ఈ సారి ఐటమ్ సాంగ్ కాదు హీరోయినే..! | bellamkonda sai srinivas to romance tamannah in his next | Sakshi
Sakshi News home page

ఈ సారి ఐటమ్ సాంగ్ కాదు హీరోయినే..!

Published Tue, Feb 2 2016 12:42 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

ఈ సారి ఐటమ్ సాంగ్ కాదు హీరోయినే..! - Sakshi

ఈ సారి ఐటమ్ సాంగ్ కాదు హీరోయినే..!

ఇండస్ట్రీలో మరే హీరోకి సాధ్యం కాని రేంజ్లో భారీగా వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమా అల్లుడు శీనుతో సక్సెస్ సాధించలేకపోయినా, స్టార్ హీరోల స్థాయిలో గుర్తింపు తెచ్చుకోగలిగాడు ఈ యంగ్ హీరో. అదే జోరులో ఇప్పుడు తన రెండో సినిమా స్పీడున్నోడును రిలీజ్కు రెడీ చేస్తున్నాడు. రీమేక్ స్పెషలిస్ట్ భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోనారిక హీరోయిన్గా నటిస్తోంది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రెండు సినిమాల్లో కథా కథనాలు, సాంకేతిక నిపుణుల సంగతి ఎలా ఉన్నా ఈ రెండు సినిమాలకు ఓ కామన్ పాయింట్ ఉంది. అదే ఐటమ్ సాంగ్. ఈ రెండు సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్ తమన్నా ఐటమ్ సాంగ్ చేయటం విశేషం. అయితే తన మూడో సినిమాలోనూ మరోసారి తమన్నాతో కలిసి చిందేయడానికి రెడీ అవుతున్నాడు శ్రీనివాస్. ఈ సారి మాత్రం ఐటమ్ నంబర్లో కాదట.

తన మూడో సినిమాలో తమన్నాను హీరోయిన్గా ఫైనల్ చేసినట్టుగా ప్రకటించాడు బెల్లం కొండ సాయి శ్రీనివాస్.  రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నా విషయం మాత్రం ప్రకటించలేదు. ఇప్పటికే బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయడానికి కమిట్ అయిన శ్రీనివాస్, ఆ సినిమాకే తమన్నాను ఎంపిక చేశారా లేక, మరో దర్శకుడితో సినిమా చేయబోతున్నాడా అన్న విషయంపై కూడా క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement