మనసు పెట్టి చేశాం కాబట్టే... ఈ విజయం - దర్శకుడు భీమనేని | Bhimaneni comment in the success meet of Speedunnodu | Sakshi
Sakshi News home page

మనసు పెట్టి చేశాం కాబట్టే... ఈ విజయం - దర్శకుడు భీమనేని

Published Tue, Feb 9 2016 12:09 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

మనసు పెట్టి చేశాం కాబట్టే... ఈ విజయం - దర్శకుడు భీమనేని - Sakshi

మనసు పెట్టి చేశాం కాబట్టే... ఈ విజయం - దర్శకుడు భీమనేని

‘‘ ‘సుస్వాగతం’ టైమ్‌లో ప్రకాశ్‌రాజ్ గారిచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. చాలా గ్యాప్ తరువాత మళ్లీ ‘స్పీడున్నోడు’కు కలిసి పనిచేశాం. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో ఆయన నటన అద్భుతం. మా చిత్రం అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అందరూ మనసుపెట్టి చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైంది’’ అని దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తెలిపారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సోనారిక జంటగా భీమనేని సునీత నిర్మించిన ‘స్పీడున్నోడు’ చిత్రం సక్సెస్‌మీట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది.

సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ- ‘‘ప్రతి ఒక్కరూ హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసిన చిత్రమిది. ‘అల్లుడు శీను’ తరువాత చాలా గ్యాప్ వచ్చినా, ఈ చిత్రం ప్రారంభ వసూళ్లు బాగా వచ్చాయి. ఇందులో చాలా బాగా నటించావని అందరూ అంటుంటే పెద్ద ఎచీవ్‌మెంట్‌లా అనిపిస్తోంది. ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన భీమనేనిగారికి కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు డి.జె. వసంత్, ఎడిటర్ గౌతంరాజు, కెమేరామ్యాన్ విజయ్ ఉలగనాథ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిబొట్ల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement