speedunnodu
-
మనసు పెట్టి చేశాం కాబట్టే... ఈ విజయం - దర్శకుడు భీమనేని
‘‘ ‘సుస్వాగతం’ టైమ్‌లో ప్రకాశ్‌రాజ్ గారిచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ‘స్పీడున్నోడు’కు కలిసి పనిచేశాం. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో ఆయన నటన అద్భుతం. మా చిత్రం అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అందరూ మనసుపెట్టి చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైంది’’ అని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని సునీత నిర్మించిన ‘స్పీడున్నోడు’ చిత్రం సక్సెస్‌మీట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘ప్రతి ఒక్కరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసిన చిత్రమిది. ‘అల్లుడు శీను’ తరువాత చాలా గ్యాప్ వచ్చినా, ఈ చిత్రం ప్రారంభ వసూళ్లు బాగా వచ్చాయి. ఇందులో చాలా బాగా నటించావని అందరూ అంటుంటే పెద్ద ఎచీవ్మెంట్లా అనిపిస్తోంది. ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన భీమనేనిగారికి కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు డి.జె. వసంత్, ఎడిటర్ గౌతంరాజు, కెమేరామ్యాన్ విజయ్ ఉలగనాథ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిబొట్ల తదితరులు పాల్గొన్నారు. -
బస్‌లో... స్పీడున్న హీరో
కొత్త సినిమా గురూ! చిత్రం- ‘స్పీడున్నోడు’ మూలకథ- ప్రభాకరన్ కెమేరా- విజయ్ ఉలగనాథ్ యాక్షన్- రవివర్మ సంగీతం- డి.జె. వసంత్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత- వివేక్ కూచిభొట్ నిర్మాత- భీమనేని సునీత స్క్రీన్‌ప్లే- దర్శకత్వం- భీమనేని శ్రీనివాస్‌రావు ‘‘తప్పుడు ఫ్రెండ్స్ ఉండవచ్చేమో కానీ, ఫ్రెండ్షిప్ ఎప్పుడూ తప్పు కాదు!’’ ‘స్పీడున్నోడు’లో ఒక డైలాగ్ ఇది. ఈ చిత్రకథ, హీరో పాత్ర స్వభావం బేసిగ్గా ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్నవే. స్నేహం, ప్రేమ, పగ, ద్వేషం, ద్రోహం - దీనికి మూలస్తంభాలు. తమిళ హిట్ ‘సుందర పాండియన్’ (2012)కి ఇది రీమేక్. ఇదే కథ కన్నడంలో ‘రాజా హులి’ (2013) పేరిట రీమేకై, అక్కడా సక్సెసైంది. రీమేక్‌లకు మారుపేరైన భీమనేని శ్రీనివాస్‌రావు ఆ మ్యాజిక్‌ను తెలుగులో క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. తమిళంలో పల్లెటూళ్ళ నేపథ్యంలోని ఈ కథను తెలుగులో రాయలసీమకి మార్చారు. రాప్తాడు, వెంకటాపురం అనే రెండు గ్రామాల మీదుగా పక్కనే ఉన్న పట్నానికి ఓ ఆర్టీసీ బస్సు వెళుతుంటుంది. పట్నం వెళ్ళి చదువుకొనే స్టూడెంట్స్ ప్రేమలకు కారణమైన ‘ప్రేమపావురం’ ఆ బస్సు. రాప్తాడు ప్రెసిడెంట్ వీరభద్రప్ప (ప్రకాశ్‌రాజ్). అతని కొడుకు శోభన్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్). డిగ్రీ అయి, నాలుగేళ్ళయినా జాలీగా ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తుంటాడు. అతనికి ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం. స్నేహితుల ప్రేమ నిలబెట్టడా నికి ఎన్ని ట్రిక్కులైనా వేస్తాడు. ఇక, వెంకటాపురం పెద్దమనిషి (రావు రమేశ్) కూతురు వాసంతి (సోనారిక). ఆమె ప్రేమను పొందడానికి హీరో ఫ్రెండ్ గిరి అలియాస్ రబ్బరు గాడు (మధునందన్), పక్క ఊరి చిట్టి (సత్య) పోటీలు పడుతుంటారు. మరోపక్క హీరోయిన్‌కు బావ వరసయ్యే జగన్ (కబీర్ దుహాన్ సింగ్) ఆమెను పెళ్ళాడాలనుకుం టాడు. తీరా హీరోయినేమో హీరోనే ప్రేమిస్తున్నానంటుంది. సెకండాఫ్‌కొచ్చేసరికి, హీరోయిన్ని ప్రేమించిన చిట్టి మళ్ళీ బస్సులో గొడవపడ్తాడు. అక్కడో ఘటనతో కథలో ట్విస్ట్. తర్వాతి మలుపులన్నీ తెరపై చూడాల్సిన మిగతా కథలోని అంశాలు. పేరున్న నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడైన హీరో శ్రీనివాస్‌కిది రెండో సినిమా. ‘అల్లుడు శీను’లానే ఈసారీ మాస్‌ని ఆకట్టుకొనేందుకు తపించారు. పాటలు, ఫైట్లు - అన్నిటిలో ఆ శ్రమ కనిపించింది. ఇక, ఆ మధ్య ‘జాదూగాడు’లో, ఇప్పుడు ఇందులో మెరిసిన హీరోయిన్ సోనారికది బస్సుకూ, పాటలకూ పరిమితమైన అందం. సినిమా నిండా భారీ తారాగణం ఉంది. హీరో మిత్ర బృందంలో శ్రీనివాసరెడ్డి, ‘షకలక’ శంకర్ - ఇలా చాలామంది కనిపిస్తారు. ఇల్లరికపు అల్లుళ్ళుగా పృథ్వి, పోసాని నవ్విస్తారు. ‘అల్లుడు శీను’లానే ఇందులోనూ తమన్నా ఐటవ్ుసాంగ్ చేశారు. ఇన్ని హంగు లున్న సినిమాగా ‘స్పీడున్నోడు’లో నిర్మాణవిలువలు పుష్కలం. సంగీతం, రీరికార్డింగ్ ల్లోనూ మాస్‌ని దృష్టిలో పెట్టుకొన్నారు. భీమనేని, ప్రవీణ్‌వర్మ రాసిన డైలాగ్స్ పేలాయి. రెండున్నర గంటల పైచిలుకు సినిమాలో - ఫస్టాఫ్ అంతా హీరోల ఫ్రెండ్స్, మందు పార్టీలు, బస్సులో ప్రేమతో అక్కడక్కడే నడుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కథ స్పీడందు కుంటుంది. ఊహించని ట్విస్టులూ వస్తాయి. నిజానికి, హీరోయిన్ పదో తరగతిలో ఉన్న ప్పుడే హీరో ఆమెను ప్రేమించాడనీ, ఆమె కాదనేసరికి అప్పట్లో వదిలేశాడనీ చూపిస్తారు. అలాగే, హీరోయిన్‌పై బావ మోజు కానీ, వాళ్ళిద్దరూ బంధువులని కానీ ఆ బావకి బాగా ఫ్రెండైన హీరోకు చివరి దాకా తెలియదంటారు. అవన్నీ కన్వీయంట్ స్క్రీన్‌ప్లే. తమిళ కథను యథాతథంగా తీసినా, హీరోయిజమ్ కోసం, తెలుగు వారికి అలవాటైన స్టైలిష్ టేకింగ్ కోసం మార్పులు అనివార్యమని దర్శక నిర్మాతలు ఫీలవ డం అర్థం చేసుకోవాలి! ‘కొట్టింది ఫ్రెండ్ అయితే, అరుపు బయటకు వినిపించకూడదు’ అని తమాషాగా ముగు స్తుందీ సినిమా. అక్షరాలా ‘స్పీడున్నోడు’ అరుపులు వినిపించని సెలైంట్ కిల్లర్! - రెంటాల జయదేవ -
'స్పీడున్నోడు' మూవీ రివ్యూ
టైటిల్ : స్పీడున్నోడు జానర్ : రొమాంటిక్ కామెడీ డ్రామా తారాగణం : బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక బడోరియా, ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి సంగీతం : డిజె వసంత్ దర్శకత్వం : భీమినేని శ్రీనివాస్ నిర్మాత : భీమినేని సునీత అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ గా పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్, ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోగలిగాడు గాని సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. అందుకే కమర్షియల్ హిట్ మీద కన్నేసిన యంగ్ హీరో తమిళంలో ఘనవిజయం సాధించిన సుందరపాండ్యన్ సినిమాను స్పీడున్నోడు పేరుతో రీమేక్ చేశాడు. సుడిగాడు సినిమా తరువాత మూడేళ్ల విరామం తీసుకున్న రీమేక్ స్పెషలిస్ట్ డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ రిపీట్ చేయడానికి ప్రయత్నించాడు. గుడ్ విల్ సినిమా బ్యానర్ పై భీమినేని స్వయంగా నిర్మించిన ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కు తొలి కమర్షియల్ హిట్ అందించిందా..? కథ : అనంతపురంలోని రాప్తాడు ప్రాంతంలో ఊరి పెద్ద వీరభద్రప్ప(ప్రకాష్ రాజ్) కొడుకు శోభన్ బాబు(బెల్లంకొండ శ్రీనివాస్). డిగ్రీ పూర్తయి నాలుగేళ్లు అవుతున్నా ఎలాంటి బాధ్యత లేకుండా ఫ్రెండ్స్‌తో కలిసి అల్లరి చిల్లరగా తిరగుతుంటాడు. తన ఫ్రెండ్స్ కోసం ఎలాంటి రిస్క్‌కైనా వెనుకాడని శోభన్, గిరి అనే స్నేహితుడి ప్రేమను గెలిపించడానికి వాసంతి(సోనారికా)ను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో వాసంతి, శోభన్‌ను ఇష్టపడుతోంది. ఈ ఇద్దరి ప్రేమ వాసంతి ఇంట్లో తెలియటంతో వాసంతి తండ్రి రామచంద్రప్ప (రావు రమేష్) వాసంతిని జగన్ (కబీర్ దుహాన్ సింగ్)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. అదే సమయంలో వాసంతి మీద యాసిడ్ దాడి చేయబోయిన వాడ్ని ఆపే ప్రయత్నంలో శోభన్ అతన్ని చంపేస్తాడు. ఇలా అన్నిరకాలుగా శోభన్ ప్రేమకు ఆటంకాలు ఏర్పాడతాయి. ఈ ఇబ్బందులనుంచి శోభన్ ఎలా బయటపడ్డాడు. వాసంతిని ఎలా దక్కించుకున్నాడు అన్నదే మిగతా కథ. నటీనటులు తొలి సినిమాతో పరవాలేదనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్ రెండో సినిమాలో మంచి పరిణతి కనబరిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌తో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. సోనారికా గ్లామర్‌తో పాటు నటనలోనూ మంచి మార్కులే సాధించింది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డిలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయగా, పోసాని కృష్ణమురళి, 30 ఇయర్స్ పృథ్వీ కామెడీ పండించారు. కృష్ణచైతన్య, కబీర్ విలన్స్‌గా ఆకట్టుకున్నారు. రమాప్రభ, శ్యామల, ఝాన్సీ, విద్యుల్లేఖ లాంటి చాలా మంది ఆర్టిస్ట్‌లు ఉన్నా ఎవరికి గుర్తింపు వచ్చే స్థాయి పాత్రలు దక్కలేదు. సాంకేతిక నిపుణులు రీమేక్ సినిమాలు తీయటంలో స్పెషలిస్ట్‌గా పేరున్న భీమినేని మరోసారి తన మార్క్ చూపించాడు. తమిళ కథే అయిన ఏ మాత్రం ఆ ఫ్లేవర్ లేకుండా తెలుగు నేటివిటికీ తగ్గట్టుగా స్పీడున్నోడు సినిమాను తెరకెక్కించాడు. తొలిసారిగా నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్న భీమినేని ఆ రంగంలోనూ సక్సెస్ సాధించాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో స్పీడున్నోడు సినిమాను తెరకెక్కించాడు. డిజె వసంత్ సంగీతం పర్వాలేదు. చాలా సన్నివేశాల్లో నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. విజయ్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతి ఫ్రేము రిచ్ గా రావటం కోసం విజయ్ తీసుకున్న కేర్ స్పష్టంగా కనిపించింది. గౌతంరాజు ఎడిటింగ్ లో ఇంకాస్త జాగ్రత్తగా వర్క్ చేసి ఉంటే బాగుండేది. ప్లస్ పాయింట్స్ మెయిన్ స్టోరి క్లైమాక్స్ ప్రొడక్షన్ వాల్యూస్ తమన్నా స్పెషల్ సాంగ్ మైనస్ పాయింట్స్ స్లో నేరేషన్ ఎడిటింగ్ పాటలు ఓవరాల్ గా స్పీడున్నోడు.. భీమినేని మార్క్ కామెడీ డ్రామా మాత్రమే.. స్టార్ ఇమేజ్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ మరో సినిమా వరకు వెయిట్ చేయక తప్పదు. - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ -
అల్లుడు శీను చూడగానే... అతనే కరెక్ట్ అనుకున్నా!
దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ‘శుభమస్తు’, ‘సుస్వాగతం’, ‘శుభాకాంక్షలు’, ‘సూర్యవంశం’, ‘అన్నవరం’, ‘సుడిగాడు’ చిత్రాలతో రీమేక్‌లకూ, సకుటుంబ కథా చిత్రాలకూ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు - దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు. సూపర్‌హిట్ ‘సుడిగాడు’ తరువాత మూడున్నరేళ్ళ విరామం తీసుకొని, ఆయన డెరైక్ట్ చేసిన సినిమా ‘స్పీడున్నోడు’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని రోషితా సాయి సమర్పణలో గుడ్ విల్ సినిమా పతాకంపై భీమనేని సునీత నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా భీమనేని చెప్పిన ఆ చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే... తమిళంలో విజయవంతమైన ‘సుందరపాండ్యన్’కు రీమేక్‌గా ‘స్పీడున్నోడు’ తెరకెక్కిం చాం. మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో మూడేళ్లు స్క్రిప్ట్‌వర్క్ చేశా. తమిళంలో లాగా సహజంగా చూపిస్తే ఇక్కడ కొంతమందికి కనెక్ట్ అవదని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా వినోదం, భావోద్వేగాలు జోడించాం. తమిళ వెర్షన్లో ఈ చిత్రం చూసినప్పుడు బాగా నచ్చి, వెంటనే రీమేక్ హక్కులు తీసుకున్నా. తెలుగులో ఆ ఆత్మ పోకుండా, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తీశాను. తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమవుతుంది. మొదట ఈ చిత్రంలో హీరోగా చాలామందిని అనుకున్నాం. రవితేజ, సునీల్‌తో పాటు మరికొందరిని కలిశాం. వారికెందుకో ఈ కథ కనెక్ట్ కాలేదు. నేను చూసే పాయింట్లో సినిమాని వారు చూడలేదనుకుంటా. సాయిశ్రీనివాస్ నటించిన ‘అల్లుడు శీను’ చూశా. తన డ్యాన్స్, ఫైట్స్, ఎనర్జీ చూసి తనే సరిగ్గా సరిపోతాడనుకున్నా. ఒకే సినిమా అనుభ వంతో సాయి అద్భుతంగా నటించాడు. హీరోకుండాల్సిన లక్షణాలన్నీ తనకున్నాయి. నా ప్రతి చిత్రం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ‘సుడిగాడు’ చిత్రానికి పాటలు అందించిన డిజె వసంత్ నాతో పాటు మూడేళ్లు ప్రయాణం చేసి, ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. పాటలను ఆదరించినట్లుగా సినిమాను కూడా ప్రేక్షకులు విజయవంతం చేస్తారని భావిస్తున్నా. ఇప్పట్లో ఫ్రెండ్స్ లేనివారు ఎవరూ అంటూ ఉండరు. స్నేహం గురించి ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్ ఇందులో చూపించాం. ఒక అమ్మాయి వల్ల ఐదుగురు స్నేహితుల మధ్య ఎటువంటి మనస్పర్థలు ఎదురయ్యాయి, హీరో రంగప్రవేశం చేసి ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాడన్నదే ఈ చిత్ర కథాంశం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. క్లైమాక్స్ షెడ్యూల్ కర్నూలులో చేశాం. రాయలసీమ నేపథ్యంలో జరిగే కథ ఇది నిర్మాత అవ్వాలనే కోరిక నిజానికి నాకు లేదు. కానీ, ‘ఈ రీమేక్ సినిమా తెలుగు నేటివిటీకి సెట్ అవుతుందా?’ అని కొందరికి అనుమానాలు ఉండటంతో నేనే నిర్మాతగా మారా. సినిమా అవుట్‌పుట్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, ఆ రిస్క్ నేనే తీసుకుందామనుకుని నిర్మించా. ఈ చిత్రంలో ప్రతి పాటనూ హై బడ్జెట్లో చిత్రీకరించాం. తమన్నా చేసిన స్పెషల్ సాంగ్‌కే రెండు కోట్ల రూపాయలు అయింది. ఐటమ్ సాంగ్స్‌లో ఒక విలక్షణమైన పాటగా ఇది మిగిలిపోతుంది. తమన్నా ఈ పాట చూసి చాలా హ్యాపీగా ఫీలయింది. మహిళలు కూడా ఈ సాంగ్ ఇష్టపడేలా ఉంటుంది. మేము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. మూడు నెలల ముందే బిజినెస్ జరిగిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ నాకు మంచి స్నేహితులు. ప్రాఫిట్స్ వస్తే షేర్ చేసుకుందామనుకుంటున్నాం. నేను చేసిన చిత్రాల్లో నాకు బాగా నచ్చినవి - ‘సుస్వాగతం’, ‘శుభాకాంక్షలు’. ఆ చిత్రాల్లోని క్లయిమాక్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పటికీ నన్ను ‘సుస్వాగతం’ డెరైక్టర్గానే గుర్తు పడుతున్నారు ఎవరైనా ఓ నటుడు ఒక పాత్రలో సక్సెస్ అయితే అతనికి అటువంటి క్యారెక్టర్సే వస్తాయి. నేను కూడా ఇండస్ట్రీకి రీమేక్ సినిమాతో ఎంట్రీ కావడం, ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో రీమేక్‌లు బాగా తీస్తాడని నాపై ముద్ర పడిపోయింది. రీమేక్‌లకు అలవాటుపడిపోయానేమోననే భావన నాకు కూడా ఉంది. అందుకే, స్ట్రెయిట్ చిత్రం తీయాలనుంది, మంచి కథ దొరికితే కచ్చితంగా చేస్తా. ‘సుడిగాడు’ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఇప్పటికైతే లేదు. ‘స్పీడున్నోడు’ తరువాత ప్రాజెక్ట్స్ ఏమిటని అనుకోలేదు. ఒక చిత్రం చేస్తున్నప్పుడు మరో దాని గురించి ఆలోచించను. చేస్తున్న సినిమా పూర్తయి రిలీజ్ అయిన తరువాతే మరో దాని గురించి ఆలోచిస్తా. -
ఈ సారి ఐటమ్ సాంగ్ కాదు హీరోయినే..!
ఇండస్ట్రీలో మరే హీరోకి సాధ్యం కాని రేంజ్లో భారీగా వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమా అల్లుడు శీనుతో సక్సెస్ సాధించలేకపోయినా, స్టార్ హీరోల స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగలిగాడు ఈ యంగ్ హీరో. అదే జోరులో ఇప్పుడు తన రెండో సినిమా స్పీడున్నోడును రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. రీమేక్ స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనారిక హీరోయిన్గా నటిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రెండు సినిమాల్లో కథా కథనాలు, సాంకేతిక నిపుణుల సంగతి ఎలా ఉన్నా ఈ రెండు సినిమాలకు ఓ కామన్ పాయింట్ ఉంది. అదే ఐటమ్ సాంగ్. ఈ రెండు సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్ తమన్నా ఐటమ్ సాంగ్ చేయటం విశేషం. అయితే తన మూడో సినిమాలోనూ మరోసారి తమన్నాతో కలిసి చిందేయడానికి రెడీ అవుతున్నాడు శ్రీనివాస్. ఈ సారి మాత్రం ఐటమ్ నంబర్లో కాదట. తన మూడో సినిమాలో తమన్నాను హీరోయిన్గా ఫైనల్ చేసినట్టుగా ప్రకటించాడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నా విషయం మాత్రం ప్రకటించలేదు. ఇప్పటికే బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయిన శ్రీనివాస్, ఆ సినిమాకే తమన్నాను ఎంపిక చేశారా లేక, మరో దర్శకుడితో సినిమా చేయబోతున్నాడా అన్న విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. -
‘స్పీడున్నోడు’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
-
యాక్షన్ సీన్స్ చూశా.. బాగా చేశాడు!
- నాగార్జున ‘‘సాయి శ్రీనివాస్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. కొన్ని యాక్షన్ సీన్స్ చూశా... బాగా చేశాడు. ప్రకాష్‌రాజ్ మామూలుగా ఎవర్నీ పొగడడు. కానీ తనను ఈ మధ్య కలిసినప్పుడు శ్రీనివాస్‌ను పొగడటం చూశాను. బెల్లంకొండ సురేశ్ డైనమిక్ నిర్మాత. నాగ చైతన్యతో ‘తడాఖా’ చిత్రం చేశాడు. సురేశ్ వంటి గొప్ప తండ్రి శ్రీనుకు ఉన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనారిక జంటగా గుడ్‌విల్ సినిమా పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో భీమనేని సునీత నిర్మించిన ‘స్పీడున్నోడు’ చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. హీరోలు నాగార్జున, వెంకటేశ్ చిత్ర బృందానికి ప్లాటినం డిస్క్‌లు అందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘కొంతమందికి మాత్రమే ఇలాంటి టైటిల్స్ కుదురుతాయి. శ్రీనివాస్ తన డ్యాన్సు, ఫైట్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ‘స్పీడున్నోడు’ టైటిల్ తనకు పర్ఫెక్ట్గా సరిపోయింది. శ్రీను నుంచి భీమనేని మంచి అవుట్ పుట్ తీసుకుని ఉంటాడు ’’ అని పేర్కొన్నారు. ‘‘నాకు ‘సుస్వాగతం’ చిత్రం నుంచి భీమనేనిగారితో రిలేషన్ ఉంది. ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడాయన. వారి హృదయాలను తాకే సినిమాలు తీస్తాడు’’ అని ప్రకాష్‌రాజ్ తెలిపారు. భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ - ‘‘ఈ రోజుల్లో సినిమా తీయడం, రిలీజ్ చేయడం చాలా కష్టంతో కూడకున్న పని. ఒక రీమేక్ స్క్రిప్ట్‌ను నమ్ముకుని మూడేళ్లుగా పనిచేశాం. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. నా గత చిత్రాలతో పోలిస్తే కథ, టెక్నాలజీ పరంగా ట్రెండీగా ఉండే చిత్రమిది. సాయి శ్రీనివాస్ భవిష్యత్తులో బిగ్గెస్ట్ స్టార్ హీరో అవుతాడు’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రానికి మంచి పాటలు అందించిన డీజే వసంత్ టాప్ టెక్నీషియన్‌గా ఎదుగుతాడు. వివేక్ కూచిబొట్లగారు మాకు ఎంతో అండగా నిలబడ్డారు. సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉలగనాథ్ మంచి అవుట్‌పుట్ ఇచ్చారు’’ అని సాయి శ్రీనివాస్ చెప్పారు. ఈ వేడుకలో నటులు బ్రహ్మానందం, అలీ, రావు రమేశ్, నిర్మాత పోకూరి బాబూరావు, ఎడిటర్ గౌతంరాజు తదితరులతో పాటు చిత్ర బృందం పాల్గొన్నారు. -
మరో రెండు వారాలు.. అదే జోరు..
ఇటీవల కాలంలో ఒకే రోజు రెండు మూడు సినిమాలు విడుదల కావడం మామూలైపోయింది. సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద సినిమాలు పోటీ పడటం, దాదాపు అన్నీ మంచి కలెక్షన్లు సాధించటంతో, చాలామంది దర్శక నిర్మాతలు పోటీకే రెడీ అవుతున్నారు. ఎక్కువసార్లు వాయిదా వేయటం కన్నా బరిలో దిగి తేల్చుకోవటమే కరెక్ట్ అని భావిస్తున్నారు. అదే బాటలో మరో రెండువారాల పాటు తెలుగు వెండితెర మీద చిన్న సినిమాల జాతర కనిపించనుంది. ఈ వారం రెండు స్ట్రయిట్ సినిమాలతో పాటు మరో రెండు అనువాద చిత్రాలు వెండితెర మీద సందడి చేశాయి. అయితే ఈ సినిమాల రిజల్ట్ ఏంటో ఇంకా తేలకముందే వచ్చేవారం మరో మూడు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన రెండో సినిమా స్పీడున్నోడుతో పాటు, చాలారోజులుగా వాయిదా పడుతూ వస్తున్న వంశీ వెన్నెల్లో హాయ్ హాయ్, తమిళ్లో ఘనవిజయం సాధించిన కథాకళి చిత్రాలు ఫిబ్రవరి 5న రిలీజ్ అవుతున్నాయి. ఫిబ్రవరి 12న కూడా ఇదే స్థాయిలో పోటీ పడుతున్నారు చిన్న చిత్రాల నిర్మాతలు. భలే భలే మగాడివోయ్‌తో భారీ హిట్ కొట్టిన నాని కృష్ణగాడి వీర ప్రేమగాథతో రెడీ అవుతుంటే. సాయికుమార్ తనయుడు తొలిసారిగా సొంత నిర్మాణసంస్థలో తెరకెక్కిన గరం సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు. ఈ ఇద్దరితో తలపడటానికి మంచు వారబ్బాయి కూడా రెడీ అవుతున్నాడు. డిఫరెంట్ లుక్‌తో మనోజ్ హీరోగా తెరకెక్కిన శౌర్య సినిమా కూడా అదే రోజు రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇలా మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ కావటం చిన్న సినిమాలకు అంత మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, అదే స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి గట్టెక్కెస్తాయి. కానీ చిన్న సినిమాల విషయంలో అలాంటి పరిస్థితి ఉండదు. సినిమాలో కంటెంట్ ఉండటంతో పాటు సరైన సమయంలో రిలీజ్ అయితే తప్ప కలెక్షన్లు సాధించే అవకాశం ఉండదు. మరి ఇలా ఒకేసారి బరిలో దిగుతున్న చిన్న సినిమాలు ఎంత వరకు ఆకట్టుకుంటాయో చూడాలి. -
మరో పదేళ్లు గుర్తు పెట్టుకుంటారు!
- దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ‘శుభాకాంక్షలు’, ‘సూర్యవంశం’ వంటి కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని, ‘సుస్వాగతం’తో యువతరం ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు. ‘సుడిగాడు’ చిత్రం తర్వాత మూడేళ్లు స్క్రిప్ట్ వర్క్ చేసి, ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పీడున్నోడు’. తమిళ చిత్రం ‘సుందరపాండ్యన్’కి ఇది రీమేక్. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని రోషితా సాయి సమర్పణలో గుడ్‌విల్ సినిమా పతాకంపై భీమనేని సునీత ఈ చిత్రాన్ని నిర్మించారు. డి.జె. వసంత్ అందించిన పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు వీవీ వినాయక్ సీడీని ఆవిష్కరించి హీరోయిన్ తమన్నాకు అందించారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ -‘‘బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా చేస్తున్నాడంటే తన తల్లిదండ్రుల తర్వాత ఆనందపడేది నేనే. ‘అల్లుడు శీను’లో డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశాడని అందరూ అన్నారు. ఈ సినిమాతో బాగా నటించాడని పేరొస్తుంది. తను పెద్ద హీరో అవుతాడు’’ అని పేర్కొన్నారు. ‘‘భీమనేనిగారు చెప్పిన కథ నన్ను హాంట్ చేసింది. ఇంత మంచి క్లయిమాక్స్, నటనకు హై స్కోప్ ఉన్న మూవీని వదులుకోకూడదని ఈ చిత్రం చేశా. మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు భీమనేనిగారికి థ్యాంక్స్’’ అని సాయి శ్రీనివాస్ తెలిపారు. ‘‘ఒక రీమేక్ చిత్రం కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ‘సుడిగాడు’ తర్వాత వసంత్‌కు మంచి అవకాశాలు రాలేదు. ఈ మూడేళ్లు తను నాతో పనిచేశాడు. ప్రేక్షకులు నన్ను మరో ఐదు, పదేళ్లు గుర్తుపెట్టుకునే చిత్రం అవుతుంది’’ అని భీమనేని చెప్పారు. ఈ వేడుకలో నిర్మాత పోకూరి బాబూరావు, దర్శకుడు అనిల్ రావిపూడి, కళాదర్శకుడు-నిర్మాత చంటి అడ్డాల, కెమెరామెన్ విజయ్ ఉలగనాథన్, సంగీతదర్శకుడు ‘వందేమాతరం’ శ్రీనివాస్, రచయిత చంద్రబోస్, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్, హీరోయిన్లు రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా, కేథరిన్, హెబ్బా పటేల్, పూర్ణ, సాక్షి చౌదరి, హాసిని తదితరులు పాల్గొన్నారు. -
స్పీడున్నోడు ఆడియో విడుదల
-
బాలయ్య అభిమానితో ఢీ అంటున్నాడు
సంక్రాంతిలో స్టార్ ల సినిమాలు భారీగా పోటి పడుతుండటంతో కుర్ర హీరోలు ఫిబ్రవరి రిలీజ్ కు రెడీ అవుతున్నారు. చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతుండటంతో ముందుగానే బెర్త్ కన్ఫామ్ చేసుకునే పనిలో పడ్డారు హీరోలు. ఈ లిస్ట్ అందరికంటే ముందున్న హీరో నాని. ఈ మధ్యే భలే భలే మొగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాని, అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నాని బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్న ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాను జనవరి 10న ఆడియో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో బరిలో దిగుతున్న మరో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమా అల్లుడు శీనుతో ఆకట్టుకోలేకపోయిన శ్రీనివాస్. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని రీమేక్ సినిమాతో రెడీ అవుతున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన సుందర పాండియన్ సినిమాను తెలుగులో స్పీడున్నోడు పేరుతో రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 5న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. -
'స్పీడున్నోడు'గా అల్లుడు శీను
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన తొలి సినిమాతో కమర్షియల్ హిట్ కొట్ట లేకపోయినా.. నటుడిగా మాత్రం మంచి మార్కులే సాధించాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడు శీను సినిమాలో యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్‌లు, ఫైట్స్ ఇరగదీసి కుర్ర హీరోలకు షాక్ ఇచ్చాడు. తొలి సినిమా ఫెయిల్యూర్‌తో ఆలోచనలో పడ్డ అల్లుడు శీను రెండు సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించి ఆగిపోవటంతో ప్రస్తుతం రీమేక్ స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన సుందర పాండియన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాకు స్పీడున్నోడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ముందుగా సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించినా, పెద్ద సినిమాల పోటి ఉండటంతో ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.