బాలయ్య అభిమానితో ఢీ అంటున్నాడు | Nani, Bellamkonda sai srinivas movies on february 5th | Sakshi
Sakshi News home page

బాలయ్య అభిమానితో ఢీ అంటున్నాడు

Published Tue, Dec 29 2015 11:41 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

బాలయ్య అభిమానితో ఢీ అంటున్నాడు - Sakshi

బాలయ్య అభిమానితో ఢీ అంటున్నాడు

సంక్రాంతిలో స్టార్ ల సినిమాలు భారీగా పోటి పడుతుండటంతో కుర్ర హీరోలు ఫిబ్రవరి రిలీజ్ కు రెడీ అవుతున్నారు. చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతుండటంతో ముందుగానే బెర్త్ కన్ఫామ్ చేసుకునే పనిలో పడ్డారు హీరోలు. ఈ లిస్ట్ అందరికంటే ముందున్న హీరో నాని. ఈ మధ్యే భలే భలే మొగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాని, అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. నాని బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్న ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాను జనవరి 10న ఆడియో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 5న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

అదే సమయంలో బరిలో దిగుతున్న మరో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమా అల్లుడు శీనుతో ఆకట్టుకోలేకపోయిన శ్రీనివాస్. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని రీమేక్ సినిమాతో రెడీ అవుతున్నాడు. తమిళంలో ఘనవిజయం సాధించిన సుందర పాండియన్ సినిమాను తెలుగులో స్పీడున్నోడు పేరుతో రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 5న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement