'స్పీడున్నోడు'గా అల్లుడు శీను | bellamkonda srinivas next movie title speedunnodu | Sakshi
Sakshi News home page

'స్పీడున్నోడు'గా అల్లుడు శీను

Dec 13 2015 12:30 PM | Updated on Aug 3 2019 12:45 PM

'స్పీడున్నోడు'గా అల్లుడు శీను - Sakshi

'స్పీడున్నోడు'గా అల్లుడు శీను

భారీ బడ్జెట్తో తెరకెక్కిన తొలి సినిమాతో కమర్షియల్ హిట్ కొట్ట లేకపోయినా.. నటుడిగా మాత్రం మంచి మార్కులే సాధించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా...

భారీ బడ్జెట్తో తెరకెక్కిన తొలి సినిమాతో కమర్షియల్ హిట్ కొట్ట లేకపోయినా.. నటుడిగా మాత్రం మంచి మార్కులే సాధించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శీను సినిమాలో యాక్టింగ్తో పాటు డ్యాన్స్లు, ఫైట్స్ ఇరగదీసి కుర్ర హీరోలకు షాక్ ఇచ్చాడు.

తొలి సినిమా ఫెయిల్యూర్తో ఆలోచనలో పడ్డ అల్లుడు శీను రెండు సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించి ఆగిపోవటంతో ప్రస్తుతం రీమేక్ స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన సుందర పాండియన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన  ఈ సినిమాకు స్పీడున్నోడు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ముందుగా సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించినా, పెద్ద సినిమాల పోటి ఉండటంతో ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement