
వైఎస్సార్‌సీపీ హయాంలో రైతే రాజు.. మరి ఇప్పుడు కూటమి పాలనలో ఆ రైతు బతకడమే కష్టంగా మారిపోయింది

గిట్టుబాటు ధర లేక.. ప్రభుత్వం నుంచి ఏ సాయం అందక రైతులు అల్లలాడిపోతున్నారు

ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ రైతులకు అండగా నిలవాలని నిర్ణయించుకుంది

గుంటూరుకు వెళ్లిన వైఎస్ జగన్.. అక్కడి యార్డులోని మిర్చి రైతులతో వైఎస్ జగన్ మాట్లాడారు. వాళ్ల గోడు విన్నారు

కూటమి పాలనలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని, పెట్టుబడి సాయం ఇవ్వకుండా రైతులను మోసం చేశారని, ఆఖరికి ఎరువులు బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతు కష్టపడుతున్నాడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ జగన్ మండిపడ్డారు

చంద్రబాబు కారణంగానే గుంటూరు మిర్చి రైతులు కన్నీళ్లు పెడుతున్నారన్నారు

చంద్రబాబూ.. ఇకనైనా కళ్లు తెరిచి రైతులను అన్ని విధాల ఆదుకోవాలని, లేకుంటే వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు

