ట్రాఫిక్‌ని రీమేక్ చేద్దామనుకున్నాను - వీవీ వినాయక్
‘‘‘ట్రాఫిక్’ చిత్రం కథ, కథనాలు అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్‌ని సొంతం చేసుకున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ అదృష్టవంతుడు.
‘‘‘ట్రాఫిక్’ చిత్రం కథ, కథనాలు అద్భుతంగా ఉంటాయి. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్‌ని సొంతం చేసుకున్న తుమ్మలపల్లి రామసత్యనారాయణ అదృష్టవంతుడు. ఈ చిత్రాన్ని నేను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాను. మాతృకలో సూర్య చేసిన పాత్రను ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి టాప్‌స్టార్స్‌తో చేయించాలనుకున్నాను’’ అని వి.వి. వినాయక్ అన్నారు. రాధిక, శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్ ముఖ్య తారలుగా, సూర్య ప్రత్యేక పాత్రలో రూపొందిన తమిళ చిత్రం ‘చెన్నయిల్ ఒరునాళ్’. షాహిద్ ఖాదర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘ట్రాఫిక్’ పేరుతో తుమ్మలపల్లి రామసత్యనారాయణ అనువదించారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ నెల 14న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో సి.కల్యాణ్, కె.వి.వి.సత్యనారాయణ, రేలంగి నరసింహారావు, వీరశంకర్, ప్రసన్నకుమార్. బి.కాశీవిశ్వనాథం, మల్టీ డైమన్షన్స్ వాసు, సత్యనారాయణరెడ్డి, దేవిప్రసాద్, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.