మిర్చి రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు
హైదరాబాద్: మిర్చి రైతులను కావాలనే ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆగ్రహం వ‍్యక‍్తం చేశారు. శనివారం ఉదయం ఆయన ఇక‍్కడ మీడియాతో మాట్లాడుతూ మిర్చి మద‍్దతు ధర అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని చెప్పారు.
గత ప్రభుత్వాలకు భిన్నంగా ఇప్పటికే తమ ప్రభుత్వం రైతులకోసం నీరు, తొమ్మిది గంటల విద్యుత్తుని అందిస్తోందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఏళ్ల తరబడి ప్రభుత్వాలు నిర్వహించిన సమయంలో రైతులు గుర్తుకు రాలేదంటూ ఎద్దేవా చేశారు.