నాలుగు రోజులు మిర్చి కొనుగోళ్లు బంద్
Published Fri, Mar 10 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
- హోలీ సందర్భంగా సెలవు ప్రకటించిన వ్యాపారులు
కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): కర్నూలు మిర్చి యార్డులో నాలుగు రోజుల పాటు మిర్చి కొనుగోళ్లు బంద్ కానున్నాయి. ఈమేరకు యార్డు కార్యదర్శి నారాయణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11, 12, 13, 14 తేదీల్లో కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిర్చి వ్యాపారలందరూ రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం, హోలీ వేడుకల నిర్వహణ కోసం సొంతూళ్లకు వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల పాటు అనుమతినివ్వాలని వ్యాపారులు కూడా వినతి పత్రం అందించడంతో కొనుగోళ్లు నిలిపివేస్తన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు యార్డు పరిధిలోని పలు గ్రామాలకు ఈ సమాచారం చేరవేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement