునిగా, 1993లో మేడికొండూరు జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యారు. తర్వాత జిల్లా పార్టీలో పలు పదవులను ఆయన నిర్వహించారు. ఎన్నికల సమయంలో చీఫ్ ఎన్నికల ఏజెంట్‌గా పనిచేయడంతో పాటు జిల్లా ఎన్నికల మానటరింగ్ సెల్ కన్వీనర్‌గా పనిచేశారు. పూర్తిస్థాయిలో కార్యవర్గం ఎంపిక తర్వాతే ప్రమాణస్వీకారం పార్టీ అధిష్టానం మార్కెట్‌యార్డు చైర్మన్‌గా నియమించడం సంతోషంగా ఉంది. అయితే ఈ పదవిని కోరుకోలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేయడమే నా పని. ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో యార్డుకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరులో యార్డు చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేస్తాం. రైతుల సంక్షేమం కోసం నా శక్తి వంచనలేకుండా కృషిచేస్తా. - మన్నవ సుబ్బారావు -
బొక్కింది..మూడు కోట్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : పత్తి కుంభకోణం కాయకష్టం చేసే కార్మికుల్లోనూ చిచ్చుపెట్టింది. సీజన్లో రావాల్సిన కూలి డబ్బులు సైతం రాకుండా చేసింది. సీసీఐ బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది మిలాఖత్ కావడమే ఇందుకు కారణం. పత్తి బయ్యర్లకీ, యార్డులో ముఠా కూలీలకు, హమాలీలకు ఏమిటీ సంబంధం అనుకుంటున్నారా? ఇదిగో ఇలా... భారత పత్తి సంస్థ (సీసీఐ) నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఏమూల పత్తి కొన్నా అది ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ మార్కెటింగ్ యార్డుల్లోని కొనుగోలు కేంద్రానికి చేరాలి. వచ్చిన లారీల్లోని పత్తి బోరాలను కార్మికులు దిగుమతి చేసి, కాటా వేసిన తరువాత ఎగుమతి చేస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది 43 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో కేంద్రంలో సగటున 25 నుంచి 30 మంది వరకు కూలీలు (తూకం వేసే వారితో సహా) ఉంటారు. నాలుగు డబ్బులొచ్చే సీజన్ ఇదే వాళ్లకి. రోజుకు సగటున 400 రూపాయల కూలి వస్తుంది. మరేం జరిగింది...? సీసీఐ ఈ ఏడాది సుమారు 93.65 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. లెక్కప్రకారం ఇదంతా మార్కెటింగ్ యార్డులకు వచ్చి అక్కడి నుంచి జిన్నింగ్ మిల్లులకు చేరాలి. అలా జరగడానికి బదులు కేవలం 30 శాతమే అంటే 28 లక్షల క్వింటాళ్లు మాత్రమే రావడంతో కార్మికుల పాలిట సీజన్ కుదేలయింది. మిగతా 70 శాతం నేరుగా జిన్నింగ్ మిల్లులకు చేరింది. దీనివల్ల 90 రోజుల పాటు పని ఉంటుందనుకున్న కార్మికులకు నిరాశే మిగిలింది. 4.5 కోట్ల రూపాయల కూలి డబ్బులకు రెక్కలు... రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో రోజుకు సుమారు 13వందల మంది కార్మికులు పనిచేశారు. 90 రోజుల పాటు పని ఉంటుందనుకుంటే రోజకు రూ.400 చొప్పున రూ.4.65 కోట్ల రూపాయలు రావాలి. కానీ వచ్చింది మాత్రం కేవలం కోటిన్నరే. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే రూ.1,54,80,000లను మాత్రమే. మిగిలిన రూ.3.10 కోట్ల రూపాయలు కాకిలెక్కలకు పరిమితమైంది. ఈమేరకు రికార్డులు సృష్టించి మార్కెటింగ్ శాఖ, సీసీఐ సిబ్బంది, బయ్యర్లు మింగేశారు. రికార్డులు సృష్టించారిలా... జిన్నింగ్ మిల్లులకు తరలించిన 65.65 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్టు, దాన్ని దిగుమతి, ఎగుమతి చేసినట్టు రికార్డులు సృష్టించారు. క్వింటాల్‌కు 5 నుంచి 9 రూపాయల మధ్య రాసుకుని సీసీఐ నుంచి రాబట్టుకుని స్వాహా చేశారు. కూలీల సంఘాలనే చీల్చారు... ఈ విషయం తెలిసిన కార్మికులు తామసలు యార్డుల్లో ఎగుమతి, దిగుమతే చేయలేదని అడ్డం తిరిగారు. దీనివెనుకేదో మతలబు ఉందని గ్రహించి ఆందోళనకు దిగారు. ఈ విషయం బయటకు పొక్కకుండా బయ్యర్లు కొంత మొత్తాన్ని తమ అనుయాయులుగా ఉన్న కార్మికులకు ముట్టజెప్పి సద్దుమణిగేలా చేయాలని చూశారు. దీనికి కొందరు అంగీకరించకపోవడంతో అసలు సంఘాన్నే చీల్చారు. గుంటూరు మార్కెట్ యార్డులో జరిగిన సంఘటనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. 3 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసినట్టు లెక్కల్లో చూపితే ఓ వర్గం ముఠా కూలీలు వ్యతిరేకించారు. దీంతో అధికారులు ఆ సంఘంలోనే కొంత మందిని ఉసికొల్పి వారి మధ్యే గొడవ పెట్టించారు. దీంతో ఓవర్గం కూలీలు బజారున పడి ధర్నా చేయకతప్పలేదు. తెలివిగల పెద్దలు రంగంలోకి దిగి ఇరువర్గాల నోళ్లు మూయించేలా చెరికొంచెం ముట్టజెప్పి రాజీ కుదర్చడం కొసమెరుపు. -
యార్డులో సీబీఐ విచారణ
పత్తి కొనుగోలుకు సంబంధించి రెండు రకాల రికార్డులు స్వాధీనం సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు మార్కెట్ యార్డు నుంచి సీబీఐ అధికారులు గురువారం రెండు రకాల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. తక్పట్టి, కాటా చిట్టాలను మాత్రమే స్వాధీనం చేసుకోగా, మరో మూడు ముఖ్య రికార్డులను పరిశీలన చేయలేదని తెలుస్తోంది. రైతు నుంచి నేరుగా యార్డుకు పత్తి వచ్చినప్పుడు ఎరైవల్, సేల్స్, డిస్పాచ్ రికార్డుల్లో వాటి వివరాలు నమోదు అవుతాయి. రికార్డుల ప్రకారం గుంటూరు యార్డుకు సుమారు 3 లక్షల క్వింటాళ్ల పత్తి వచ్చినట్టు చెబుతున్నప్పటికీ, కేవలం 1600 క్వింటాళ్లే వచ్చినట్టు అక్కడి కార్మిక వర్గాలు చెబుతున్నాయి. పత్తి కొనుగోలులోని అక్రమాలను వివిధ దినపత్రికలు ప్రచురించడంతో మార్కెట్ యార్డు అధికారులు అప్రమత్తమై పత్తి యార్డుకు వచ్చినట్టుగా రికార్డులు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పనిలో ఐదుగురు కార్యదర్శులను నియమించేందుకు యార్డు ఉన్నతాధికారులు ప్రయత్నించగా, నలుగురు కార్యదర్శులు ఈ రికార్డుల తారుమారుకు అంగీకరించలేదు. రవికుమార్ అనే కార్యదర్శి ఈ తారుమారు కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని సీబీఐ అధికారులు కోరినప్పుడు యార్డులోని మరో కార్యాలయంలో ఉన్నాయని చెప్పి, రహస్యప్రాంతం నుంచి ఈ రికార్డులు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గోతాల రికార్డులను అధికారులకు చూపించగా, సీబీఐ అధికారులు ఒక బాక్సులోనే ముఖ్య రికార్డులను తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఎరైవల్, సేల్సు, డిస్పాచ్లకు సంబంధించిన రికార్డులను మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఇస్సార్ అహ్మద్ ఇంతకు ముందే హైదరాబాద్ తీసుకువెళ్లారని, మొదట్లో ఈ అక్రమాలపై విచారణ జరిపినప్పడు తనతోపాటు వీటిని హైదరాబాద్ తీసుకువెళ్లారని, అందుకనే సీబీఐ అధికారులు అతి ముఖ్యమైన ఈ మూడింటిని పరిశీలన చేయలేకపోయారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. -
రైతు కంట్లో కారం..!
⇒ మిర్చి యార్డులో కమీషన్ వ్యాపారుల మాయాజాలం ⇒ అధిక కమీషన్ నొక్కేస్తున్నారనే ఆరోపణలు వెల్లువ ⇒ రెండేళ్లుగా లెసైన్స్‌లు లేకుండానే వ్యాపారాలు ⇒ శ్యాంపిల్ పేరిట లాట్ల నుంచి కిలోల కొద్దీ తీసివేత పాత గుంటూరు : గుంటూరు మిర్చియార్డులో రైతులు దోపిడీకి గురవుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు మిర్చిని యార్డుకు తీసుకువచ్చి అమ్మకాలు చేస్తుంటారు. అమ్మకాల్లో ఏజెంట్లు నూటికి రూ.2 కమీషన్ తీసుకోవాల్సి వుండగా, రూ.3 నుంచి రూ.5.50 వరకు తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై రెండు రోజుల కిందట యార్డులో రైతులకు , కమీషన్ వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను యార్డుకు తీసుకువస్తుంటే కమీషన్ వ్యాపారులు మాయ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత కమీషన్ కట్ చేస్తున్నారనే విషయం కూడా తమకు తెలియడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మిర్చిలో తేమ శాతం ఎక్కువగా ఉందని ధర తగ్గిస్తున్నట్టు చెపుతున్నారు. కమీషన్ వ్యాపారులు, కొనుగోలుదారులు ముందుగానే ఒప్పందం ప్రకారం రైతులు తెచ్చిన లాట్లకు ధర నిర్ణయిస్తారు. దీనిలో కూడా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని సమాచారం. దీనిపై సంబంధిత శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లెసైన్సులు లేకుండానే వ్యాపారం ... గుంటూరు మార్కెట్ యార్డులో వ్యాపారులు రెండేళ్లుగా లెసైన్సులు లేకుండానే వ్యాపారం చేస్తున్నారు. గత ఏడాది సుమారు 500 షాపులకు రెన్యువల్ చేయాల్సి ఉంది. అప్పటి మార్కెట్ యార్డు కమిటీ దృష్టికి 293 షాపులకు సంబంధించి అవకతవకలు ఉన్నాయనిఆరోపణలు రావడంతో రెన్యువల్ చేయకుండా నిలిపివేశారు. ఇప్పటికీ లెసైన్స్‌లు లేకుండానే వ్యాపారం సాగుతోంది. లాటులో బస్తాలు కట్ చేస్తే తరుగు.. రైతులు యార్డుకు అమ్మకానికి తీసుకువచ్చిన మిర్చిని కొనుగోలుదారులు శ్యాంపిల్ చూస్తామంటూ బస్తాలను మధ్యలో కట్ చేస్తుంటారు. ఈ క్రమంలో కిలో నుంచి రెండు కిలోల వరకు మిర్చిని లాగేసి శ్యాంపిల్ చూస్తారు. ఒక్కో లాట్లో నాలుగైదు బస్తాల్లో ఇలా తేడాలు వస్తున్నాయని రైతులు తెలుపుతున్నారు. హమాలీలు కూడా ఆ మిర్చిని వదిలేసి బస్తాలను కుట్టడంతో తరుగు వస్తుందని రైతులు చెపుతున్నారు. కమీషన్ వ్యాపారులే గ్రామాల్లో కొనుగోళ్లు ... కమీషన్ వ్యాపారులే స్వయంగా గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని రైతుల వద్ద నుంచి మిర్చి కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో కూడా రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యార్డుకు వెళితే బస్తాకు చాలా ఖర్చు అవుతుందని ప్రచారం చేసి స్వయంగా ఏజెంట్లే కొనుగోలు చే సి కమీషన్ వ్యాపారస్తులకు సంబంధించిన కోల్డ్ స్టోరేజీలకు తరలిస్తున్నారు. కమీషన్ వ్యాపారులు కోల్డ్ స్టోరేజీల్లోనే అమ్మకాలు స్వయంగా ఎగుమతిదారులతో నిర్వహిస్తున్నారు. ఉన్నత శ్రేణి కార్యదర్శి వివరణ... యార్డులో అవకతవకలపై యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి రామ్మోహనరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా రైతుల నుంచి అధిక కమీషన్ వసూలు చేస్తున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. అధికంగా కమీషన్ తీసుకుంటున్నారని అనుమానం వస్తే రైతులు నిర్భయంగా తనకు ఫిర్యాదు చేస్తే వెంటనే విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఘాటు తగ్గిన మిరప
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: నెల క్రితం వరకు మంచి ఓ మోస్తరుగా ఉన్న మిరపకాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. తీరా పంట చేతికొచ్చే సమయంలో ధరలు అమాంతం పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అధిక వర్షాలు, తెగుళ్ల బెడదతో దిగుబడి తగ్గడంతో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆళ్లగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని చాగలమర్రి, ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల మండలాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేశారు. గతేడాది మిరపకాయలు క్వింటా రూ. 4వేల నుంచి రూ. 4,500 వరకు ధర పలికాయి. ఖరీఫ్‌లో క్వింటా రూ. 10 వేలకు పైగానే పలికింది. దీంతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో మిరప సాగు చేశారు. ఫిబ్రవరిలో గుంటూరు మార్కెట్లో ఇదే ధర ఉన్నట్లు నల్లగట్ల గ్రామానికి చెందిన రైతు విజయ్ న్యూస్‌లైన్‌కు తెలిపారు. ప్రస్తుతం మిరప కోతలు పూర్తికావడం తో రైతులు అమ్మకానికి సిద్ధం చేశారు. తీరా పంట చేతికొచ్చాక మిరపకాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉందని, అధిక వర్షాలు, తెగుళ్లతో ఎకరాకు 15 నుంచి 17 క్వింటాళ్లలోపు మాత్రమే దిగుబడి వచ్చిందని గూబగుండం గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి వాపోయాడు. ప్రస్తుతం మిరపకాయ ధరలు క్వింటా రూ. 4,500 లోపు మాత్రమే ఉండటంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 70వేల నుంచి రూ. 80వేల వరకు పెట్టుబడులు పెట్టినట్లు రైతులు తెలిపారు. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తే పెట్టుబడులు మాత్రమే చేతికి వస్తాయని, అంతకు తగ్గితే నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. -
ఇరకాటంలో మిర్చి రైతు
లెసైన్సులు రెన్యువల్ కాకుండానే కమీషన్ ఏజెంట్ల వ్యాపారం గుంటూరు యార్డుకు జమ కాని లక్షలాది రూపాయలు సాక్షి, గుంటూరు: గుంటూరు మిర్చియార్డులో మొత్తం 582 మంది కమీషన్ ఏజెంట్లు లెసైన్సులు కలిగి ఉన్నారు. ఇందులో 193 మంది ఏజెంట్ల లై సెన్సుల కాలపరిమితి 2013 మార్చి 31తో ముగిసింది. వీరందరూ ఐదేళ్లకు ఒకేసారి లెసైన్సు ఫీజు చెల్లించి రెన్యువల్ చేయించుకోవాలి. అయితే కమీషన్ ఏజెంట్ల భాగస్వామ్య బదిలీల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం రెన్యువల్స్‌ను నిలిపివేసింది. ఇందుకు బాధ్యు లుగా పేర్కొంటూ 11 మంది మార్కెటింగ్ సూపర్వైజర్లను కూడా సస్పెండ్ చేసింది. ఆ తరువాత యార్డు అధికారులు జనవరి రెండో వారంలో 16వ తేదీ నుంచి ఆ 193 మంది జరిపే మిర్చి వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. సంకట స్థితిలో పడిన కమీషన్ ఏజెంట్లు తమ వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందులు కలుగజేయవద్దంటూ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకున్నారు. దీన్ని గుర్తించిన మార్కెటింగ్‌శాఖ అధికారులు నెల రోజుల పాటు వ్యాపారానికి అనుమతి ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. అయితే లెసైన్సు రెన్యువల్ చేసుకోని కమీషన్ ఏజెంట్లకు మిర్చిని విక్రయించే విషయంలో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. లెసైన్సులు రెన్యువల్ జరగని కమీషన్ ఏజెంట్ల వద్ద మిర్చిని విక్రయిస్తే భోజన టోకెన్లు ఇస్తారో, లేదోనన్న అనుమానం కూడా కొందరు రైతుల్లో ఉంది. రెన్యువల్ లేని వ్యాపారుల వద్ద కూడా రశీదు పుస్తకాలు ఉండటం, బిల్లులు, హమాలత్ పట్టీలు రాయడం మామూలుగానే జరుగుతుంది. కాకపోతే మార్కెటింగ్ శాఖకు లెసైన్సుల ఫీజు కింద లక్షలాది రూపాయలు జమ కాకుండానే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. మార్కెట్‌యార్డు చరిత్రలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదు. రైతులకు ఇబ్బంది ఉండకూడదనే... వాస్తవంగా లెసైన్సులు రెన్యువల్ చేయించుకున్నాకనే కమీషన్ ఏజెంట్లు యార్డులో వ్యాపారాలను కొనసాగించాలనీ, రైతులకు ఇబ్బంది కలగ కూడదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం నెల రోజుల పాటు వీరికి అనుమతి ఇచ్చినట్లు మిర్చియార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి నరహరి తెలిపారు. లెసైన్సుల రెన్యువల్ విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. -
మార్కెట్ యార్డులో విజిలెన్స్ తనిఖీలు
సాక్షి, గుంటూరు: గుంటూరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. గతంలో మార్కెట్‌యార్డులో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు హమాలీలకు ప్రభుత్వం చెల్లించిన పరిహారంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు విడతలుగా పంపిణీ చేసిన పరిహారం మొత్తం విలువ రూ.41లక్షల వరకు ఉంది. బాధితుల వివరాలు, పరిహారం అందజేత సంతకాలకు సంబంధించిన ఫైలు యార్డులో మాయమైందని అధికారులు తేల్చారు. వాస్తవాలపై విచారించి నివేదిక పంపాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలిచ్చింది. విజిలెన్స్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు తాజాగా విజిలెన్స్ సీఐ షేక్ ఖాశింసైదా, కె.వెంకట్రావు యార్డుకు వెళ్లారు. యార్డు కార్యదర్శి ఐ.నరహరిని కలిసి సదరు ఫైలు మాయంపై లిఖితపూర్వకంగా వివరాలను సేకరించారు. అనంతరం అప్పట్లో పరిహారం అందజేసిన యార్డు ఉద్యోగులు వి.ఆంజనేయులు, ఐ. వెంకటేశ్వరరెడ్డి, రమేష్, సుబ్రమణ్యం లను పిలిపించారు. వారి సమక్షంలోనే రికార్డు గదిని తెరి పించి ఫైళ్లు తనిఖీచేశారు. పరిహారం తీసుకున్న హమాలీల జాబితా, వారి సంతకాలు, ఏఏ బ్యాంకుల ఖాతాల్లో పరిహారం జమచేసిందనే అంశాలపై యార్డు ఉద్యోగులను విచారించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ హమాలీల పరిహారం అందజేతపై విచారణను సగానికి పైగా పూర్తిచేశామని.. వీలైనంత త్వరలోనే వాస్తవాల్ని వెలుగులోకి తెస్తామని తెలిపారు. -
అధికారుల అలసత్వం అక్రమాలకు ఆజ్యం
సాక్షి, గుంటూరు: గుంటూరు మిర్చియార్డులో జరిగిన అక్రమాల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచీ అలసత్వాన్ని కనబరిచింది. అధికారులందరూ తమకేమీ పట్టనట్టు మిన్నకుండిపోయారు. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా నిబంధనలను గాలిలో కలిశాయి. పలు అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయి. లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అక్రమాల్లో అందరూ దొంగలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎన్.శివరామయ్య, వి. హరినారాయణలు యార్డు కార్యదర్శులుగా పనిచేసిన రోజుల్లో 11 మంది సూపర్వైజర్లు నిబంధనలు ఉల్లంఘించి సుమారు 193 మంది కమీషన్ ఏజెంట్ల లెసైన్స్‌లు బదిలీ చేశారన్నది ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. ఈ కారణంతోనే వీరిపై సోమవారం సస్పెన్షన్ వేటు వేసింది. అధికారులను తప్పుదోవ పట్టించి ఒక్కొక్కరూ లెసైన్సుల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వం పేర్కొంది. అయితే లెసైన్సులు బదిలీ చేసే అధికారం సూపర్వైజర్లకు ఉందో, లేదోనన్న విషయాన్ని మాత్రం విస్మరించింది. ఒక వేళ సూపర్వైజర్లు అధికారులను తప్పుదోవ పట్టించి అనధికారిక ంగా లెసైన్స్‌లు బదిలీ చేస్తుంటే, అప్పట్లో ఉన్న యార్డు పాలకవర్గం, కార్యదర్శులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు..ఏకంగా 11 మంది సూపర్వైజర్లు 193 మంది ఏజెంట్ల లెసైన్స్‌లు మారుస్తున్నపుడు ఎవరూ గుర్తించలేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో అధికారుల తీరు కూడా విస్మయాన్ని కలిగిస్తోంది. యార్డులో ఇప్పటికీ అనధికార లెసైన్సులు కలిగివున్న వ్యాపారులు లెసైన్సు ఫీజు లేకుండా వ్యాపారం చేస్తున్నా ఎవరూ పట్టించు కోవడం లేదు. వీరి లెసైన్స్‌లు బదిలీ చేయడం తప్పయినపుడు లెసైన్స్ ఫీజు చెల్లించకుండా వీరు చేస్తున్న వ్యాపారం ఏ మేరకు చట్టబద్ధమైనదో అర్థం కావడం లేదు. వీరి విషయంలో మార్కెటింగ్‌శాఖ అధికారులు మిన్నకుండిపోవడంలో ‘అర్థ’మేంటో తెలియడం లేదు. లెసైన్స్‌లు రెన్యువల్ చేయించుకోకుండా వ్యాపారం చేస్తున్న వారి విషయంలోనూ అధికారులు మౌనంగా వ్యవహరిస్తున్నారన్నది మరో ఆరోపణ. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి అక్రమాలకు కేవలం సూపర్వైజర్లే కారణమన్న చందాన సస్పెన్షన్ల వేటు వేయడం ఎంత వరకు సమంజసమంటూ కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వివరణ కూడా అడగకుండా ఒకే ఆర్డర్లో చార్జిమెమో, సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వడం చూస్తుంటే అధికారుల తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. కింకర్తవ్యం.. ఇదిలా ఉండగా సస్పెన్షన్ వేటు పడిన కొందరు ఉద్యోగులు మంగళవారం గుంటూరులో సమావేశమైనట్లు తెలిసింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నట్లు సమాచారం. గుంటూరులోని కీలకమైన అధికారిని కలిసి రాగల ముప్పు నుంచి బయటపడేయమని కోరినట్లు తెలిసింది.