అడుగడుగునా భద్రతా వైఫల్యం | Security is minimal during Jagans visit | Sakshi
Sakshi News home page

అడుగడుగునా భద్రతా వైఫల్యం

Published Thu, Feb 20 2025 5:35 AM | Last Updated on Thu, Feb 20 2025 7:49 AM

Security is minimal during Jagans visit

జగన్‌ పర్యటనలో నామమాత్రంగా సెక్యూరిటీ..రోప్‌ పార్టీగా మారి కదిలిన నాయకులు, కార్యకర్తలు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: అన్నదాతలను పరామర్శించి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చి యార్డు వద్దకు వచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ భద్రత విషయంలో టీడీపీ కూటమి సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆయన పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ సీఎం పర్యటన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రశ్నార్థకంగా మా­రింది. 

బుధవారం గుంటూరు మిర్చి యార్డులో వైఎస్‌ జగన్‌ పర్యటనకు సంబంధించి ఆయన పీఏ కె.నాగేశ్వర­రెడ్డి ఒక రోజు ముందుగానే గుంటూరు కలెక్టర్, డీజీపీ, విజయవాడ పోలీసు కమిషనర్, గుంటూరు ఎస్పీ, ఐజీ ఇంటెలిజెన్స్‌(సెక్యూరిటీ)లకు సమా­చార­మిచ్చారు. 

జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన మాజీ సీఎంకి అవ­సరమైన సెక్యూరిటీ, ఎస్కార్ట్‌ ఏర్పా­టు చే­యా­లని కోరా­రు. జగన్‌ పర్యటనను పట్టించుకోవద్దని గుంటూరు జిల్లా పోలీసులకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. 

నాయకులు, కార్యకర్తలే రోప్‌ పార్టీగా..
గుంటూరులోకి రాగానే జగన్‌ను పలుకరించేందుకు ‘వై జంక్షన్‌’ నుంచి మిర్చి యార్డు వరకు మహిళలు, పార్టీ నేతలు, అభిమానులు రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున బారులు తీరారు. పలువురు నేతలు, కార్యకర్తలే రోప్‌ పార్టీగా మారి ముందుకు కదిలారు. జగన్‌ మిర్చి యార్డు వద్దకు వచ్చేదాకా ఇదే పరిస్థితి ఉంది. మాజీ సీఎం అక్క­డ పర్యటిస్తున్నా ఒక్క పోలీసు కూడా పరిస్థితిని చక్కదిద్ద­కపోవడంతో తోపు­లాట జరిగింది. 

మరోవైపు జగన్‌ కార్య­క్రమానికి అడ్డంకులు కల్పించేందుకు ఆయన మాట్లాడే సమయంలో పదే పదే మైక్‌లో అనౌన్స్‌మెంట్లు చేయించా­రు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సమా­వేశానికి అనుమతులు లేవంటూ ప్రకట­నలు చేశారు. దీంతో మీడియాతో మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో జగన్‌ తన వాహనంలో కొద్దిసేపు నిరీక్షించారు. అరగంట తర్వా­త తన వాహనం వద్దకు చేరుకోగలిగిన కొందరు మీడి­యా ప్రతినిధులతో మాత్రమే మాట్లాడి వెళ్లాల్సి వచ్చింది.  



ప్రతిపక్ష నేతకు కనీస భద్రత లేదు: వైఎస్‌ జగన్‌
ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వచ్చి రైతులతో మా­ట్లాడే ప్రయత్నం చేస్తుంటే.. కనీస పోలీసు భద్రత కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఎల్ల­కాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపు మీరు ప్రతి­పక్షంలో ఉన్న­ప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత తీసేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు ఒక్కసారి ఆలోచన చేసుకో­వాలి. మీరు చేస్తున్నది సరైనదో కాదో ఆలోచన చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement