mirchi yard
-
కేరళ బృందం మిర్చి యార్డు సందర్శన
కొరిటెపాడు(గుంటూరు): కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ బృందం గుంటూరులోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంగళవారం సందర్శించింది. బృందంలోని సభ్యులు కమిషనర్ డాక్టర్ డి.సజిత్బాబు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంజీబ్‌కుమార్ పట్జోషి, కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రైవేటు సెక్రటరీ ప్రదీప్‌కుమార్ యార్డును సందర్శించిన వారిలో ఉన్నారు. వారికి గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి సాదర స్వాగతం పలికారు. మిర్చి యార్డులోని మిర్చి కమీషన్ షాపులను కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలించారు. యార్డు పనితీరు తదితర అంశాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం ఛాంబర్లో కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏసురత్నం మాట్లాడుతూ.. ప్రపంచంలోని సుమారు 15 దేశాలకు గుంటూరు నుంచి మిర్చి ఎగుమతి చేస్తున్నామన్నారు. కేరళ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం, అనంతవరప్పాడు గ్రామంలో మిర్చి పంట సాగును బృందం పరిశీలించింది. ఆర్డీవో ప్రభాకరరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారిణి పద్మశ్రీ, ఉద్యానశాఖ అధికారి ఎన్.సుజాత తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లా 'మిర్చి' రైతులకు మంచిరోజులు..
కర్నూలు జిల్లా మిర్చి రైతులకు మంచిరోజులు వచ్చాయి. పంట అమ్ముకోవడానికి ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి నిరీక్షించాల్సిన అగత్యమూ తప్పింది. నంద్యాలలో త్వరలోనే మిర్చి యార్డు ఏర్పాటు కానుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, నంద్యాల: కర్నూలు జిల్లాలో మిర్చి ఎక్కువగా పండించే ప్రాంతం నంద్యాల డివిజన్. ఇక్కడ పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు గుంటూరు మిర్చి యార్డును ఆశ్రయించాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లిన తర్వాత పంటను అమ్ముకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో మిర్చి యార్డు ఏర్పాటు చేస్తే రైతులకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి తీసుకునివెళ్లారు. దీనికి స్పందించిన సీఎం నంద్యాలలో మిర్చియార్డు ఏర్పాటు చేసే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మార్కెటింగ్ కార్యదర్శి ప్రద్యుమ్నకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తయిన కసరత్తు.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నంద్యాలలో మిర్చి యార్డు ఏర్పాటు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేశారు. నంద్యాల పట్టణంలోని 17 ఎకరాల్లో విస్తరించి ఉన్న టెక్కె మార్కెట్‌యార్డులో యార్డును ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్, హార్టికల్చర్ అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పంట కొనుగోలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందుకోసం రైతులు, కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు, వ్యాపారులతో 2 విడతలుగా సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా పంటను కొనుగోలు చేసే వారికి లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. గుంటూరు మిర్చి యార్డులో ఐటీసీ సంస్థ ఎక్కువగా పంటను కొనుగోలు చేస్తోంది. ఆ సంస్థ అధికారులతో కూడా మార్కెటింగ్ శాఖ అధికారులు మాట్లాడారు. నంద్యాల యార్డులో పంటలు కొనుగోలు చేసేందుకు వారు ముందుకు వచ్చినట్లు సమాచారం. జిల్లాలో 34వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుండగా ఏటా 2లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. ఈ పంటను నిల్వ ఉంచడానికి తగినంత కోల్డ్ స్టోరేజ్‌లు లేవు. నంద్యాలలో 10, కోవెలకుంట్లలో 2, మహానందిలో 3, ఓర్వకల్లులో 2, నందికొట్కూరులో 1, ఆళ్లగడ్డలో 1..మొత్తం 19 కోల్డ్ స్టోరేజ్‌లు ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం లక్ష టన్నులకు మించి లేదు. దీంతో వ్యాపారులు గుంటూరు జిల్లాను ఆశ్రయించాల్సి వస్తోంది. నంద్యాలలో మిర్చి యార్డు ఏర్పాటైతే కోల్డ్ స్టోరేజ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మిర్చి హబ్‌గా నంద్యాల... మిర్చియార్డు ఏర్పాటైతే నంద్యాల మిర్చి హబ్‌గా మారనుంది. జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, నందికొట్కూరు, శ్రీశైలం, ఆదోని, పత్తికొండ, కర్నూలు, ఆలూరు, పాణ్యం, డోన్, కోడుమూరు, నంద్యాల నియోజకవర్గాల్లోని రైతులు గుంటూరుకు వెళ్లకుండా నంద్యాల మిర్చి యార్డుకు పంటను అమ్ముకొనేందుకు వస్తారు. జిల్లా రైతులే కాకుండా అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాల రైతులు కూడా నంద్యాలలో పంటను అమ్ముకునేందుకు వస్తారు. దీంతో నంద్యాల పట్టణంలో కోల్డ్ స్టోరేజ్‌ల సంఖ్య పెరగడమే కాకుండా, హమాలీలకు, లారీ డ్రైవర్లకు పనులు దొరకడం, కమీషన్ వ్యాపారులు, రైతులతో నంద్యాల మార్కెట్‌యార్డు కిటకిటలాడే అవకాశం ఉంది. మిర్చి రైతుల ఇబ్బందులివీ.. ►మిర్చి పంటను అమ్ముకోవడానికి గుంటూరుకు వెళ్లాల్సి ఉండటం. ►గుంటూరులో బ్రోకర్‌కు రూ.లక్షకు రూ.3వేలు చెల్లించాలి. ►ధర వచ్చేంత వరకు మూడు, నాలుగు రోజులు అక్కడే ఉండాలి. ►ధర రాకపోతే కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచడానికి బస్తాకు అదనంగా రూ.20 చెల్లించాలి. ►మిర్చిని తీసుకొని వెళ్లడానికి లారీకి రూ.20వేలు ఖర్చు. మూడు రోజులు ఆగితే రూ. 60వేలు బాడుగ చెల్లించాలి. ఈ ఏడాదే ప్రారంభం ఈ ఏడాది నుంచే నంద్యాల మార్కెట్ యార్డులో మిర్చి యార్డును ప్రారంభించి, కొనుగోలు చేస్తాం. మిర్చి యార్డుకు సంబంధించి రాష్ట్ర మార్కెటింగ్ కార్యదర్శి ప్రద్యుమ్నతో మాట్లాడాం. ఆయన అనుమతి ఇచ్చారు. కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు, వ్యాపారులు, రైతులతో రెండుసార్లు సమావేశాలు నిర్వహించాం. మిర్చి వ్యాపారులకు లైసెన్స్‌లు మంజూరు చేస్తున్నాం. అన్నీ కుదిరితే డిసెంబర్ నెల నుంచే మిర్చి కొనుగోళ్లు ప్రారంభిస్తాం. – ఇసాక్‌బాషా, మార్కెట్‌యార్డు చైర్మన్, నంద్యాల రైతులకు ఉపయోగకరం మిర్చి యార్డు ఏర్పాటు అయితే రైతులకు ఎంతో ఉపయోగకరం. గుంటూరుకు వెళ్లే ప్రయాస తగ్గుతుంది. జిల్లా రైతులే కాకుండా అనంతపురం, కడప, ప్రకాశం, తెలంగాణ రాష్ట్రలోని మహబూబ్‌నగర్ జిల్లా వాసులు కూడా నంద్యాలకు వచ్చి మిర్చి అమ్ముకునే అవకాశం ఉంది. – బీవీ రమణ, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్, నంద్యాల -
కొనసాగుతున్న మిర్చి కొనుగోళ్లు
సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం మిర్చి రైతులకు అండగా నిలుస్తోంది. కరోనా, వేసవి కారణంగా మిర్చి యార్డుకు ఈ నెల 3వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది కాలువలకు ఏప్రిల్ వరకు నీరు విడుదల చేయడంతో మిరప దిగుబడులు అనూహ్యంగా పెరిగాయి. యార్డుకు సెలవులు ఇచ్చే సమయానికి రైతుల వద్ద చివరికోత కాయలు మిగిలాయి. పంట దిగుబడి అధికంగా రావడంతో ఇంకా మంచి ధరలు వస్తాయని రైతులు క్వాలిటీ సరుకును కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేశారు. దీంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 90 శాతం కోల్డ్‌స్టోరేజీలు నిండిపోయాయి. మిగతా జిల్లాలో సైతం 80 శాతం మేర నిండాయి. కల్లాల్లో 15 లక్షల టిక్కీలపైగా సరుకు ఉండిపోయింది. ఈ సరుకును నిల్వ చేసుకోవటానికి కోల్డ్ స్టోరేజీలు సైతం ఖాళీగా లేకపోవడంతో రైతులకు ఇబ్బంది ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులు భరోసా ఇచ్చింది. తమ సరుకు అమ్ముకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల పరిధిలో గోడౌన్లు, కోల్డ్‌స్టోరేజీల్లో క్రయవిక్రయాలకు అనుమతి ఇచ్చింది. దీంతో రోజుకు 50 వేల టిక్కీలపైగా మిర్చి లావాదేవీలు జరుగుతున్నాయి. ధరలు సైతం నిలడకగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసియాలో అతిపెద్దదైన మిర్చి యార్డు కావడంతో తెలంగాణ, కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సరుకు గుంటూరుకు వస్తోంది. కోల్డ్‌స్టోరేజీల్లో భారీగా నిల్వలు గుంటూరు జిల్లాలోని 130 కోల్డ్‌స్టోరేజీల్లో 1.10 కోట్ల టిక్కీల నిల్వ సామర్థ్యం ఉంది. ఇప్పటికే 90 శాతం నిల్వలున్నాయి. ప్రకాశం జిల్లాలోని 72 కోల్డ్‌స్టోరేజీల నిల్వ సామర్థ్యం 20 లక్షల టిక్కీలు. కర్నూలు జిల్లాలోని 12 కోల్డ్‌స్టోరేజీల నిల్వ సామర్థ్యం 8 లక్షల టిక్కీలు. ఈ రెండు జిల్లాల్లో 80 శాతం నిండిపోయాయి. కృష్ణాజిల్లాలోని 26 కోల్డ్ స్టోరేజీల నిల్వ సామర్థ్యం 18 లక్షల టిక్కీలు. వీటిలో 60% నిల్వలు చేరాయి. ప్రభుత్వానికి ధన్యవాదాలు కరోనా కష్టకాలంలో సైతం యార్డు మూతపడినా మా సరుకును అమ్ముకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేను 50 బస్తాల సరుకు తెచ్చాను. చివరికోత కాయ అయినా రేట్లు బాగానే ఉన్నాయి. 334 నాటు రకం మిర్చి క్వింటా రూ.9 వేలకు పైగా అమ్మాను. సరుకు నిల్వ చేసుకొందామనుకున్నా కోల్డ్ స్టోరేజీల్లో ఖాళీ లేదు. ఈ తరుణంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల వద్ద కొనుగోళ్లు జరపడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. – తిరుపతయ్య, మేడికొండూరు, గుంటూరు జిల్లా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు మార్కెట్ యార్డు మూతపడినా రైతులకు ఇబ్బంది లేకుండా మిర్చి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశాం. రోజులు 50 వేల టిక్కీలకు పైగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. యార్డు మూతబడినప్పటి నుంచి ఇప్పటివరకు బయట 3.05 లక్షల టిక్కీల క్రయవిక్రయాలు జరిగాయి. రూ.122.06 కోట్ల వ్యాపారం జరిగింది. చివరికోత మిర్చి రైతుల వద్ద ఉంది. ఆ సరుకును అమ్ముకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధరలు స్థిరంగా ఉన్నాయి. – వెంకటేశ్వరరెడ్డి, ఉన్నతశ్రేణి సెక్రటరీ, గుంటూరు మార్కెట్ యార్డు మార్కెట్లో గిరాకీ ఉంది చైనాతోపాటు, శ్రీలంక ఇతర దేశాలకు మిర్చి ఎగుమతులకు ఆర్డర్లు బాగానే వస్తున్నాయి. లోకల్లో సైతం డిమాండ్ ఉంది. కరోనా సమయంలో కూడా మార్కెట్లో ధరలు నిలకడగా ఉన్నాయి. క్వాలిటీ సరుకుకు మంచి ధర వస్తోంది. తేజ రకం క్వింటా ధర రూ.15 వేలకు పైగా పలుకుతోంది. చివరికోత కాయలు కావడంతో సరుకు నాణ్యత బట్టి ధర ఉంటోంది. – కొత్తూరు సుధాకర్, ఎగుమతి వ్యాపారి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు జిల్లాలో 130 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఈ ఏడాది పంట దిగుబడుల అధికంగా రా>వడంతో, నాణ్యమైన సరుకును రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. జిల్లాలో ఇప్పటికే 90 శాతంపైగా కోల్డ్ స్టోరేజీలు నిండాయి. రెండేళ్లుగా కోల్డ్‌స్టోరేజీలు నిండుతున్నాయి. రైతులకు ఇబ్బంది లేకుండా అందుబాటు ధరలో, మిర్చి నిల్వ చేస్తున్నాం. – పి.సురేంద్రబాబు, సెక్రటరీ, ది గుంటూరు డిస్ట్రిక్ట్ కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -
మిర్చి.. కలిసొచ్చి
సాక్షి, అమరావతి బ్యూరో: మిర్చి రైతులకు కాసుల పంట పండుతోంది. సకాలంలో వర్షాలు కురవడం, కాలువలకు నీరు పుష్కలంగా విడుదల చేయడంతో మిర్చి పంటకు ఈ ఏడాది భారీగా దిగుబడి వచ్చింది. ఈ ఏడాది విదేశాలకు పెద్ద ఎత్తున మిర్చి ఆర్డర్లు ఉండటంతో, దిగుబడులు భారీగా వచ్చినా ధరలు తగ్గకుండా, నిలకడగా ఉంటున్నాయి. క్వింటా మిర్చి ధర రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు పలుకుతోంది. ప్రధానంగా ఈ ఏడాది (2020–21) 55 లక్షల టన్నులు (1.37 లక్షల టిక్కీలు)కు పైగా మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతుందని అధికారుల అంచనా. మిర్చి ఎగుమతులకు సంబంధించి దాదాపు రూ.8,250 కోట్ల టర్నోవర్ ఉంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 3.87 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిరప పంట సాగు అయ్యింది. ఇందులో ఎక్కువ భాగం గుంటూరు జిల్లాలో 1.92 లక్షల ఎకరాల్లో, తరువాత ప్రకాశం, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాల్లో సాగు అవుతోంది. రాయలసీమ జిల్లాలతో పాటు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి మిర్చి గుంటూరు యార్డుకు తరలిస్తారు. ప్రధానంగా మిర్చి ఎగుమతి అయ్యే దేశాలు... మిర్చిని ఎక్కువగా చైనా దేశానికి ఎగుమతి చేస్తారు. దీనితో పాటు చిలీ, వియత్నాం, థాయ్‌లాండ్, శ్రీలంక, యూఎస్ఏ, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, సౌత్ ఆఫ్రికా, మెక్సికో దేశాలకు మిర్చి ఎగుమతి అవుతుంది. దీంతో పాటు దేశంలో తమిళనాడు, కేరళ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గుంటూరు మార్కెట్ యార్డు నుంచి మిర్చి వెళుతుంది. ధరలు బాగున్నాయి నేను నాలుగు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశాను. ఈ ఏడాది కాలువలకు నీరు పుష్కలంగా విడుదల చేయడంతో ఎకరాకు మిర్చి దిగుబడి 30 క్వింటాళ్లకు పైనే వచ్చింది. దీనికితోడు మిర్చి ధరలు క్వింటా రూ.14 వేలకు పైనే ఉన్నాయి. దీంతో పెట్టుబడులు, కోత కూలీల ఖర్చులు పోయినా మాకు ఎకరాకు రూ.1.5 లక్షలు మిగిలింది. – కృష్ణారెడ్డి, మిర్చి రైతు,వినుకొండ, గుంటూరు జిల్లా విదేశాల నుంచి ఆర్డర్లు బాగా ఉన్నాయి ఈ ఏడాది విదేశాల నుంచి మిర్చి ఆర్డర్లు బాగా వస్తున్నాయి. చైనా, బంగ్లాదేశ్, మలేషియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాల్లో మార్కెట్‌కు డిమాండ్ బాగా ఉంది. దీంతో ఈ ఏడాది మిర్చి దిగుబడులు అధికంగా వచ్చినా మంచి ధర పలుకుతోంది. మార్కెట్లో ధరలు సైతం నిలకడగా ఉన్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. – కొత్తూరు సుధాకర్, మిర్చి ఎగుమతి వ్యాపారి ధరలు నిలకడగా ఉన్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిర్చి ధరలు నిలకడగా ఉన్నాయి. సాధారణ రకం మిర్చి ధర సైతం గతేడాది క్వింటాల్ రూ.9 వేల నుంచి రూ.10 వేలు పలికింది. ఈ ఏడాది దిగుబడులు అధికంగా వచ్చినా క్వింటాల్ ధర రూ.11 వేల నుంచి రూ.13 వేలు పలుకుతోంది. హైబ్రిడ్ రకాల ధర క్వింటాల్ దాదాపు రూ.15 వేల నుంచి రూ.18 వేలు పలుకుతోంది. యార్డులో రైతులకు మిర్చి క్రయ విక్రయాలు ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటేశ్వరరెడ్డి, ఉన్నత శ్రేణి సెక్రటరీ, గుంటూరు మిర్చి యార్డు -
మిర్చి యార్డుకు భారీగా సరుకు
సాక్షి, అమరావతిబ్యూరో: గుంటూరు మిర్చి యార్డుకు పెద్ద ఎత్తున సరుకు వచ్చి చేరుతోంది. దీంతో యార్డు ప్రాంగణం మిర్చి టిక్కీలతో నిండిపోయింది. సరుకుతో నిండిన వాహనాలు భారీ సంఖ్యలో రోడ్డుపైనే నిలిచిపోయాయి. ప్రస్తుతం సోమవారం నాటికి యార్డులో 3.5 లక్షల టిక్కీల బస్తాలు నిల్వలున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో యార్డులో సిబ్బంది, దిగుమతి, ఎగుమతి వ్యాపారులు, కార్మికులు హడలిపోతున్నారు. రాయలసీమ, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున సరుకు తీసుకువస్తున్నారు. యార్డు ప్రాంగణం అంతా మిర్చి బస్తాలతో నిండిపోవడంతో శానిటైజ్ చేసేందుకు వీలు కావటం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా యార్డుకు వచ్చే మొత్తం సరుకును కలిపి బయటకు పంపేందుకు చర్యలు తీసుకొంటున్నారు. యార్డు పరిసరాలను శానిటైజ్ చేసి, కోవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఈనెల 21 నుంచి 25 వ తేదీ వరకు యార్డుకు సెలవులు ప్రకటించారు. పెద్ద ఎత్తున సరుకు ఎందుకు వస్తోందంటే.. సకాలంలో వర్షాలు కురవటంతో కాలువలకు సాగు నీటిని పుష్కలంగా విడుదల చేశారు. ప్రధానంగా మిర్చి పంట అధికంగా పండే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నాగార్జున సాగర్ కుడికాలువలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ 12 వ తేదీ వరకు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మిర్చి దిగుబడులు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా ఈ ఏడాది సాధారణ రకం మిర్చి రకాలు 334, నెంబరు 5341, సూపర్ 10 వంటి రకాలు సైతం మంచి ధర పలుకుతున్నాయి. వీటి ధర ప్రస్తుతం రూ.11 వేల నుంచి రూ.13 వేలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో రైతులు మిర్చి సరుకును అమ్ముకునేందుకు యార్డుకు తరలిస్తుండటంతో యార్డు పూర్తిగా నిండిపోతోంది. హైబ్రిడ్ రకాలను రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. రైతులకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. యార్డులోకి వచ్చే రైతులకు మాస్క్ లేకపోతే, గేటులో ఉచితంగా మాస్క్ ఇస్తున్నాం. శానిటైజ్ చేసుకుని లోపలికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్య పరిస్థితులు ఉంటే రైతులను యార్డులోకి అనుమతించటం లేదు. యార్డును పూర్తిగా సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రపరిచేందుకు వీలుగా సెలవులు ప్రకటించాం. – వెంకటేశ్వరరెడ్డి, మిర్చి యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి -
గుంటూరు మార్కెట్‌కు 'మిర్చి' వెల్లువ
సాక్షి, అమరావతి బ్యూరో: రాయలసీమ తదితర జిల్లాల నుంచి గుంటూరు మార్కెట్ యార్డుకు భారీగా మిర్చి తరలివస్తోంది. ఆది, సోమ, మంగళవారాల్లో వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, రైతులు పెద్దఎత్తున మిర్చి బస్తాల్ని తీసుకు రావడంతో 3.6 లక్షల బస్తాలతో మార్కెట్ యార్డు నిండిపోయింది. దీనివల్ల కొనుగోలు చేసిన సరుకుని బయటకు తరలించడం, బయటి నుంచి సరుకును లోనికి తీసుకు రావడానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో బుధవారం వేకువజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్కెట్ యార్డు అధికారులు, సిబ్బంది చర్యలు చేపట్టినప్పటికీ సాయంత్రానికి యార్డు ఆవరణలో 2.90 లక్షల బస్తాల సరుకు ఉండిపోయింది. దీంతో కొనుగోలు చేసిన సరుకును బయటకు తరలించేందుకు వీలుగా గురువారం మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, హడావుడి లేకుండా మిర్చి బస్తాలను యార్డుకు తరలించుకోవాలని అధికారులు సూచించారు. స్థిరంగా ధరలు గత ఏడాదితో పోలిస్తే మిర్చి ధరలు ఆశాజనకంగానే ఉన్నాయి. గుంటూరు మార్కెట్లో తేజ డీలక్స్ రకం క్వింటాల్ రూ.15,200, కర్ణాటక డబ్బీ బాడిగ రకం రూ.29 వేలు, బాడిగ రకం రూ.17 వేల నుంచి రూ.18 వేలు, నంబర్–5 రకం రూ.13,500, 341 రకం రూ.14 వేలు, 334 రకం రూ.11 వేలు, సూపర్–10 రకం రూ.11 వేల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. సరుకును యార్డులోకి తరలించాం గుంటూరు మిర్చి యార్డుకు మాచర్ల ప్రాంతం నుంచి కాయలు తీసుకొచ్చా. యార్డుకు పెద్దఎత్తున సరుకు రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో సరుకును యార్డులోకి తరలించాం. – పంగా శ్రీనివాసులు, రైతు, మాచర్ల సరుకు భారీగా రావడంతో ఇబ్బందులు కర్నూలు నుంచి బుధవారం తెల్లవారుజామున మిర్చి తెచ్చా. సరుకు పెద్దఎత్తున రావడంతో యార్డులోకి సరుకు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు పడ్డా. సరుకును విక్రయించుకునేందుకు వీలుగా మార్కెట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. – లబాన్, రైతు, కర్నూలు జిల్లా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు మిర్చి క్రయ, విక్రయాలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వరుస సెలవు వల్ల మార్కెట్ యార్డుకు పెద్దఎత్తున సరుకు వచ్చింది. యార్డులో ఉన్న సరుకును క్లియర్ చేసేందుకు గురువారం సెలవు ప్రకటించాం. రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సరుకును యథావిధిగా యార్డు పనిచేసే రోజుల్లో తీసుకు రావాలి. – వెంకటేశ్వరరెడ్డి, ఉన్నత శ్రేణి కార్యదర్శి, గుంటూరు మార్కెట్ యార్డు -
పోటెత్తిన మిర్చి.. రైతుల్లో ఆనందం
సాక్షి, అమరావతి బ్యూరో: ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న గుంటూరు మిర్చి యార్డుకు భారీ ఎత్తున కొత్త సరుకు వస్తోంది. దీనికి తగ్గట్టుగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చికి అధిక ధర పలుకుతోంది. ముఖ్యంగా బాడిగ, తేజ రకం మిర్చికి మంచి రేటు లభిస్తోంది. ఇతర రకాలకూ చెప్పుకోదగిన ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచేగాక కర్ణాటక నుంచీ రైతులు పెద్దఎత్తున మిర్చిని యార్డుకు తీసుకొస్తున్నారు. కర్ణాటకలోని బళ్లారితోపాటు కర్నూలు, వైఎస్సార్, అనంతపురం జిల్లాల నుంచి గుంటూరు మిర్చి యార్డుకు భారీగా కొత్త సరుకు వస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచీ రైతులు యార్డుకు మిర్చిని తీసుకొస్తున్నారు. రోజుకు సరాసరిన 1.20 లక్షల నుంచి 1.25 లక్షల టిక్కీల మిర్చి యార్డుకు వస్తోంది. 2020–21లో ఇప్పటికే యార్డుకు 43,27,820 బస్తాల సరుకు వచ్చింది. ఈ మార్కెట్ యార్డులో ఏడాదికి రూ.6 వేల కోట్లకుపైగా టర్నోవర్ ఉంటుంది. సెస్సు ద్వారా రూ.60 కోట్లకుపైగా ఆదాయం లభిస్తోంది. రాష్ట్రంలో ఈ ఏడాది మిర్చి దిగుబడులు బాగా ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఎకరాకు 35 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తున్నట్లు రైతులు తెలిపారు. అలాగే మిర్చిని ప్రధానంగా సాగు చేసే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. బాడిగ, తేజ రకాలకు మంచి ధరలు.. మిర్చిలో నాణ్యమైన బాడిగ, తేజ రకాలకు ప్రస్తుతం మంచి ధరలు లభిస్తున్నాయి. 2019 డిసెంబర్, 2020 జనవరిలో ఉన్న ధరల కన్నా ప్రస్తుతం క్వింటాకు రూ.2 వేల ధర అదనంగా లభిస్తోంది. బాడిగ రకాలు క్వింటాలు రూ.17 వేల నుంచి 21 వేలు, తేజ రకం రూ.15,500, మిగిలిన అన్నిరకాలు రూ.13 వేలకు పైగా ధర పలుకుతున్నాయి. గతేడాది కరోనా వల్ల యార్డు మూతపడటంతో అమ్ముకునే వీల్లేక ఎక్కువమంది రైతులు సరుకును కోల్డ్ స్టోరేజీల్లో ఉంచారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో యార్డులో క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. గత డిసెంబర్ 22న మార్కెట్ యార్డులో డబ్బి బాడిగ మిర్చి క్వింటా రూ.36 వేల వరకు పలకడం విశేషం. ధరలు ఆశాజనకం నేను ఐదెకరాల్లో మిర్చి సాగు చేశాను. దిగుబడి 25 క్వింటాళ్లకుపైగా వస్తుందని భావిస్తున్నాను. గతేడాది క్వింటా రూ.11 వేలే. ప్రస్తుతం యార్డుకు 100 బస్తాలు తీసుకొచ్చా. క్వింటా రూ13,500 చొప్పున విక్రయించా. –జయశంకరరావు, గుంటూరు జిల్లా సరుకు బాగా వస్తోంది యార్డుకు సరుకు భారీగా వస్తోంది. రోజుకు 1.20 లక్షల నుంచి 1.25 లక్షల టిక్కీల సరుకు యార్డుకొస్తోంది. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ధరలు అధికంగానే ఉన్నాయి. డబ్బి బాడిగ రకం ధర క్వింటా రూ.20 వేలకుపైగా పలుకుతోంది. బాడిగ రకాలతోపాటు అన్ని రకాల మిర్చి ధరలు కూడా బాగానే ఉన్నాయి. – వెంకటేశ్వరరెడ్డి, గుంటూరు మార్కెట్ యార్డు ఉన్నతశ్రేణి సెక్రటరీ చదవండి: శభాష్ ఏపీ.. ప్రతికూలతలోనూ ‘సుస్థిర’పరుగు బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! -
రైతుల సమస్యల పరిష్కారం కోసమే టాస్క్‌ఫోర్స్
సాక్షి, గుంటూరు: మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టాస్క్ ఏర్పాటు చేశామని రాజ్యసభ సభ్యుడు, మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవిఎల్ నరసింహరావు తెలిపారు. గురువారం ఆయన గుంటూరు మిర్చి యార్డులో జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. ఆరు నెలల కార్యచరణలో భాగంగా తొలి సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు తమ సమస్యలను కమిటీ ముందు ప్రస్తావించవచ్చని తెలిపారు. కేంద్రం కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, ఏపీలో ముందుగా అమలు చేయాలన్నది తన పక్షపాతంమని పేర్కొన్నారు. ఎందుకంటే తను గుంటూరు జిల్లా వాడినని గుర్తుచేశారు. రూ.7 వేల కోట్లతో పది వేల రైతు సంఘాలు ఏర్పాటు చేయాలన్నది కేంద్ర నిర్ణయమని వెల్లడించారు. 500 మంది రైతులు సంఘంగా ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు రైతుల ఖాతాలోకి జమ అవుతాయని ఆయన చెప్పారు. ముందుగా రూ.25 లక్షలు, ఈక్విటీ రూపంలో మరో రూ.15 లక్షలను కేంద్రం ఆర్థిక సహాయం రూపంలో అందజేస్తుందని తెలిపారు. కేంద్రం తీసుకున్న వచ్చిన కొత్త చట్టాల వల్ల రైతులకు ఉపయోగకరమైన వాతావరణం కలిగిస్తుందని తెలిపారు. వాటిపై కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో కనీసం 400, 500 రైతు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఏపీకి రూ.6,500కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి రూ.10వేల కోట్లపైగా కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. -
మిర్చి ‘ధర’హాసం
సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా కష్టకాలంలోనూ మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంట దిగుబడి వచ్చే సమయానికి కరోనా వైరస్ వ్యాప్తితో గుంటూరు మార్కెట్ యార్డు మూతపడి లావాలాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో రైతులు తాము పండించిన మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. గుంటూరు జిల్లాలోని 118 కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు కోటి టిక్కీలకు పైగా సరుకు నిల్వ చేశారు. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో అమ్మకాలు మొదలైన 60 లక్షల టిక్కీలను విక్రయించగలిగారు. ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీల్లో దాదాపు 40 లక్షలకు పైగా మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నాయి. (చదవండి: మిరపకాయలతో గుండెపోటుకు చెక్!) కలిసొచ్చిన ఎగుమతులు ►గత నెలతో పోలిస్తే ఈ నెలలో మిర్చి ధరలు క్వింటాకు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు పెరిగాయి. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మిర్చి పంట ఆలస్యం కావడంతో మన రాష్ట్రంలోని మిర్చికి డిమాండ్ పెరిగింది. ►దీనికి తోడు సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఆర్డర్లు రావడం మిర్చి రైతులకు కలిసొచ్చింది. ►గుంటూరు జిల్లాలో దాదాపు 1.95 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ►దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, ధరలు సైతం బాగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఊపందుకున్న విక్రయాలు ►కరోనా నేపథ్యంలో మార్కెట్ యార్డులో మిర్చి క్రయ, విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. అనంతరం క్రయవిక్రయాలు మొదలైనా రోజుకు కేవలం 10 వేల టిక్కీల లోపు మాత్రమే అమ్ముడయ్యేవి. ►సొంత గ్రామాలకు వెళ్లిన కూలీలు తిరిగి రావడం, ధరలు సైతం పెరగడంతో మిర్చి క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. ►గుంటూరు మార్కెట్ యార్డులో ప్రస్తుతం రోజుకు సగటున 20 వేల టిక్కీల వరకు మిర్చి లావాదేవీలు జరుగుతున్నాయి. ►బయట కోల్డ్ స్టోరేజీల్లో సైతం రోజుకు 30 వేల టిక్కీల వ్యాపారం సాగుతోంది. రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి క్రయ, విక్రయాలు ఊపందుకున్నాయి. రైతులు పంటను విక్రయించుకోవడానికి వీలుగా అన్ని వసతుల్ని మార్కెట్ యార్డులో కల్పిస్తున్నాం. ధరలు సైతం స్థిరంగా ఉండి కొంత పెరగడంతో రైతులు సరుకును అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. – వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి, గుంటూరు (చదవండి: ఇదీ పౌష్టికాహార మెనూ..) -
అన్నీ అ'మిర్చి'..!
సాక్షి, అమరావతి: మిర్చి కోతలకు కూలీల కొరత.. గ్రేడింగ్ సమస్య లేకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. కోసిన పంటను నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించడం కూడా కలిసి వచ్చింది. కరోనా వల్ల తలెత్తిన విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో తాము గట్టెక్కుతామనే ధైర్యం ఏర్పడింది. ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ మిర్చికు రూ.7 వేల కనీస మద్దతు కల్పించడంతో అప్పుల బారినుంచి గట్టెక్కుతామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడంతో లాక్డౌన్ ముగిసిన వెంటనే మిర్చి అమ్మకాలు, ఎగుమతులు సాగించే వెసులుబాటు కలిగిందని రైతులు, వ్యాపారులు తెలిపారు. ‘మాది కర్నూలు జిల్లా అవుకు మండలం సింగనపల్లి. తొమ్మిదెకరాల్లో మిర్చి పంట వేశా. మా జిల్లాలో కోతలు దాదాపు పూర్తయ్యాయి. తొలి రెండు కోతల్లో వచ్చిన కాయల్ని అమ్మేశా. మిగతా కోత కాయల్ని అమ్ముదామంటే గుంటూరు యార్డు లాక్డౌన్లో ఉంది. అందుకని అక్కడే ఓ కోల్ట్ స్టోరేజీలో పెట్టా. లాక్డౌన్ ముగిశాక మంచి ధర వస్తుందని ఆశిస్తున్నా’ – మురళీమోహన్‌రెడ్డి, మిర్చి రైతు ‘మాది ప్రకాశం జిల్లా ఇంకొల్లు. ఐదెకరాల్లో మిర్చి వేశా. తొలి పంట అమ్మేశాను. మిగతా పంటను అమ్ముదామనుకునే లోగా లాక్డౌన్ వచ్చింది. యార్డు మూతపడింది. అందుకే మిగిలిన సరుకు కోల్డ్ స్టోరేజీలో ఉంచా. దేశ చరిత్రలో తొలిసారి మిర్చికి రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7 వేలు ప్రకటించింది. దీనివల్ల బయ్యర్లు మంచి రేటే ఇస్తారనుకుంటున్నాను. పాత అప్పు తీర్చేశాను. కౌలు మాత్రం చెల్లించాలి. కొత్త కాయ అమ్మి కౌలు కూడా తీర్చేస్తా’ – పి.హన్మంతు, మిర్చి రైతు 86 శాతం కోతలు పూర్తి ► రాష్ట్రంలో రబీ, ఖరీఫ్ సీజన్లలో కలిపి 1,41,081 హెక్టార్లలో మిర్చి సాగైంది. ఇందులో గుంటూరు జిల్లాది ప్రథమ స్థానం. ► హెక్టార్‌కు సగటున 6.25 టన్నుల దిగుబడి అనుకుంటే సుమారు 8.82 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ► లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో మిర్చి కోతలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూలీల కొరత తీరింది. కళ్లాల్లో గ్రేడింగ్ కూడా పూర్తయింది. ► ఇప్పటికి దాదాపు 85.90 శాతం విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన విస్తీర్ణంలో కూడా వారంలో కోతలు పూర్తవుతాయి. ► రాష్ట్రంలో 220కి పైగా కోల్డ్ స్టోరేజీలు ఉండగా.. ఒక్క గుంటూరు జిల్లాలోనే 130 ఉన్నాయి. వీటిలో మిర్చిని నిల్వ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గిడ్డంగుల్లో 6 లక్షల టన్నులకు పైగా సరుకు నిల్వ ఉంది. ► మిర్చి యార్డు నిర్వాహకులు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో యార్డుకు దూరంగా కొనుగోళ్లను ప్రారంభించే యోచనలో ఉన్నారు. ఎగుమతుల కోసం కొనుగోళ్లు షురూ ► లాక్‌డౌన్‌కు ముందే రాష్ట్రంలో 1.50 లక్షల టన్నులకు పైగా మిర్చి కొనుగోళ్లు జరిగాయి. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత సుమారు 12 వేల టన్నుల సరుకును రైతుల నుంచి కొనుగోలు చేశారు. ► గ్రేడ్‌ను బట్టి క్వింటాల్‌కు రూ.11 వేల నుంచి రూ.13వేల మధ్య పలికింది. తేజ రకం కాయలైతే క్వింటాల్ రూ.14 వేల వరకు ధర లభిస్తోంది. ► విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీల తరఫున ఏజెంట్లు ఈనెల మొదటి వారం నుంచే రంగంలోకి దిగి చేలల్లోనే మిర్చి కొనుగోలు చేస్తున్నారు. ► లాక్డౌన్ ముగిశాక సరుకును తీసుకువెళ్లేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. గత నెల 20కి ముందు కొన్న సరుకును ఇటీవల కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు పంపారు. ► ఇదే అదునుగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా ఫోన్లలో స్థానిక ఏజెంట్లను సంప్రదించి గిడ్డంగుల్లో ఉన్న నాణ్యమైన మిర్చికి అడ్వాన్సులు ఇస్తున్నారు. మిర్చి సాగులో ఏపీ టాప్ ► మిర్చిని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రాల్లో ఏపీదే అగ్రస్థానం. సుమారు 26% ఉత్పత్తి రాష్ట్రం నుంచి వస్తుండగా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► రాష్ట్రంలో హెక్టార్‌కు సగటు దిగుబడి 6.25 టన్నులు. దేశం నుంచి 2018–19లో 4,68,500 టన్నుల మిర్చిని ఎగుమతి చేస్తే.. ఇందులో 1,43,000 టన్నులు రాష్ట్రం నుంచే వెళ్లాయి. అకాల వర్షాల నుంచి గట్టెక్కితే చాలు ► రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినందున మిర్చి రైతులెవరూ కంగారు పడాల్సిన పని లేదు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో ఏపీ మిర్చికి మంచి గిరాకీ వస్తుంది. ధర కూడా బాగా ఉంటుంది. తుది దశ కోతలు తప్ప చేలల్లో పెద్దగా పంట లేదు. కూలీల సమస్య కూడా లేదు. అకాల వర్షాల బెడద తప్ప మరే సమస్యా ఉండదు. మొత్తం ఉత్పత్తిలో 20 శాతం ఎగుమతులు ఉంటాయి. వాటి విలువ రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు ఉంటుంది. – వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డు కార్యదర్శి -
కరోనా: గుంటూరు మిర్చి యార్డు లాక్డౌన్
సాక్షి, గుంటూరు: కోవిడ్-19 ( కరోనా వైరస్) నియంత్రణలో భాగంగా జిల్లాలోని మిర్చి మార్కెట్‌ను ఈ నెల 31 వరకు మూసివేయాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ సోమవారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మిర్చి రైతులు గుంటూరు మిర్చి మార్కెట్‌కు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి మిర్చి యార్డ్ తెరిచేంతవరకు రైతులు రావొద్దని ఆయన సూచించారు. సోమవారం నుంచి గుంటూరు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడి ఉండొద్దని కలెక్టర్ శామ్యూల్ తెలిపారు. (31వరకు ఏపీ లాక్డౌన్ ) ఇక గుంటూరు మార్కెట్ యార్డుకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు మిర్చి యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎం.వెంకటేశ్వరరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 31 వరకు యార్డుకు మిర్చిని తీసుకురావద్దని, రైతులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
‘కోవిడ్’ పేరిట రైతులకు బురిడీ
సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ పేరుతో మిర్చి వ్యాపారులు రైతులను నిలువునా దోచేస్తున్నారు. ఈ వైరస్ కారణంగా చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో మిర్చి ధరను సగానికి సగం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం దాకా క్వింటాల్ రూ.22 వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు ప్రస్తుతం రూ.8,000 నుంచి రూ.13,500లకు కొంటున్నారు. మరో మార్గం లేక రైతులు పంటను అమ్ముకుంటున్నారు. వ్యాపారులు ఆ మిర్చిని ఇతర రాష్ట్రాలకు, బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు సమీప భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తూ కోల్డు స్టోరేజీల్లో మిర్చీని నిల్వ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అధిక డిమాండ్ ప్రతి సంవత్సరం గుంటూరు నుంచి చైనాకు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది సీజను ప్రారంభమైన మొదటి రెండు నెలల్లో 20 వేల మెట్రిక్ టన్నుల సరుకు ఎగుమతి అయింది. కోవిడ్ వైరస్ కారణంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. క్వింటాల్ రూ.22 వేలు పలికిన మిర్చీ ధర రూ.8 వేలకు పడిపోయింది. ఎటువంటి తాలు లేని మిర్చి గుంటూరు మార్కెట్ యార్డులో రూ.13,500 పలుకుతోంది. చైనాకు ఎగుమతులు నిలిచినా ఇతర రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌లో మంచి మిర్చికి డిమాండ్ ఉంది. చైనాకు ఇప్పట్లో ఎగుమతులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదంటూ వ్యాపారులు మాయ మాటలు చెబుతూ రైతుల నుంచి తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌కు ప్రతిఏటా 30 వేల నుంచి 50 వేల మెట్రిక్ టన్నులు మిర్చి ఎగుమతి జరుగుతోంది. ఇప్పుడు చైనాకు ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యాపారులంతా రోజుకు 500 నుంచి 1,000 టన్నులను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ అధికంగానే ఉందన్న విషయాన్ని మార్కెటింగ్ శాఖ ప్రచారం చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యాపారుల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు ‘‘గుంటూరు మిర్చి యార్డులో మంచి ధర లభిస్తుంది. జనవరి నెలాఖరు వరకు గుంటూరు యార్డుకు రోజుకు 1.20 లక్షల బస్తాల (ఒక బస్తా 40 కిలోలు) మిర్చీ వచ్చింది. ప్రస్తుతం చైనాకు ఎగుమతులు నిలిచిపోయాయి. గ్రామాల్లోని వ్యాపారులు రైతుల నుంచి పంటను కొనుగోలు చేస్తుండటంతో రోజుకు దాదాపు 70 వేల బస్తాలే యార్డుకొస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులను తెలుసుకుంటూ పంటను మంచి ధరకు అమ్ముకోవాలి. వ్యాపారుల ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దు’’ – వెంకటేశ్వరరెడ్డి, సెక్రెటరీ, గుంటూరు మిర్చి యార్డు -
ఈ మిర్చిని అమ్మేదెలా..?
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిర్చి పంట విక్రయానికి మార్కెట్ సౌకర్యం కరువైంది. ఫలితంగా దళారులకు విక్రయించి రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా సుమారు ఐదు వేల హెక్టార్ల(12,500 ఎకరాలు)లో రైతులు మిర్చి పంట సాగు చేస్తున్నారు. హెక్టారుకు రూ.లక్షన్నరకు పైగా పెట్టుబడి అవుతుండగా.. 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఏటా లక్ష క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుండగా.. విక్రయించడానికి జిల్లాలో ఎక్కడా మార్కెట్ సదుపాయం లేదు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి క్వింటాల్‌కు రూ.6వేల నుంచి రూ.15 వేల వరకు పలికే మిర్చి పంటను దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో అక్రమంగా సేకరిస్తూ వరంగల్, గుంటూరు, నాగపూర్ మార్కెట్లకు తరలించడం పరిపాటిగా మారింది. కళ్లెదుటే రూ.కోట్లలో అక్రమ వ్యాపారం సాగుతున్నా.. రెక్కల కష్టాన్ని రైతులు తెగనమ్ముకుంటున్నా పట్టించుకునే దిక్కేలేకుండా పోయింది. సర్కారు సంకల్పిస్తే సాధ్యమే.. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో జిల్లాలోనే అగ్రగామిగా ఉన్న జమ్మికుంట యార్డులో మిర్చి మార్కెట్ నెలకొల్పాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. స్థానికంగా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రెండు విశాలమైన యార్డులు, సరిపడా గోదాములు, రవాణా సౌకర్యం మెరుగ్గా ఉండడంతో వ్యాపారులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ.. సరుకుల నిల్వకు కోల్డ్ స్టోరేజీలు అనివార్యం. సర్కారు సంకల్పిస్తే వాటి నిర్మాణం పెద్ద కష్టమేం కాదు. రూ.10 కోట్ల లోపే నిధులు సరిపోతాయని అంచనా. ఇది సాకారమైతే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్ అర్బన్, భూపాలపల్లి జిల్లాలోని రైతులకూ ప్రయోజనం కలుగుతుంది. ఉపాధి లేక విలవిల్లాడుతున్న హమాలీలు, దడ్వాయిలు, కూలీలు, చాటవాలీలకు చేతినిండా పని దొరుకుతుంది. తీరిన పసుపు రైతుల కష్టాలు పత్తి, ధాన్యం, మొక్కజొన్నల వ్యాపారానికి జమ్మికుంట మార్కెట్ పెట్టింది పేరు. సర్కారు తాజాగా ఇక్కడ పసుపు కొనుగోళ్లకు సైతం శ్రీకారం చుట్టింది. ఏళ్లతరబడిగా రైతులు ఎదుర్కొంటున్న విక్రయ కష్టాలకు తెరపడింది. సమీప జిల్లాల రైతులకూ మేలు చేకూరింది. మిర్చి రైతులకూ అండగా నిలవాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రభుత్వం వసతులు సమకూరిస్తే స్థానికంగా మిర్చి వ్యాపారానికి మార్గం సుగమం కానుంది. ఫలితంగా మార్కెట్ దశ తిగరడంతోపాటు కర్షక, కార్మిక, వ్యాపార వర్గాలకు ప్రయోజనం కలగనుంది. విస్తరిస్తున్న పచ్చబంగారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పత్తి, వరి, మొక్కజొన్న ప్రధాన పంటలు. గతంలో వీటి సాగుకే పరిమితమైన రైతులు కొన్నేళ్లుగా పసుపు సాగుకు మొగ్గుతున్నారు. ఏటా 17 వేల హెక్టార్ల(42 వేల ఎకరాలు)లో పండిస్తున్నారు. హెక్టారుకు 40 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా, ఏటా ఏడు లక్షల క్వింటాళ్లకు పైగా పసుపు అమ్మకానికి సిద్ధంగా ఉంటోంది. కానీ మార్కెటింగ్ సదుపాయం సక్రమంగా లేక రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు. రంగంలోకి జమ్మికుంట మార్కెట్.. గతంలో పసుపు అమ్మాలంటే వరంగల్, ఆర్మూర్ మార్కె ట్లకు వెళ్లాల్సి వచ్చేది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగి త్యాల, కోరుట్ల, మెట్పల్లి, గొల్లపల్లి యార్డుల్లో పసుపు కొనుగోళ్లు ఆరంభించడంతో కర్షకుల కష్టాలు దాదాపు తీరాయి. ప్రభుత్వం ఈ సీజన్ నుంచి జమ్మికుంట మార్కెట్లోనూ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టడంతో ఈ ప్రాంత రైతులతోపాటు సమీపంలోని వరంగల్ అర్బన్, భూపాలపల్లి, సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల రైతులకు కూడా ప్రయోజనం చేకూరుతోంది. స్థానిక మార్కెట్ కమిటీ చొరవతో వరంగల్ వ్యాపారులు రంగంలోకి దిగడంతో పసుపు క్రయవిక్రయాల్లో ఇబ్బందులకు తావేలేకుండా పోయింది. వచ్చే సీజన్ నాటికి కొనుగోళ్లను విస్తృతం చేసేందుకు కమిటీ కసరత్తు సాగిస్తోంది. కాగా, పసుపు విషయంలో చూపిన చొరవను మంత్రి ఈటల రాజేందర్ మిర్చి కొనుగోళ్లపైనా చూపాలని, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించాలని రైతులు కోరుతున్నారు. -
ఘాటెత్తుతున్న యార్డులు
సాక్షి, వరంగల్: మిర్చి సీజన్ ఊపందుకోవడంతో వరంగల్ వ్యవసాయ మార్కెట్లో విక్రయించేందుకు రైతులు భారీ మొత్తంలో తీసుకొస్తున్నారు. దీంతో యార్డులన్నీ ఘూటుతో పోటెత్తుతున్నాయి. గత వారం రోజులుగా 30వేల నుంచి 80వేల బస్తాల మిర్చిని రైతులు మార్కెట్లో విక్రయించారు. వేలాది బస్తాలు రావడంతో ఉన్న ఉద్యోగులతో కాంటాలు పెట్టించడం వల్ల రాత్రి వరకు సాగుతోంది. ఒక్కోసారి మరుసటి రోజున కాంటాలు పెడుతున్నారు. దీనికి తోడుగా ఎండలు ముదురుతుండటం వల్ల ఘాటు ఎక్కువ వస్తుండటంతో రైతులు యార్డుల్లో ఉండేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌కు వచ్చిన బస్తాల నుంచి షాంపిల్స్ తీయడం వల్ల కింద పడిన మిర్చి ధ్వసం కావడంతో ఈ ఘాటు మరింత ఎక్కువగా వస్తోంది. మిర్చి ఘాటు ప్రధాన రహదారి వరకు వస్తున్నదంటే ఎంత తీవ్రత ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా ‘తేజ’ రకమే... మార్కెట్లో తేజ రకానికే డిమాండ్ ఉండటంతో రైతులు ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేశారు. వరంగల్ మార్కెట్‌కు బుధవారం సుమారు 60వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. ఇందులో తేజ రకం సగానికి పైగా వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మేలిరకం సరుకు రావడం వల్ల ధరలు గత మూడు రోజులుగా నిలకడగా ఉంటున్నాయని అంటున్నారు. ప్రస్తుతం తేజ రకం మిర్చి క్వింటాల్‌కు రూ.6వేల నుంచి రూ.8వేలకు పైగా ధరతో కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా వండర్ హాట్, యుఎస్–341, సింగిల్పట్టి, డీడీ, సన్నాలు, 1048 లాంటి రకాలు మార్కెట్‌కు వస్తున్నాయి. మిర్చి రెండవ కోతలు ప్రారంభం జోరుగా సాగుతుండటంతో భారీగా సరుకు మార్కెట్‌కు వస్తోంది. మిర్చి నాణ్యతగా ఉన్నప్పటికీ భారీగా సరుకు వస్తున్నందున ధరలు కొన్నింటికే ఎక్కువగా ఇస్తూ మిగిలిన వాటికి అంతగా పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంటాలు జాప్యం.. మిర్చి యార్డుల్లో మార్కెట్లోని అన్ని యార్డులకు చెందిన ఉద్యోగులు పనిచేస్తున్నా... కాంటాలు జాప్యం అవుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కాంటాలు వేసే సమయానికి కమీషన్‌దారులు, కొనుగోలుదారులు లేకపోవడమే ఈ జాప్యానికి కారణమని తెలుస్తోంది. మిర్చి రాక ఎక్కువ కావడం, ఎండల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో యార్డుల్లో వస్తున్న మిర్చి ఘాటుకు రైతులు తల్లడిల్లిపోతున్నారు. యార్డుల్లోని రైతుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి నల్లాల్లో నీళ్లు వస్తున్నప్పటికీ ఆయా పరిసర స్రాంతాలు శుభ్రంగా ఉంచడంలో మార్కెట్ పారిశుధ్య సిబ్బంది విఫలమవుతున్నారు. యార్డులను శుభ్రం చేస్తున్నాం మిర్చి భారీగా వస్తున్నందున యార్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని శుభ్రం చేస్తున్నాం. మిర్చి ఘాటు రాకుండా నీళ్లు చల్లించాలంటే బస్తాలు అడ్డంకిగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి రోజు సాధ్యమైన మేరకు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – రాంమోహ్మన్రెడ్డి, గ్రేడ్–2 కార్యదర్శి -
కోట్లున్నా... కన్నీళ్లే!
కొరిటెపాడు(గుంటూరు): రైతుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన నిధులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. కర్షకులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే వరకూ మార్కెట్ యార్డు గోదాముల్లో నిల్వలు ఉంచుకుంటున్నారు. అవసరమైన రైతులకు పంట నిల్వల ఆధారంగా రైతుబంధు పథకం కింద రుణాలు మంజూరు చేయాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఈ విధానం అమలు చేయడం లేదు. రుణాలు అందక రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి విలవిలలాడుతున్నారు. ఇవేమీ పట్టని పాలకులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రైతులకు అవస్థలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మార్కెట్ యార్డుల్లో రైతులు, వ్యాపారుల నుంచి వసూలు చేసిన సెస్, ఇతర మార్గాల నుంచి వచ్చిన వందలాది కోట్ల రూపాయలు బ్యాంకుల్లోనే ఉన్నాయి. రుణమాఫీ అమలుగాక, బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం ఆభరణాలను వేలం వేస్తున్న తరుణంలో కనీసం రైతు బంధు పథకం కిందనైనా రుణాన్ని మంజూరు చేయాలన్న ఆలోచన రాకపోవడం ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గుంటూరు మార్కెట్ యార్డు పరిధిలో రూ.200 కోట్లు ఆసియా ఖండంలోనే అతిపెద్దది గుర్తింపు తెచ్చుకొన్న గుంటూరు మార్కెట్ యార్డుకు సంబంధించి రూ.200 కోట్లుపైగా బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. యార్డు పరిధిలో నాలుగేళ్లుగా ఒక్క రైతుకు కూడా రైతుబంధు పథకం ద్వారా రుణం ఇచ్చిన పాపాన పోలేదు. ఈ యార్డు పరిధిలో వందకుపైగా కోల్డ్ స్టోరేజ్‌లలో రైతులు పంట ఉత్పత్తులు నిల్వ చేసుకుంటున్నారు. నెలల తరబడి పంట అమ్ముకోలేక, పెట్టిన పెట్టుబడులు తిరిగిరాక, వడ్డీలు కట్టలేక రైతులు అల్లాడుతున్నారు. తమకు కనీసం రైతుబంధు పథకం ద్వారా రుణాలు మంజూరు చేయాలని మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. 20 యార్డుల పరిధిలో... ఇదే పరిస్థితి జిల్లాలో మిగిలిన 20 మార్కెట్ యార్డుల్లోనూ నెలకొంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది రైతులు ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 138 మంది రైతులకు రూ.1.63 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. గుంటూరు మిర్చి యార్డుతోపాటు పేరున్న తాడికొండ, మంగళగిరి, ఫిరంగిపురం, తెనాలి, చిలకలూరిపేట, నరసరావుపేట, రేపల్లే, ఈపూరు, కూచినపూడి, రాజుపాలెం, వేమూరు మార్కెట్ యార్డుల్లో ఒక్క రైతుకు సైతం రుణాలు ఇవ్వలేదు. మిగిలిన మార్కెట్ యార్డుల్లో నామమాత్రంగా ఇద్దరు, ముగ్గురు రైతులకు రుణాలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. లింక్ రోడ్లకూ దిక్కులేదు... రైతుల నుంచి సెస్ రూపేణా వసూలు చేసిన కోట్ల రూపాయల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి రాకపోవటం బాధాకరం. పంట పొలాల నుంచి గ్రామానికి మధ్య లింక్ రోడ్ల నిర్మాణానికి నిధులు వెచ్చించాల్సి ఉండగా ఇప్పటి వరకు కనీసం మీటరు రోడ్డు కూడా నిర్మించలేదు. కొన్ని మార్కెట్ యార్డుల్లో పాలకవర్గాలుఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
గుంటూరులో అగ్నిప్రమాదం
సాక్షి, గుంటూరు: నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున మిర్చియార్డ్ సమీపంలోని వీజీటీ కోల్డ్ స్టోరేజిలో విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగా పొగలు వ్యాపించాయి. దీంతో కోల్డ్ స్టోరేజీ ఐదో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ఐదు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. స్టోరేజీలో 80 వేల మిర్చి టిక్కీలు ఉండటంతో కొన్నైనా కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
మహబూబాబాద్: మిర్చి గోదాంలో భారీ అగ్నిప్రమాదం
-
ధర గుట్టు రట్టు..
ఖమ్మం వ్యవసాయం : మిర్చి కొనుగోళ్లలో మాయ జరుగుతోంది. పంటకు ఉన్న డిమాండ్‌నుబట్టి ధర పెట్టకుండా వ్యాపారులు దగాకు పాల్పడుతున్న వ్యవహారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం బట్టబయలైంది. జెండా పాటకన్నా కొందరు వ్యాపారులు మిర్చికి ధర అధికంగా పెట్టడంతో ఈ విషయం బయటపడింది. పొరుగు రాష్ట్రాలకు చెందిన మిర్చి వ్యాపారులు ఖమ్మం మార్కెట్‌కు వచ్చి మిర్చి కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వటంతో నిత్యం మార్కెట్లో జరుగుతున్న ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు నిత్యం 12 నుంచి 15 వేల బస్తాల మిర్చి అమ్మకానికి వస్తుంది. మార్కెట్‌కు వచ్చే మిర్చిని స్థానిక వ్యాపారులు, అంతర్జాతీయంగా ఎగుమతు లు చేసే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇంతకాలం వీరు సిండికేటుగా ఉంటూ నిర్ణయించుకున్న ధరకు రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుతం పంటకు డిమాండ్ పెరగటం, ఎగుమతిదారులకు సరుకు అవసరం కావటంతో అసలు వ్యవహారం బయటపడింది. రోజు మాదిరిగా నే మార్కెట్ ఉద్యోగులు గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో మిర్చికి జెండా పాట నిర్వహించారు. ఇందులో గరిష్టంగా ఓ వ్యాపారి క్వింటాకు రూ.9,230 పాడాడు. ఈ ధరకు కొంత అటు ఇటుగా(నాణ్యతనుబట్టి) అమ్మకానికి వచ్చిన మిర్చిని మిగతా వ్యాపారులు కొనుగోలు చేశారు. అయితే ఇద్దరు వ్యాపారులు ఎగుమతిదారుల సలహాతో కొందరు రైతుల వద్ద క్వింటాకు రూ. రూ.9,400 నుంచి రూ.9,500 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో మిర్చికి మరికొంత ధర ఉన్నట్లు బయటపడటంతో విషయం తెలిసిన రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి యార్డు గేటు వద్ద కొందరు రైతులు మార్కెట్ ఉద్యోగులు, వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేసి.. సరుకు రవాణా చేసే వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతులు పసిగట్టడంతో.. జెండా పాటకన్నా ఇద్దరు వ్యాపారులు ధర అధికంగా పెట్టి కొనుగోలు చేయటాన్ని కొందరు రైతులు పసిగట్టారు. తమ పంట నాణ్యంగా ఉన్నా.. తక్కువ ధర పట్టడం ఏమిటని రైతులు కమీషన్ వ్యాపారులను నిలదీశారు. దీంతో మిర్చికి డిమాండ్ ఉన్న విషయం బయటపడింది. ఇది మార్కెట్ అంతా పొక్కడంతో రైతులు తాము పంట విక్రయించమని, తమ పంటకు కూడా ధర పెట్టాలని డిమాండ్ చేశారు. రెండోసారి జెండాపాట మొదటి జెండా పాటకన్నా కొందరు వ్యాపారులు రైతుల నుంచి అధిక ధరతో కొనుగోలు చేస్తున్నారని, మరోసారి జెండాపాట నిర్వహిస్తున్నట్లు మార్కెట్ అధికారులు ప్రకటించారు. పాటలో వ్యాపారులు క్వింటాల్‌కు రూ.700 అదనంగా ధర పెట్టారు. క్వింటాల్‌కు రూ.9,900 ధర పెట్టారు. రైతులందరూ తమ పంటకు ధర పెంచాలని కమీషన్ వ్యాపారులపై వత్తిడి తెచ్చారు. దీంతో మళ్లీ వ్యాపారులను పిలిచి.. పంటను పరిశీలించి నాణ్యత మేరకు ప్రస్తుతం ఉన్న డిమాండ్‌తో ధర పెట్టాలని కోరారు. వ్యాపారులు క్వింటాల్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు ధర పెంచి కొనుగోలు చేశారు. ‘సిండికేటు’గా దోపిడీ.. వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి మిర్చిలో ధర దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం మిర్చికి మద్దతు ధర నిర్ణయించకపోవటంతో పంటకు ధర ఎంత పలుకుతుందనే విషయం రైతులకు తెలియటం లేదు. దీంతో వ్యాపారులు కూడపలుక్కొని ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. ఇలాగే తగ ఏడాది మిర్చి సీజన్లో ధర దోపిడీకి పాల్పడ్డారు. నిత్యం రూ.లక్షల్లో దోపిడీ గురువారం ఖమ్మం మార్కెట్లో మిర్చి ధరలో వచ్చిన తేడాను పరిశీలిస్తే.. నిత్యం రూ.లక్షల్లో దోపిడీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం మార్కెట్‌కు 15వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. ఇది దాదాపు 7వేల క్వింటాళ్ల వరకు ఉంటుంది. పంట కొనుగోళ్ల ధరలో వచ్చిన తేడా వ్యవహారం బయటపడకపోతే రైతులు రూ.15లక్షల మేర దగాకు గురయ్యేవారు. ఈ లెక్కన నిత్యం మిర్చి ధరలో రైతులు రూ.లక్షల్లో దోపిడీకి గురవుతున్నట్లు విదితమవుతోంది. మరీ ఇంత దగానా.. మిర్చికి ధర ఉన్నా తక్కువ ధర పెట్టారు. 22 బస్తాల మిర్చిని అమ్మకానికి తెచ్చా. మొదట క్వింటాల్‌కు రూ.9,230 చొప్పున కొనుగోలు చేశారు. తరువాత ధర పెరిగిందని తెలిసింది. మొదటి ధరకు ఒప్పుకోలేదు. దీంతో మరో రూ.200 ధర పెంచారు. ఇంత దగా చేస్తారనుకోలేదు. – మాలోత్ సామ్యా, రైతు, సాతానిగూడెం, కామేపల్లి మండలం క్వింటాల్‌కు రూ.300 పెంచారు.. 21 బస్తాల మిర్చి అమ్మకానికి తెచ్చా. మొదట క్వింటాల్‌కు రూ.9,200 ధర పెట్టారు. ధర పెరిగిందని అంతా చెప్పటంతో కమీషన్ వ్యాపారిని ప్రశ్నించా. దీంతో మరో రూ.300 పెంచి క్వింటాల్‌కు రూ.9,500 చొప్పున ధర పెట్టాంచారు. మిర్చికి ధర ఉన్నా అన్యాయం చేస్తున్నారు. – నంద్యాల వెంకన్న, గట్టుసింగారం, కూసుమంచి మండలం ధర ఘటనపై విచారిస్తాం.. మిర్చికి ధర ఉన్న విషయం తెలిసి మరోసారి జెండాపాట నిర్వహించాం. జెండాపాటలో ఖరీదుదారులంతా పాల్గొనలేదు. వ్యాపారులు జెండాపాటలో పాల్గొనకుండా రైతుల నుంచి సరుకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతాం. – రత్నం సంతోష్‌కుమార్, ఖమ్మం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి -
రైతులేమన్నా ఉగ్రవాదులా..!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో మిర్చి యార్డుపై దాడికేసులో ఇటీవల అరెస్టయిన రైతులకు పోలీసులు బేడీలు వేసి కోర్టులో హాజరుపరచడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులకు వేసినట్టుగా అన్నదాతకు సంకెళ్లు వేయడంపై మండిపడ్డాయి. కేసీఆర్ అసలు స్వరూపం బయటపడింది మిర్చి పంటకు మద్దతు ధరకోసం నిలదీసిన రైతులేమన్నా ఉగ్రవాదులా? తీవ్రవా దులా? అన్నదాతకు సంకెళ్లు వేయడం కంటే నియంతృత్వం ఏముంటుంది. కేసీఆర్ అసలు స్వరూపం బయటపడింది. – ఉత్తమ్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు వెంటనే విడుదల చేయాలి మిర్చి రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేసి వెంటనే వారిని విడుదల చేయాలి. బాధిత రైతులకు పరిహారం చెల్లించాలి. రైతులకు సంకెళ్లు వేసినందుకు రాష్ట్ర రైతాం గానికి ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలి. – జి.కిషన్‌రెడ్డి, బీజేఎల్పీ నేత కన్నతల్లిని అవమానించినట్లే? ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేయడమంటే కన్నతల్లిని నడివీధిలో అవమానించినట్లే. రైతులకు సంకెళ్లు వేసే ధైర్యం పోలీసులకు ఎక్కడిది. ప్రభుత్వం రైతాంగాన్ని అవమానిస్తోంది. – కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి వారు దొంగలా? దోపిడీ దారులా? సంకెళ్లు వేయడానికి రైతులేమైనా దొంగలా? దోపిడీ దారులా? రైతులపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపడతాం. – చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అత్యంత బాధాకరం ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు సంకెళ్లు వేసి తీసుకుపోవడం అత్యంత బాధాకరం. ఇది రైతాంగాన్ని అవమానించడమే. కోర్టు అనుమతి లేకుండా సంకెళ్లు వేయకూడ దన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారు. సదరు పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకుని, కేసులు ఎత్తేయాలి. – కోదండరాం, టీజేఏసీ చైర్మన్ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఖమ్మం మార్కెట్ ఘటనలో రైతులకు బేడీలు వేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్షమాపణలు చెప్పాలి. రైతులపై కేసులు వెంటనే ఎత్తేసి వారిని విడుదల చేయాలి. – రేవంత్‌రెడ్డి, టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రైతులను ముంచుతున్నారు ప్రభుత్వం మార్కెట్లలో జోక్యం చేసుకోకుండా రైతులను ముంచుతోంది. రైతులకు సంకెళ్లు వేయడాన్ని సీపీఎం ఖండిస్తోంది. రైతులకు రక్షణగా నిలవాల్సిన ప్రభుత్వమే వారిని అణచివేస్తోంది. – తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రైతులకు బేడీలు వేస్తారా? రైతాంగాన్ని అవమానపరిచే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించింది. రైతులు ఏమైనా తీవ్రవాదులా? దేశ ద్రోహులా? దీనికి కేసీఆర్ తగిన మూల్యం చెల్లించకోక తప్పదు. ప్రభుత్వం రైతుల పట్ల ఇలా వ్యవహరించినప్పటికీ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. – గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు బేడీలు వేయడాన్ని ఖండిస్తున్నాం పోలీసులు రైతులకు బేడీలు వేయడాన్ని ఖండిస్తున్నాం. అధికారులకు గత ప్రభుత్వం లో పనిచేసిన వాసనలు పోలేదు. కేంద్రం ఇప్పటికైనా మిర్చికి రూ.7వేల ధర ప్రకటించాలి. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ -
ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయ్: తలసాని
హైదరాబాద్: మిర్చి రైతులను కావాలనే ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మిర్చి మద్దతు ధర అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని చెప్పారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఇప్పటికే తమ ప్రభుత్వం రైతులకోసం నీరు, తొమ్మిది గంటల విద్యుత్తుని అందిస్తోందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఏళ్ల తరబడి ప్రభుత్వాలు నిర్వహించిన సమయంలో రైతులు గుర్తుకు రాలేదంటూ ఎద్దేవా చేశారు. -
జగన్ రైతు దీక్ష వేదిక ఖరారు
-
జగన్ రైతు దీక్ష వేదిక ఖరారు
సాక్షి, గుంటూరు: సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతల పక్షాన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మే 1, 2 తేదీల్లో గుంటూరులో చేపట్టనున్న రైతు దీక్ష వేదిక ఖరారైంది. పార్టీ ముఖ్యనేతలు బుధవారం గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్డులో ఉన్న మిర్చి యార్డు సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు స్థలాన్ని దీక్షా ప్రాంగణంగా నిర్ణయించి, ఏర్పాట్లను పరిశీలించారు. -
మిర్చియార్డులో రైతుల ఆందోళన
గుంటూరు: గుంటూరు మిర్చి యార్డులో నెలరోజులకుపైగా ధరల పతనంతో కడుపు మండిన రైతన్నలు మంగళవారం రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు మిర్చి యార్డు - చికలకలూరిపేట రహదారిపై ఆందోళన చేశారు. కమిషన్, మచ్చుల పేరుతో మిర్చియార్డులో అధిక వసూళ్లని అరికట్టాలని, రైతుబంధు పధకం ద్వారా కోల్డ్ స్టోరేజీలో రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు తాను తీసుకుని వచ్చిన మిర్చికి గిట్టుబాటు ధర కోసం సెక్యూరిటీ గార్డులు కర్రతో దాడి చేశారని సత్తెనపల్లి, నకరికల్లు మండలానికి చెందిన రైతు కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గంటకుపైగా వారు రహదారిపై బైఠాయించడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య, జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, ప్రకాశం జిల్లా రైతు సంఘం నాయకులు వెంకట్రావ్, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగు రోజులు మిర్చి కొనుగోళ్లు బంద్
- హోలీ సందర్భంగా సెలవు ప్రకటించిన వ్యాపారులు కర్నూలు (వైఎస్ఆర్ సర్కిల్): కర్నూలు మిర్చి యార్డులో నాలుగు రోజుల పాటు మిర్చి కొనుగోళ్లు బంద్ కానున్నాయి. ఈమేరకు యార్డు కార్యదర్శి నారాయణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11, 12, 13, 14 తేదీల్లో కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిర్చి వ్యాపారలందరూ రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం, హోలీ వేడుకల నిర్వహణ కోసం సొంతూళ్లకు వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు అనుమతినివ్వాలని వ్యాపారులు కూడా వినతి పత్రం అందించడంతో కొనుగోళ్లు నిలిపివేస్తన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు యార్డు పరిధిలోని పలు గ్రామాలకు ఈ సమాచారం చేరవేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
మిర్చియార్డ్‌లో రగడ.. రైతుల ఆందోళన
గుంటూరు: గుంటూరులోని ఓ మిర్చియార్డ్‌లో గురువారం రగడ చోటుచేసుకుంది. మిర్చియార్డ్‌లో లావీదేవీలను అధికారులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మిర్చియార్డ్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి కొనుగోళ్లలో ఈ-ట్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే భారీగా సరుకు ఉండటంతో అధికారులు లావీదేవీలు నిలిపివేసినట్టు ప్రకటించారు. గతకొన్ని రోజులుగా యార్డ్‌లో ఎక్కువమొత్తంలో సరుకు ఉండిపోయింది. దాంతో మిర్చి డిక్కీలు భయటకు తరలించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రైతులు తమ వద్ద మిర్చి కొనలంటూ ఆందోళనకు దిగారు.