alludu seenu
-
' స్పీడున్నోడు' వర్కింగ్ స్టిల్స్
-
'స్పీడున్నోడు' జోరు చూపిస్తున్నాడు
అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్‌కి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. గతంలో మరే హీరో చేయని విధంగా భారీ బడ్జెట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్, తొలి సినిమాతో నటుడిగా మెప్పించినా.., కమర్షియల్‌గా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకొని రెండేళ్ల విరామం తరువాత ఓ రీమేక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం రీమేక్ స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో స్పీడున్నోడు సినిమాలో నటిస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన సుందరపాండ్యన్ సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరిదశలో ఉంది. తొలి సినిమా తరువాత రెండేళ్ల విరామం తీసుకున్న సాయి శ్రీనివాస్, రెండో సినిమా తరువాత మాత్రం గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. స్పీడున్నోడు సెట్స్ మీద ఉండగానే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. సాయి శ్రీనివాస్ రెండో సినిమాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటించాల్సి ఉంది. కానీ అప్పట్లో హీరో మార్కెట్ దృష్ట్యా ఆ సినిమా వాయిదాపడింది. స్పీడున్నోడు సినిమా మీద ఉన్న నమ్మకంతో మరోసారి బోయపాటి సినిమాను లైన్లో పెట్టాడు సాయి. అంతేకాదు యంగ్ డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో కూడా మరో సినిమాను రెడీ చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు పట్టాలెక్కిస్తాడో చూడాలి. -
ఆ క్లైమాక్స్ చాలా కాలం హాంట్ చేసింది!
‘‘సాధారణంగా కొన్ని సినిమాలు థియేటర్లో చూసి బయటకు రాగానే మర్చిపోతాం. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ మాత్రం అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది’’ అని బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో భీమనేని సునీత నిర్మిస్తున్న ‘స్పీడున్నోడు’ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సంద ర్భంగా పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు... తమిళ ‘సుందరపాండ్యన్’ సినిమా క్లైమాక్స్ నన్ను చాలాకాలం హాంట్ చేసింది. అందులో ఎమోషన్స్‌కి కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా ఒప్పుకున్నా. ఆ సినిమా మెయిన్ థీమ్ మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి ‘స్పీడున్నోడు’ చేస్తున్నాం. హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఓ కుర్రాడు తనకు ఎదురైన సమస్యను ఎలా డీల్ చేశాడ నేది కథ. అన్ని వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్న సినిమా ఇది. ‘అల్లుడు శీను’ సినిమా కంటే డ్యాన్సులు, ఫైట్ల విషయంలో దీనికి పది రెట్లు ఎక్కువ కష్టపడ్డాను. ఇందులో నేను విలేజ్‌కు చెందిన కుర్రాణ్ణి కాబట్టి బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నా. రెండు పాటలు మినహా ‘స్పీడున్నోడు’ పూర్తయింది. ఈ నెల 16న పాటలు విడుదల చేయాలనుకుంటున్నాం. అసలు నా రెండో సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనుగారితో చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ముందే బన్నీతో బోయపాటి గారు ఓ సినిమా చేద్దామనుకున్నారు. కానీ బన్నీ డేట్స్ దొరక్కపోవడంతో నాతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే కథ సరిగ్గా సెట్ కాకపోవడంతో ఆ ప్రాజెక్టు వెనక్కు వెళ్లింది. ఈ ఏప్రిల్ 8 నుంచి బోయపాటి శ్రీనుగారి సినిమా స్టార్ట్ అవుతుంది. అలాగే ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయకుమార్ కొండా దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుంది. -
'స్పీడున్నోడు'గా అల్లుడు శీను
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన తొలి సినిమాతో కమర్షియల్ హిట్ కొట్ట లేకపోయినా.. నటుడిగా మాత్రం మంచి మార్కులే సాధించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శీను సినిమాలో యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్‌లు, ఫైట్స్ ఇరగదీసి కుర్ర హీరోలకు షాక్ ఇచ్చాడు. తొలి సినిమా ఫెయిల్యూర్‌తో ఆలోచనలో పడ్డ అల్లుడు శీను రెండు సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించి ఆగిపోవటంతో ప్రస్తుతం రీమేక్ స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన సుందర పాండియన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాకు స్పీడున్నోడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ముందుగా సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించినా, పెద్ద సినిమాల పోటి ఉండటంతో ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
భీమనేనితో... అల్లుడు శీను
‘అల్లుడు శీను’ చిత్రంతో చేరువైన బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రం ఏమిటా అన్న ఆసక్తికి ఎట్టకేలకు తెర పడింది. ఈ యువ హీరో నటించనున్న రెండో చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. వినోదభరిత చిత్రాలకు చిరునామా అయిన భీమనేని శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకుడే కాక నిర్మాత కూడా కావడం విశేషం. గుడ్ విల్ సినిమా పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వినాయక్ క్లాప్ ఇచ్చారు. బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. భీమనేని మాట్లాడుతూ,‘‘తమిళంలో ‘సుందర పాండ్యన్’, కన్నడంలో ‘రాజహులి’ గా విడుదలై విజయాన్ని సాధించిన కథను చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేశాం’’ అని చెప్పారు. ఈ నెల 16 నుంచిరెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, ఆగస్టు 28న ఈ విడుదల చేయనున్నామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: భీమనేని సునీత, సమర్పణ: భీమనేని రోషితా సాయి. -
హీరోగా ది బెస్ట్ అనిపించుకుంటా!
- బెల్లంకొండ శ్రీనివాస్ ‘‘ఈ ఆరు నెలల్లో బోల్డన్ని కథలు విన్నాను. వాటిల్లో కొన్ని కథలు ఎంపిక చేశాం. ‘అల్లుడు శీను’తో హీరోగా నా రంగప్రవేశం భారీగా జరగడం, ఆ చిత్రం భారీ విజయం సాధించడంతో నా తదుపరి చిత్రం కూడా దానికి దీటుగా ఉండాలనుకుంటున్నా. అందుకే కథ ఎంపిక కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నాను’’ అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘నా తొలి చిత్రం కమర్షియల్ పంథాలో సాగుతుంది. ఆ తరహా చిత్రాల్లో డాన్స్, ఫైట్స్‌కి బాగా ఆస్కారం ఉంటుంది. అందుకని, నా తదుపరి చిత్రాలు కూడా ఈ కోవలోనే ఉండాలని కోరుకుంటున్నాను. బోయపాటిగారు ఓ మంచి కమర్షియల్ కథ తయారు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం బాడీ బిల్డప్ చేశాను. డాన్స్, జిమ్నాస్టిక్స్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను’ అని చెప్పారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో చేయనున్న చిత్రం గురించి శ్రీనివాస్ చెబుతూ -‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన ‘సుందర పాండియన్’కి ఇది రీమేక్. స్నేహం నేపథ్యంలో సాగే ఈ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలుస్తున్నారు’’ అని తెలిపారు. కెరీర్ ప్రారంభంలో ఉన్నందు వల్ల సినిమాల ఎంపిక విషయంలో కొంచెం ఒత్తిడి ఉంటుందని చెబుతూ - ‘‘హీరోగా ‘ది బెస్ట్’ అనిపించుకోవాలన్నది నా తాపత్రయం. మరో మూడు, నాలుగు సినిమాల వరకూ సినిమాలు చేసే విషయంలో కొంచెం స్లోగా వ్యవహరిస్తాం. ఆ తర్వాత వేగం పెంచుతా’’ అన్నారు. సినిమా సినిమాకీ నటనపరంగా వైవిధ్యం కనబర్చడానికి వంద శాతం కృషి చేస్తాననీ, తన లక్ష్యం అదేననీ చెప్పారు. -
కసరత్తులతో బిజీ..
‘అల్లుడు శీను’తో తనలో మంచి మాస్ హీరో ఉన్నాడని నిరూపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రం త్వరలో ఆరంభం కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. చిత్రవిశేషాలను బోయపాటి తెలియజేస్తూ - ‘‘వినాయక్ దర్శకత్వంలో శ్రీనివాస్ చేసిన తొలి చిత్రంలో అతనిలోని మాస్ యాంగిల్ కనబడింది. అందుకు భిన్నంగా రెండో సినిమా ఉండాలనుకుంటున్నాం. ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. శ్రీనివాస్ గెటప్, లుక్ చాలా భిన్నంగా ఉంటాయి. శరీరాకృతిలో కూడా మార్పు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ మార్పు కోసం శ్రీనివాస్ కసరత్తులు చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చెప్పారు. శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘బోయపాటి శ్రీనుగారు చెప్పిన కథ అద్భుతంగా ఉంది. నా రెండో సినిమాకి ఆయన దర్శకుడు కావడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌కి ఈ చిత్రం మరో మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
అన్ని వర్గాలను అలరిస్తా
చాగలు: అన్ని వర్గాలు మెచ్చే చిత్రాల్లో నటించాలన్నదే తన లక్ష్యమని ‘అల్లుడుశీను’ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. చాగల్లులో గణపతి నవరాత్రి మహోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తండ్రి బెల్లంకొండ సురేష్ సినీ నిర్మాత కావడంతో చిత్ర పరిశ్రమలోకి రావాలన్న ఆసక్తి కలిగిందన్నారు. దర్శకుడు వీవీ వినాయక్‌తో తన కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. దీంతో వినాయక్ దర్శకత్వంలో హీరోగా పరిచయమయ్యానన్నారు. అల్లుడుశీను సినిమా విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రాన్ని 95 రోజుల్లో పూర్తిచేసేలా దర్శకుడు షెడ్యూల్ రూపొందించారని చెప్పారు. దర్శకుడు వినాయక్ సెట్లో అందరినీ నవ్విస్తూ ఉండేవారని చెప్పారు. పట్టుదల, కార్యదక్షత ఉంటే చిత్ర పరిశ్రమలో అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయన్నారు. తన వయసు 21 ఏళ్లు అని, ప్రైవేట్‌గా బీకాం చదువుతున్నట్టు తెలిపారు. మంచి నటుడిగా గుర్తింపు పొందాలనే ఆశయంతో ముందుకు సాగుతున్నానని చెప్పారు. చాగల్లులో గణపతి నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కళాకారులు, విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని కొనియాడారు. గతంలో దర్శకుడు వినాయక్ వివాహానికి కుటుంబసభ్యులతో కలిసి ఇక్కడకు వచ్చానని.. మళ్లీ ఇన్నాళ్లకు చాగల్లు రావడం ఆనందంగా ఉందన్నారు. గ్రామంలోని తెలగా వినాయకుడి ఆలయం వద్ద జరిగిన సరస్వతి పూజలో పాల్గొన్నారు. దర్శకుడు వీవీ వినాయక్, మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్రకుమార్, ఏఎంసీ డెరైక్టర్ జుట్టా కొండలరావు, తెలగా సంఘం కమిటీ పెద్దలు ఆయన వెంట ఉన్నారు. -
అల్లుడు శీనుకు ఓకే చెప్పిన శృతి
-
అతిలోక సుందరి ప్రపోజల్ నా దగ్గరికి రాలేదు!
కెరీర్‌పై పూర్తి క్లారిటీతో ఉంటారు తమన్నా. ఆమె సినీ ప్రయాణం విజయవంతంగా సాగడానికి కారణం అదే. కెరీర్ మొదలై పదేళ్లు కావొస్తున్నా, కొత్త కొత్త అందాలు తెరను పలకరిస్తున్నా... యువతరంలో తమన్నా క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. రీసెంట్గా ‘అల్లుడు శీను’తో కలిసి ఐటమ్ నంబర్లో అదరహో అనిపించారు. ‘అల్లుడు శీను’ ప్రమోషన్లో పాల్గొన్న ఈ మిల్కీబ్యూటీ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. మీ ఐటమ్ సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉంది? బావుందండీ... అందరూ అభినందిస్తున్నారు. తమన్నా మంచి డాన్సర్ అని అందరూ అంటున్నారంటే కారణం ‘బద్రీనాథ్’ సినిమా. ఆ సినిమాకు దర్శకుడు వినాయక్‌గారే. ఇప్పుడు ఆయన సినిమా కోసమే ఐటమ్ నంబర్ చేయడం ఆనందంగా ఉంది. శ్రీనివాస్‌లో మంచి ఫైర్ ఉంది. తనకు పోటీగా డాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాను. హీరోయిన్గా మంచి స్టేజ్‌లో ఉండి.. ఐటమ్ సాంగ్ చేయడానికి ప్రత్యేకమైన కారణం? మంచి మనుషులందరూ కలిసి పని చేసిన సినిమా ఇది. అందుకే... వారితో కాసేపైనా కలిసి పని చేయాలనిపించింది. రెండు మూడు రోజుల్లో పాట చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ టీమ్‌ని వదిలి వెళ్లడం బాధనిపించింది. ఒక్క పాటకు రెండు కోట్లు తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. నిజమేనా? ఆ రాసిన వాళ్ల సంపాదన నేను అడగలేదు కదా. అలాంటప్పుడు నా సంపాదనతో వారికి పనేంటి? నాలాంటి ఇమేజ్ ఉన్న హీరోయిన్ ఈ సినిమాలో ఓ సాంగ్ చేస్తే సినిమాకి హెల్ప్ అవుతుందని దర్శక, నిర్మాతలు భావించారు. నాకు ఎంతివ్వడం కరెక్టో వారికి తెలుసు. అంతకు మించి అడిగే మనస్తత్వం కూడా కాదు నాది. ఇది స్నేహధర్మంగా చేసిన పాటే. మీ బాలీవుడ్ ఫిలిం ‘హమ్షకల్’ అంతగా ఆడలేదు కదా! అదంత బ్యాడ్ మూవీ ఏం కాదు. కానీ... దానికి అనుకున్నదానికంటే ఎక్కువ విమర్శలొచ్చాయి. ఒక నటిగా సినిమాకు పనిచేస్తాను అంతే.. సినిమా సక్సెస్ అనేది నా చేతిలో ఉండదు కదా. తెలుగులో నేను చేసిన తొలి సినిమా ‘శ్రీ’ పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కూడా వరుసగా నాలుగు ఫ్లాపులొచ్చాయి. నా అయిదవ సినిమా ‘హ్యాపీడేస్’. మొదట్లో ఎదురైన ఫ్లాపులకే నేను భయపడి ఉంటే హీరోయిన్గా ఇంత సాధించి ఉండేదాన్ని కాదు కదా. ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ ప్రమోషన్లో ఉన్నట్లున్నారు? అవును... సౌత్‌తో పోలిస్తే బాలీవుడ్లో ప్రమోషన్‌కి ఎక్కువ రోజులు కేటాయించాలి. ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ సినిమా బాగా వచ్చింది. సక్సెస్ అవుతుందనుకుంటున్నా. బాలీవుడ్ కారణంగా సౌత్‌లో సినిమాలు తగ్గినట్టున్నాయి? దక్షిణాదిన బిజీగానే ఉన్నాను. తెలుగులో‘ఆగడు’, ‘బాహుబలి’, తమిళంలో ఆర్య హీరోగా రూపొందుతోన్న సినిమా చేస్తున్నాను. ఇవేమీ ఓ మూడు నెలల్లో పూర్తయ్యే సినిమాలు కావు. అన్నీ భారీ సినిమాలే. టైమ్ పడుతుంది. బాలీవుడ్లో కూడా కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయి. ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా ఉన్నాను. ఇంతకంటే ఫాస్ట్‌గా సినిమాలు చేయలేను. ‘బాహుబలి’ అనుభవాలు చెప్పండి? ‘బాహుబలి’ సెట్లో ఉన్నంతసేపూ ఓ గొప్ప నటిగా ఫీలవుతున్నాను. సాధారణంగా నాకు ఒంటిగంటకల్లా ఆకలేస్తుంది. కానీ... ఆ సెట్లో ఉంటే ఆకలే వేయడం లేదు. తర్వాత షాట్ ఎలా పెడతారు, ఎలాంటి సీన్ తీస్తారు... ఇవే ఆలోచనలు. ఇందులో నాది వారియర్ ప్రిన్సెస్ పాత్ర. ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. నేను తొలి భాగంలో ఉంటాను. ఇటీవలే నేనూ, ప్రభాస్ పాల్గొనగా ఓ పాట తీశారు. సాధారణంగా రోప్స్ అనేవి ఫైట్లకు వాడతారు. కానీ ఈ పాటకోసం వాడారు. ‘ఆగడు’లో మీరు పోలీస్ అంట కదా? లేదు.. ఇందులో నాది పల్లెటూరి అమ్మాయి పాత్ర. మహేశ్‌తో ఎప్పుడో చేయాల్సింది. ఇన్నాళ్లకు కుదిరింది. శ్రీనువైట్ల ‘రెడీ’లో ప్రత్యేక పాత్ర చేశాను. అప్పట్నుంచి ఆయనతో సినిమా చేయాలని ఉండేది. ఇన్నాళ్లకు కుదిరింది. సినిమా సూపర్బ్‌గా వస్తోంది. మహేశ్ ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఈ సినిమా. ‘జగదేక వీరుడు- అతిలోక సుందరి’ రీమేక్‌లో మీరే కథానాయిక అని టాక్? నేనూ, రాఘవేంద్రరావుగారు, చిరంజీవిగారూ కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ కార్యక్రమ వ్యాఖ్యాత...‘జగదేకవీరుడు...’ మళ్లీ తీస్తే చరణ్‌కి జోడీగా ఎవరు బాగుంటారు? అని రాఘవేంద్రరావుగారిని అడిగింది. ఆయన... దానికి సమాధానం చిరంజీవి చెబితే బావుంటుందన్నారు. అప్పుడు చిరంజీవిగారు నా పాత్రను చరణ్, శ్రీదేవి పాత్రను తమన్నా చేస్తే బావుంటుందని అన్నారు. అంతే తప్ప అలాంటి ప్రపోజల్ ఏదీ నా దగ్గరకు రాలేదు. ఈ మధ్య కాస్త తగ్గినట్టున్నారు? హిందీ సినిమా కోసం తగ్గాను. అక్కడ హీరోయిన్లందరూ ఫిట్‌గా ఉంటారు. అందుకే... ఇలా తయారయ్యా. అయిదు కేజీలు తగ్గాను. మరి ఇక్కడ హీరోయిన్లు బొద్దుగా ఉండాలి కదా. ఎలా? మనిషికి ఒక ఎలాస్టిక్ స్వభావం ఉంటే ఎంత బావుణ్ణో కదా. చక్కగా ఇక్కడ లావుగా, అక్కడ సన్నగా కనిపించొచ్చు. ఇంతకీ పెళ్లెప్పుడు ప్లాన్ చేశారు? ప్లాన్ చేసుకొని పెళ్లి చేసుకుంటారా? ప్లాన్ చేసి ప్రేమలో పడతారా? మీరు అలా చేశారా? చెప్పండి? -
అదుర్స్-2 కథ ఫైనల్ కాలేదు: వినాయక్
చెన్నై: అదుర్స్ చిత్ర కథ ఇంకా ఫైనల్ కాలేదని ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తెలిపారు. గతంలో జూ.ఎన్టీఆర్ తో రూపొందించిన 'అదుర్స్' చిత్రానికి సీక్వెల్ గా అదుర్స్-2 నిర్మిస్తున్నారనే వార్తలపై వినాయక్ స్పందించారు. 'కథా చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా చర్చలు కొనసాగుతునే ఉన్నాయి. త్వరలో కథ చర్చలు పూర్తవుతాయి' అని వినాయక్ అన్నారు. అంతేకాకుండా అదుర్స్2 ఎప్పుడు ప్రారంభమవుతుందని ఇప్పడే చెప్పలేమని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం అల్లుడు శీను విజయంతో దర్శకుడు వీవీవినాయక్ ఊపు మీద ఉన్న సంగతి తెలిసిందే. -
నాకలా కనిపించాలంటే భయం!
‘‘ఇలాంటివి నీకు నప్పవు అని ఎవరైనా అన్నారనుకోండీ... అలాంటి వాటి జోలికే వెళ్తా. ఇప్పుడే కాదు... చిన్నప్పట్నుంచీ నా మెంటాలిటీ అంతే’’ అంటున్నారు సమంత. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఆమె నటించిన ‘అల్లుడు శీను’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తనకు మంచి మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చిందని సమంత ఆనందం వెలిబుచ్చుతూ మీడియాతో ముచ్చటించారు. ‘అల్లుడు శీను’లో కాస్త స్పైసీగా కనిపించినట్లున్నారు? ఏమాయ చేశావె, ఈగ, మనం లాంటి పాత్రలు చేస్తే... సమంత ఇవి తప్ప మరొకటి చేయలేదు అని రాస్తారు. కాస్త భిన్నంగా స్పైసీగా కనిపిస్తే... సమంత మరీ ఇలా చేసేస్తుందా అని రాస్తారు. నిజానికి నాకు గ్లామర్‌గా కనిపించడం అంటే భయం. అందరూ ధైర్యం చెప్పి ఈ పాత్ర చేయించారు. తమన్నా, కాజల్, శ్రుతీహాసన్‌ల పోటీ తట్టుకోవడానికే ఇలా గ్లామర్ డోస్ పెంచారా? ఒక పోటీ రంగంలో ఉన్నప్పుడు తోటి తారల్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు మొదట్నుంచీ నీట్ ఇమేజ్ ఉంది. ‘నీకు అలాంటి పాత్రలే సరిపోతాయి, గ్లామర్ పాత్రలు నీకు నప్పవు’ అని ఎవరైనా అన్నారనుకోండీ... నేను వాటి వైపే వెళ్తా. చేసి నా సత్తా నిరూపిస్తా. అవునూ... ఈ సినిమాకు పారితోషికం భారీగా ముట్టిందట కదా? ఈ సినిమాకు పారితోషికంగా ఇల్లు రాసిచ్చారనీ, రెండు కోట్లు తీసుకున్నానని ఇలా చాలా రూమర్లు వచ్చాయి. నిజానికి కేవలం నిర్మాత బెల్లంకొండ సురేశ్‌గారి మీదున్న అభిమానంతో ఈ సినిమా చేశాను. భారీ పారితోషికం తీసుకున్న మాట అవాస్తవం. అయినా... ఇన్ని విజయాల తర్వాత కూడా నా పారితోషికం పెరగలేదు. దానికి కారణం ఏంటి? అనేది నాకు ఇప్పటికీ తెలీని విషయం. హీరోలకు పారితోషికాల కింద నిర్మాతలు ఏరియాలను రాసిచ్చేస్తుంటారు. కానీ... మా హీరోయిన్లకు ఎందుకు రాసివ్వరు? అందుకే మాక్కూడా ఓ ఏరియా రాసిస్తే బావుటుంది. ఏ ఏరియా తీసుకుంటే కరెక్టో మీరే చెప్పండి (సరదాగా) మీ ‘రభస’, ‘సికిందర్’ సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్నాయి. మీ అంచనా ఏంటి? ‘రభస’ విజయంలో నాకు టెన్షన్ లేదు. ‘సికిందర్’ విషయంలోనే టెన్షన్ అంతా. తమిళంలో నేను చేస్తున్న తొలి భారీ చిత్రమది. ఇప్పటిదాకా తమిళంలో నాకు సరైన విజయం లేదు. ఈ సినిమాతో అక్కడ కూడా నా ఫేట్ మారుతుందని ఆశిస్తున్నా. బాలీవుడ్లో స్త్రీ ప్రాధాన్యత చిత్రాలు వస్తున్నాయి. అలాంటి పాత్రలు మీరెందుకు చేయరు? ఉన్న వాటిల్లో మంచి పాత్రలే చేస్తున్నాను. ఇప్పుడున్న హీరోయిన్లలో మెచ్చదగ్గ పాత్రలు దక్కింది నాకే. ముఖ్యమైన విషయం ఏంటంటే... ఇక నుంచి ప్రాధాన్యత, విలువలు, అభినయానికి ఆస్కారమున్న పాత్రలే చేయాలనుకుంటున్నాను. అందుకే.. చాలా సినిమాల్ని వదులుకున్నాను కూడా. ఇక నుంచి పాత్రల విషయంలో జాగ్రత్తగా వెళ్తాను. -
అల్లుడు శీను యూనిట్‌తో చిట్‌చాట్
-
ఇంత ఆనందాన్ని ఎప్పుడూ చవిచూడలేదు
‘‘ఇప్పటికి రెండు థియేటర్లలో ఈ చిత్రం చూశాను. ప్రేక్షకులు ఆదరిస్తున్న తీరు చూసి ఆశ్చర్యపోయాను. డాన్సులూ, ఫైట్లూ బాగా చేశావని అందరూ అంటుంటే చాలా సంతోషంగా ఉంది’’ అని బెల్లంకొండ సురేశ్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘అల్లుడు శీను’ చిత్రం ద్వారా శ్రీనివాస్ కథానాయకునిగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నందుకు ఆనందంగా ఉందంటున్న శ్రీనివాస్‌తో జరిపిన ఇంటర్వ్యూ... హీరో కావాలని ఎప్పుడు అనుకున్నారు? ఏడేళ్ల క్రితం ఆ ఆలోచన వచ్చింది. నాన్నగారి ప్రోత్సాహంతో యూఎస్, వియత్నాం, ముంబయ్‌లలో యాక్టింగ్, జిమ్నాస్టిక్స్, ఫైట్స్, డాన్స్‌లో శిక్షణ తీసుకున్నాను. దాదాపు ఐదేళ్లుగా వీటిపైనే దృష్టి. భారీ బడ్జెట్‌తో మీ నాన్న ఈ సినిమా తీశారు.. మరి టెన్షన్ పడ్డారా? ప్రేక్షకులు మనల్ని అంగీకరిస్తారో లేదో అని టెన్షన్ పడేవాణ్ణి. నా మైండ్‌లో వందల కొద్దీ ప్రశ్నలుండేవి. బయటివాళ్లకి నాన్నగారు సీరియస్ టైప్ అనిపిస్తారేమో కానీ, మాకు తెలిసిన నాన్నగారు వేరు. కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. నేను టెన్షన్ పడుతుంటే... ‘దేని గురించీ ఆలోచించొద్దు. నటన మీద దృష్టి సారించు. మిగతావన్నీ నేను చూసుకుంటా’ అని భరోసా ఇచ్చారు. మా నాన్నగారంటే నాకు ప్రాణం. ఫస్ట్ కాపీ చూసినప్పుడు, నన్ను గట్టిగా హత్తుకున్నారు. ఆయన ఎంత ఆనందపడ్డారో ఆ స్పర్శ తెలియజేసింది. వైభవంగా మీ లాంచింగ్ జరిగినా... నిలదొక్కుకోవటం మాత్రం మీ చేతుల్లోనే ఉంది కదా? అవునండి. బ్యాక్‌గ్రౌండ్ అనేది కొంతవరకే ఉపయోగపడుతుంది. ప్రతిభ లేకపోతే పక్కన పెట్టేస్తారు. నటుడిగా నేను నిరూపించుకోకపోతే మాత్రం నిలదొక్కుకోవడం కష్టం. అందుకే మొదటి సినిమాకే చాలా కష్టపడ్డాను. సినిమా చూసినవాళ్లందరూ ‘నీకిది మొదటి సినిమా అనిపించలేదు. బాగా చేశావ్’ అంటుంటే పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందనిపించింది. నా తదుపరి సినిమాలకు ఇంకా కష్టపడతాను. మొదటి సినిమా వినాయక్ దర్శకత్వంలో చేయడం లక్కీ అనిపించిందా? కచ్చితంగా. వినయ్ అంకుల్ ఎప్పట్నుంచో మాకు తెలుసు. మా కుటుంబంలో ఓ వ్యక్తిలాంటివారు. పిల్లలు, పెద్దలు అందరికీ నేను దగ్గరయ్యేలా చేశారు. ఈ చిత్రాన్ని నేను పబ్లిక్ థియేటర్లో చూశాను. నేను బంగీ జంప్ చేసే సీన్ వచ్చినప్పుడు ఓ చిన్నకుర్రాడు ‘మమ్మీ ఆ అన్నయ్య పేరేంటి’ అనడిగాడు. అప్పటివరకు సెలైంట్‌గా ఉన్న ఆ బుడతడు అలా అడగ్గానే, నాకు భలే అనిపించింది. కామెడీ ట్రాక్స్ పెద్దవాళ్లు, డాన్స్, ఫైట్స్ యంగ్‌స్టర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ‘కుర్రాడు బాగున్నాడు. నటనపరంగా కూడా భేష్’ అంటున్నారు. టోటల్‌గా అందరికీ దగ్గరయ్యాను. వసూళ్లు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఐదేళ్లు డాన్సులు, ఫైట్స్, యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నానని చెప్పారు.. అన్నేళ్లు అవసరమా? ఆర్ట్‌కి ఎల్లలు ఉండవండి. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది బోల్డంత ఉంటుంది. నేను అన్నేళ్లు నేర్చుకున్నాను కాబట్టే, ఇప్పటికిప్పుడు ఓ ఎమోషనల్ సీన్ చెప్పి, యాక్డ్ చేయమంటే గ్లిజరిన్ పెట్టుకోకుండా ఏడ్చేస్తాను. నవ్వే సీన్ చెబితే నవ్వేస్తాను. పరిశ్రమ నుంచి వచ్చిన ప్రశంసల గురించి? చాలామంది నాన్నగారికి చెప్పారు. నాకు పర్సనల్‌గా అఖిల్ చెప్పాడు. మేమిద్దరం ఫ్రెండ్స్. ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది? నా ఫేస్ మాస్ కేరక్టర్స్‌కి బాగా సూటవుతుంది కాబట్టి, అలాంటివి చేస్తాను. వ్యక్తిగతంగా హీరోయిజమ్ ఉన్న చిత్రాలను ఇష్టపడతాను. నేను చేసేవి కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. తదుపరి చిత్రాలు? సినిమా ఎంపిక విషయంలో మీదే తుది నిర్ణయమా? నా జీవితంలో ఇప్పటివరకూ ఇంత ఆనందాన్ని చవిచూడలేదు. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. రెండో సినిమా గురించి ఆలోచించలేదు. సినిమాల ఎంపిక గురించి చెప్పాలంటే.. కథలు మా నాన్నగారే వింటారు. ఇంకా జడ్జ్ చేసే స్థాయి నాకు రాలేదు. -
డింపుల్‌గా కనిపిస్తా..!
బ్రహ్మానందం ‘‘ఇంతకు ముందు వచ్చిన వి.వి. వినాయక్ సినిమాల్లోని నా పాత్రలన్నీ బాగా ఆదరణ పొందాయి. ‘అల్లుడు శీను’లో నాతో డింపుల్ అనే పాత్ర చేయించారు. కామెడీ ఇలా కూడా చేయొచ్చా అనేలా ఈ పాత్రను తీర్చిదిద్దారు’’ అని సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, సమంత జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ నిర్మించిన ‘అల్లుడు శీను’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం గురువారం హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘బెల్లంకొండ శ్రీనివాస్ కొత్తవాడైనా చాలా బాగా నటించాడు. తను చేసిన ఫైట్లు, డాన్సులు చూసి ఆశ్చర్యపోయాను. కచ్చితంగా యూత్స్టార్స్లో ఒకడిగా ఎదుగుతాడు’’ అని చెప్పారు. -
పెద్ద నిర్మాత కొడుకుగా కాదు...తన ప్రతిభతో సాయి నిలబడతాడు
‘‘నాకు బాగా నచ్చితేనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాను. లేకపోతే వీలైనంత దూరంగా ఉంటాను. ఈ సినిమా బాగా నచ్చడంవల్ల నా అంతట నేనుగా బెల్లంకొండ సురేశ్‌కి ఫోన్ చేసి, ప్రెస్‌మీట్ పెట్టమన్నాను’’ అని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో తన కుమారుడు సాయి శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ బెల్లంకొండ సురేశ్ సమర్పిస్తున్న చిత్రం ‘అల్లుడు శీను’. బెల్లంకొండ గణేశ్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీనివాస్‌కి మామగా నటించిన ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ - ‘‘వినాయక్‌తో ‘దిల్’ సినిమా నుంచి నా ప్రయాణం సాగుతోంది. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ చిత్రకథను తను చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇలాంటి కథతో సినిమా తీయాలంటే ఏ దర్శకునికైనా దిల్లుండాలి. అసలీ సినిమాని అతను ఎలా తీస్తాడా? అనుకుంటూ వచ్చాను. తీస్తున్న సమయంలో కూడా సినిమా ఇలా ఉంటుంది అని ఊహకందలేదు. కానీ, డబ్బింగ్ చెబుతున్నప్పుడు వినాయక్ చేసిన మేజిక్ అర్థమైంది. ఇందులో నాతో రెండు విభిన్న పాత్రలు చేయించాడు. దక్షిణ, ఉత్తరాది భాషల్లో కలిపి 300 చిత్రాలు చేసిన నాకు ఈ సినిమా ఓ అద్భుతంలా అనిపించింది. ఓ కొత్త కథతో కమర్షియల్ ఫార్మట్‌లో సాగే చిత్రం ఇది’’ అన్నారు. చిత్రకథానాయకుడు సాయి శ్రీనివాస్ గురించి చెబుతూ - ‘‘మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లు హీరోలుగా నటించిన తొలి చిత్రాల్లో నేనే యాక్ట్ చేశాను. తొలి సినిమాకే అద్భుతంగా మౌల్డ్ అయిన తక్కువమంది హీరోల్లో సాయి ఒకడు. డాన్స్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్.. ఇలా అన్నీ బాగా చేశాడు. ఓ పెద్ద నిర్మాత కొడుకు అని కాకుండా తన ప్రతిభతో సాయి నిలబడతాడు’’ అని చెప్పారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలో మామ పాత్రను ప్రకాశ్‌రాజ్ చేస్తేనే బాగుంటుందని ఆయనకోసం మూడు నెలలు వెయిట్ చేశాం. ప్రకాశ్‌రాజ్ వంటి నటుడి కళ్లల్లోకి చూస్తూ కొత్త నటులు నటించడం అంత సులువు కాదు. కానీ, సాయి ఎలాంటి బెరుకు లేకుండా చాలా కంఫర్టబుల్‌గా యాక్ట్ చేశాడు. ఓ పది సినిమాలు చేసిన అనుభవం ఉన్న హీరోలా చేశాడు. అద్భుతమైన కామెడీ, తండ్రీ, కూతురి సెంటిమెంట్, మంచి యాక్షన్.. ఇలా అన్ని అంశాలతో పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో సాగే చిత్రం ఇది. నాకు, సాయికి ‘ఆది’ స్థాయి సినిమా కావాలనే ఆశ ఉంది’’ అన్నారు. -
అల్లుడు శీను మూవీ పోస్టర్స్
-
సుమోలు పేల్చకపోతే నిరుత్సాహపడతామన్నారు.. అందుకే..!
హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించడంలో వీవీ వినాయక్‌ది ఓ ప్రత్యేకమైన శైలి. ఆయన సినిమాల్లోని హీరోలు ఆఫ్రికన్ సింహాల్లా ఉంటారు. అందుకే... ప్రముఖ కథానాయకులు సైతం వినాయక్ దర్శకత్వంలో నటించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. ఈ సారి అదృష్టం కొత్త హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌కి దక్కింది. తనను తెరకు పరిచయం చేస్తూ... వినాయక్ తెరకెక్కించిన ‘అల్లుడు శీను’ ఈ నెల 25న విడుదల కానుంది. నేడు వినాయక్ పుట్టిన రోజు. విడుదల కానున్న ఈ సినిమా గురించి, చేయనున్న ఇతర చిత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పారు వినాయక్. ఆ విశేషాల్లోకి... సాయిశ్రీనివాస్ నాకు తాను చిన్నపిల్లాడిగా ఉన్నప్పట్నుంచీ తెలుసు. బొద్దుగా, ముద్దుగా ఉండేవాడు. అప్పుడే ‘శ్రీనివాస్‌ని హీరో చేద్దామండీ’ అని బెల్లంకొండ సురేశ్‌తో అంటుండేవాణ్ణి. తథాస్తు దేవతలు తథాస్తు అన్నట్లున్నారు. కొన్ని మంచి సినిమాలు వాటంతట అవే తయారవుతాయి అంటుంటారు. ఈ సినిమాకు అదే జరిగింది. జపాన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య ఈ షూటింగ్ చేయడం కష్టం అనిపించినా, చేసేశాం. అబూదాబీలో ప్రపంచ ప్రఖ్యాత రిసార్ట్ ఆల్ఖజ్రాలో షూటింగ్ జరుపుదాం అనుకున్నాం. కానీ ముందు కుదర్లేదు. తర్వాత అది కూడా అమరింది. షూటింగ్ మొదలుపెట్టే ముందు సమంత, తమన్నా లాంటి ఇద్దరు హీరోయిన్లతో పాటలు ఉంటే బావుంటుందని సురేశ్‌గారు అన్నారు. అనుకున్నట్లే సమంతతో పాటు తమన్నా కూడా వచ్చి చేరింది. ప్రకాశ్‌రాజ్ లాంటి సీనియర్ ఆర్టిస్టుల ముందు కూడా అలవోకగా నటించేశాడు శ్రీనివాస్. సమంత, తమన్నాలతో డాన్స్ చేయడానికి జంకుతాడేమో అనుకున్నాను. కానీ... అదరహో అనిపించాడు. తనకు కష్టపడే తత్వం ఉంది. తప్పకుండా పెద్ద హీరో అవుతాడు. సుమోలను పైకి లేపడం, బాంబ్ బ్లాస్టింగ్లు లేకుండా నా శైలికి భిన్నంగా ఈ సినిమా చేయాలనుకున్నా. కానీ... యూనిట్ మొత్తం విదేశాలకు వెళ్తుంటే... ఎయిర్‌పోర్ట్‌లో ఓ ఉన్నత అధికారి నన్ను చూసి ‘సార్.. వినాయక్గారూ.. ఈ సినిమాలో కూడా సుమోలను పేలుస్తున్నారా? బాగా పేల్చాలి. లేకపోతే మేం డిజప్పాయింట్ అవుతాం’ అన్నారు. నేను షాక్. ఒకవేళ ఇవేమీ లేకపోతే జనాలు కూడా డిజప్పాయింట్ అవుతారేమో అనిపించింది. అందుకే... ఇందులో కూడా యాక్షన్ ఉంటుంది. సాయి శ్రీనివాస్ కొత్త హీరో. అతనితో భారీగా డైలాగులు చెప్పిస్తే ‘అవసరమా’ అంటారు. అందుకే, తన పాత్ర చిత్రణను జనాలకు చేరువయ్యేలా తీర్చిదిద్దాం. తక్కువ సంభాషణలతో హీరోయిజం ఎలివేటయ్యేలా తన పాత్ర ఉంటుంది. మామకు జరిగిన అన్యాయానికి అల్లుడు ఎలా బదులు తీర్చుకున్నాడనేది కథ. ఇందులో మామగా ప్రకాశ్‌రాజ్ నటించారు. బ్రహ్మానందంది గమ్మత్తయిన పాత్ర. ఆయన్ను బురిడీ కొట్టించాలనే ఉద్దేశంతోనే ‘నా పేరు అల్లుడు శీను’ అని చెబుతాడు హీరో. పేరు బావుందనిపించి టైటిల్‌గా ఫిక్స్ చేశాం. చిరంజీవిగారి 150వ సినిమాకు దర్శకత్వం వహించాలని ఉంది. కానీ, అది చిరంజీవిగారి నిర్ణయంపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం కథలు సిద్ధం చేసుకుంటున్నాం. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథతో సినిమా ఉంటుందనే వార్తలో నిజం లేదు. ఒకవేళ చిరంజీవిగారిని డెరైక్ట్ చేసే అవకాశం నాకే లభిస్తే... సరదాగా సాగిపోయే సినిమానే తీస్తా. మధ్యలో ఓ ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉండాలి. అలాంటి కథ తీస్తే బావుంటుంది ‘ఠాగూర్’ నాటి చిరంజీవి ఇమేజ్‌కి ఇప్పటి ఇమేజ్‌కి చాలా తేడా ఉందని పలువురి భావన. అందులో నిజం లేదు. ఏ సినిమాకైనా మొదటి పది నిమిషాలే కీలకం. ఆ సమయంలోనే ప్రేక్షకుడు ఇమేజ్‌ల గురించి ఆలోచిస్తాడు. ఈలోపే అతణ్ణి కథలోకి లీనం చేయగలగాలి. అలా చేస్తే సినిమా హిట్. -
శీను స్టెప్పులు కేక..!
అన్నం ఉడికిందో, లేదో ఒక్క మెతుకు చెప్పేస్తుంది. అలాగే.. హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఏంటో.. సినిమా కంటే ముందే ప్రచార చిత్రాలు చెప్పేస్తున్నాయి. ముఖ్యంగా నృత్యాల్లో శ్రీనివాస్ కనబరుస్తున్న ఈజ్‌కి ప్రశంసల వర్షమే కురుస్తోందంటే అతిశయోక్తి కాదు. ఓ స్టార్‌తో సినిమా చేస్తే తానెలా ఖర్చుపెడతారో అంతకంటే భారీగా, కోటి ఆశలతో కోట్లు ఖర్చుపెట్టి బెల్లంకొండ సురేశ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎలాగైనా తన తనయుడ్ని తెలుగు చిత్రసీమలోని స్టార్లలో ఒకడిగా నిలబెట్టడమే ప్రస్తుతం ఆయన ధ్యేయం. ఈ సినిమాకు దర్శకునిగా వి.వి.వినాయక్‌ని ఎంచుకోవడంలో కారణం కూడా అదే. తనను దర్శకునిగా నిలబెట్టిన బెల్లకొండ సురేశ్ రుణాన్ని తీర్చుకోవడానికి వినాయక్‌కి దక్కిన గొప్ప అవకాశం ‘అల్లుడు శీను’. అందుకే... ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారాయన. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ నెల 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు బెల్లంకొండ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘దేవిశ్రీప్రసాద్ స్వరాలు ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు చేశాయి. ఇంత మంచి ఆడియో ఇచ్చిన దేవిశ్రీకి, నా కుమారుడు శ్రీనివాస్‌ని అద్భుతంగా ప్రజెంట్ చేయబోతున్న వినాయక్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా’’ అన్నారు. విడుదల రోజు నుంచే అమ్మకాల పరంగా పాటలు సంచలనం సృష్టిస్తున్నాయని ఆదిత్య ప్రతినిధులు చెప్పారు. ఈ చిత్రానికి రచన: కోన వెంకట్, బాబీ, కెమెరా: చోట కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, నిర్మాత: బెల్లంకొండ గణేశ్‌బాబు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్. -
అల్లుడు శీను మూవీ న్యూ స్టిల్స్
-
అల్లుడు శీనుతో ప్రేమ కథ తెరకెక్కించాలని..
-
అల్లుడు శీను మూవీ వర్కింగి స్టిల్స్
-
అల్లుడు శీను మూవీ ఆడియో వేడుక
-
భవిష్యత్ అగ్రహీరోల్లో శ్రీనివాస్ ఒకడవుతాడు : వెంకటేశ్
‘‘మా నాన్న నన్ను పరిచయం చేసినప్పుడు నాకెలా అనిపించిందో.. ఈ రోజు బెల్లంకొండ శ్రీనివాస్‌కి అలాగే అనిపించి ఉంటుంది. తను భవిష్యత్తులో కచ్చితంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అగ్ర హీరోల్లో ఒకడవుతాడు. వి.వి.వినాయక్ ఈ సినిమా చేయడం అభినందనీయం’’ అని వెంకటేశ్ అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. వి.వి.వినాయక్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘అల్లుడు శీను’. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. వెంకటేశ్ పాటలను, ఎస్.ఎస్. రాజమౌళి, బ్రహ్మానందం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. వినాయక్ మాట్లాడుతూ- ‘‘నా తొలి సినిమా ‘ఆది’ విడుదలైనపుడు మా నాన్న ఎంత ఆనందపడ్డారో.. రేపు ఈ సినిమా రిలీజైన తర్వాత బెల్లంకొండ సురేశ్ అంత ఆనందపడతారు. శ్రీనివాస్ గొప్పగా నటించాడు. ఎంతో స్టార్డమ్ ఉన్నప్పుటికీ కథానాయిక నటించిన సమంతకు, అడగ్గానే ప్రత్యేక గీతంలో నర్తించిన తమన్నాకు కృతజ్ఞతలు’’ అన్నారు. అడగ్గానే సినిమా చేసిపెట్టిన వినాయక్‌కి తాము రుణపడిపోయామని బెల్లంకొండ సురేశ్ అన్నారు. ‘‘సొంత కొడుకుని హీరోగా పరిచయం చేస్తే ఎంత జాగ్రత్త తీసుకుంటారో, అంత జాగ్రత్తను ఈ సినిమాకు వినాయక్ తీసుకున్నారని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పారు. దిల్‌రాజు, దశరథ్, మెహర్మ్రేశ్, జెమినీ కిరణ్ తదితరలు పాల్గొన్నారు. -
‘అల్లుడు శీను’ స్టిల్స్
-
అల్లుడు శీను...
దర్శకుడు వీవీ వినాయక్ యాక్షన్ ఎంటర్టైనర్లు తీయడంలో సిద్ధహస్తుడు. ఆయన యాక్షన్ ఎంత బాగా తీస్తారో, కామెడీ అంతకన్నా బాగా పండిస్తారు. తాజాగా ఆయన చేస్తున్న సినిమా కూడా అలాంటిదే. నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో సమంత కథానాయిక. చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రానికి ‘అల్లుడు శీను’ అని టైటిల్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో వినాయక్ ఈ పేరుని ఖరారు చేసినట్లు తెలిసింది. కథానుగుణంగా రకరకాల ట్విస్టులతో కథ సాగుతుందని సమాచారం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... ఇప్పటివరకూ గ్లామర్‌ని ఓ మోస్తరుగానే పలికించిన సమంత... ఈ సినిమా కోసం కాస్త హాట్‌గా దర్శనమివ్వనున్నట్లు ఫిలింనగర్ టాక్. ఆమె గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. మే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారట