‘14 డేస్ లవ్’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసిన వి.వి. వినాయక్‌ | Vv Vinayk Launched 14Days Love First Look | Sakshi
Sakshi News home page

‘14 డేస్ లవ్’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేసిన వి.వి. వినాయక్‌

Published Fri, Feb 11 2022 2:24 PM | Last Updated on Fri, Feb 11 2022 2:27 PM

Vv Vinayk Launched 14Days Love First Look - Sakshi

Vv Vinayk Launched 14Days Love First Look: మనోజ్ పుట్టుర్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం  ‘14 డేస్ లవ్’. నాగరాజ్ బోడెమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హరిబాబు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ని డైరెక్టర్‌ వి.వి. వినాయక్‌  ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘ఈ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చాలా బాగుంది, మంచి ప్రేమకథని ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు నాగరాజ్ బోడెమ్‌కు, నిర్మాత హరిబాబుకి ఈ చిత్రం మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుతూ.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement