talasani srinivas
-
BRS ప్రజా ప్రతినిధుల ఫోన్లు ఎత్తడం లేదు: తలసాని
-
ఆస్కార్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం ఘన సన్మానం
-
ఇంట్లోనే అమ్మవారికి బోనాలు సమర్పించండి
-
కేటీఆర్, తలసానిపై కేసులు పెట్టాలి : మర్రి
సాక్షి, హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి అంబేడ్కర్ నగర్లో ఇళ్లు ఖాళీ చేయించి మోసం చేసినందుకు మం త్రులు కె.తారక రామారావు, తలసాని శ్రీనివాస్‌పై చీటింగ్ కేసులు నమోదు చేయాలని మాజీమంత్రి మర్రి శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. మంత్రులపై కేసులు పెట్టాలంటూ రాష్ట్ర డీజీపీకి గతంలోనే ఫిర్యాదు చేశానన్నారు. హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం చేస్తే కాలుష్యం అవుతుందని, నిమజ్జనం కోసం అంబేడ్కర్ నగర్లో కొలను కట్టిస్తామని పేదల ఇళ్లు ఖాళీ చేయించారని.. ఇళ్లు ఖాళీ చేసినవారికి డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు ఇళ్లు కాకుండా చెరువును నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. సనత్ నగర్‌లోని వక్ఫ్ భూమిలో ఇళ్లు కట్టుకున్నవారిని ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ నోటీసులను ఇచ్చిందని, ఈ భూమిని కబ్జా చేయాలని ఈ మంత్రులిద్దరూ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయ్: తలసాని
హైదరాబాద్: మిర్చి రైతులను కావాలనే ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మిర్చి మద్దతు ధర అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని చెప్పారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఇప్పటికే తమ ప్రభుత్వం రైతులకోసం నీరు, తొమ్మిది గంటల విద్యుత్తుని అందిస్తోందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఏళ్ల తరబడి ప్రభుత్వాలు నిర్వహించిన సమయంలో రైతులు గుర్తుకు రాలేదంటూ ఎద్దేవా చేశారు. -
పశువైద్యశాలలకు పక్కా భవనాలు
హైదరాబాద్: పశు వైద్యశాలలకు ప్రభుత్వ పక్కా భవనాలు నిర్మిస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పశు సంపద ఆరోగ్య రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పశు సంపద ఆరోగ్య రక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,117 పశు వైద్యశాలలు పని చేస్తున్నాయని చెప్పారు. త్వరలోనే సంచార పశు వైద్యశాలలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏప్రిల్ చివరి నాటికి వచ్చే ఈ వాహనాలు పశువులకు అత్యవసర సేవలను అందిస్తాయని పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున కేటాయిస్తామని చెప్పారు. జీవాల మీద ఆధారపడిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పశు సంవర్ధక శాఖలో 161 పోస్టులను పబ్లిక్ కమిషన్ ద్వారా భర్తీ చేశామని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. -
'చంద్రబాబు సినిమావాళ్లను వాడుకున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం సినిమా వాళ్లను అడ్డం పెట్టుకుని ఎదిగారని విమర్శించారు. చంద్రబాబు తన అవసరం కోసం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్‌లను వాడుకున్నారని ఆరోపించారు. సినిమా పరిశ్రమ విశాఖపట్నానికి తరలిరావాలని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ నాయకులు ఓటుకునోటు కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లారనీ, అలాంటి వారికి తమను విమర్శించే నైతిక హక్కు లేదని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం విధ్యార్థుల కోసం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసినంత మాత్రాన సన్న బియ్యమవుతుందా అని తలసాని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలలో ఏమైనా లోపాలుంటే నిరూపించి మాట్లాడాలన్నారు. నోరు ఉందని ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. -
వాణిజ్య సంస్కరణలపై 15 రోజుల్లో నిర్ణయం
హైదరాబాద్: పదిహేను రోజుల్లో మరోసారి సమావేశమై వాణిజ్య పన్నుల సంస్కరణల్లో నిర్ణయాలు తీసుకుంటామని టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వాణిజ్య పన్నుల సంస్కరణలపై తెలంగాణ మంత్రివర్గం ఉపసంఘం భేటీ అయింది. ఈ భేటీకి మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న, ఉన్నతాధిఆరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో జీరో వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పారు. వ్యాపారస్థులంతా విధిగా పన్నులు చెల్లించాలని స్పష్టం చేశారు. -
'టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా'
సత్తుపల్లి (ఖమ్మం జిల్లా):‘కేసీఆర్‌పై ఇక యుద్ధం మొదలైంది.. ఆరు నెలలు ఓపిక పట్టండి టీఆర్ఎస్ను తుక్కుతుక్కుగా ఓడిస్తాం.. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే నాలుగేళ్లు ఏమీ మాట్లాడం.. రాజకీయ సన్యాసం తీసుకుంటాం’ అని టీడీపీ శాసనసభా పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం రాత్రి టీడీపీ ఎమ్మెల్యేల బృందం సండ్ర వెంకటవీరయ్యకు సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ మా పార్టీ ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొన్నప్పుడు కేసుకాదు.. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వయానా డబ్బుల కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు అయినా కేసు కాలేదన్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఇటీవల జరిగిన ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బుద్ధి చెప్పారన్నారు. తలసాని శ్రీనివాసయాదవ్‌కు సనత్‌నగర్‌లో మూడో స్థానం దక్కుతుందని.. 25వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సండ్ర వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందునే ఏ తప్పు చేయకపోయినా కేసులో అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కొన్ని పొరబాట్లు జరగటం వల్లే సీట్లు తగ్గాయని... కనీసం 30 నుంచి 32 స్థానాలు రావాల్సి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి తమ పార్టీని దెబ్బతీసేందుకే సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారాలని నాతోపాటు ప్రకాష్‌గౌడ్, సండ్ర వెంకటవీరయ్య వెంటపడ్డారని లొంగక పోయేసరికి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని ఆరోపించారు. సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ రాజకీయంగా నా మనోధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. విశాఖపట్నంలో మా పిల్లలు చదువుతుంటే ఫార్మా ఇండ్రస్ట్రీ పెట్టానని ఆరోపణలు చేస్తున్నారని.. ఎన్నికల అఫిడవిట్లో ఏవైతే దాఖలు చేశానో.. దానికంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా.. రాసిస్తానన్నారు. బినామీల పేరుమీద అక్రమ ఆస్తులు సంపాదించాల్సిన కర్మ పట్ట లేదన్నారు. చిల్లర ఆరోపణలు మానుకోవాలని... విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నానన్నారు. పోలీసులు, అధికారులను ప్రయోగించి పార్టీ మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, మాగంటి గోపినాథ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి బ్రహ్మయ్య, మెచ్చా నాగేశ్వరరావు, వాసిరెడ్డి రామనాధం తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా చంద్రబాబు గుమ్మం చుట్టూ తిరుగుతున్నారు
హైదరాబాద్: ప్రతి రోజూ చంద్రబాబునాయుడు గుమ్మం పట్టుకుని తిరిగే వారంతా జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పరిపాలనలో ఎలాంటి లోపాలు ఉండవని, ఇక్కడ పరిపాలించేది తెలంగాణ ప్రభుత్వం అనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. సినిమా ఇండస్ట్రీపై ఏ ఒక్కరు ఆదిపత్యం ప్రదర్శించాలని చూసినా బాగోదని అన్నారు. అది ఎవరి జాగీర్ కాదని చెప్పారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా టీఆర్ఎస్ పార్టీ అందరినీ ఆదుకుంటుందని, సినిమా ఇండస్ట్రీకి తప్పకుండా సహాయం చేస్తుందని చెప్పారు. తెలుగు సినీ చిత్ర పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం ఆదరిస్తుందని, ఇప్పటికే హైదరాబాద్‌ను సినీ హబ్‌గా చేస్తామని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. -
ప్రభుత్వానికి హామీలు నెరవేర్చే ఆదాయం ఉంది...