
ఇంకా చంద్రబాబు గుమ్మం చుట్టూ తిరుగుతున్నారు
హైదరాబాద్: ప్రతి రోజూ చంద్రబాబునాయుడు గుమ్మం పట్టుకుని తిరిగే వారంతా జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పరిపాలనలో ఎలాంటి లోపాలు ఉండవని, ఇక్కడ పరిపాలించేది తెలంగాణ ప్రభుత్వం అనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. సినిమా ఇండస్ట్రీపై ఏ ఒక్కరు ఆదిపత్యం ప్రదర్శించాలని చూసినా బాగోదని అన్నారు.
అది ఎవరి జాగీర్ కాదని చెప్పారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా టీఆర్ఎస్ పార్టీ అందరినీ ఆదుకుంటుందని, సినిమా ఇండస్ట్రీకి తప్పకుండా సహాయం చేస్తుందని చెప్పారు. తెలుగు సినీ చిత్ర పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం ఆదరిస్తుందని, ఇప్పటికే హైదరాబాద్ను సినీ హబ్గా చేస్తామని కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు.