
డింపుల్‌గా కనిపిస్తా..!
బ్రహ్మానందం
‘‘ఇంతకు ముందు వచ్చిన వి.వి. వినాయక్ సినిమాల్లోని నా పాత్రలన్నీ బాగా ఆదరణ పొందాయి. ‘అల్లుడు శీను’లో నాతో డింపుల్ అనే పాత్ర చేయించారు. కామెడీ ఇలా కూడా చేయొచ్చా అనేలా ఈ పాత్రను తీర్చిదిద్దారు’’ అని సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్, సమంత జంటగా వీవీ వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ నిర్మించిన ‘అల్లుడు శీను’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం గురువారం హైదరాబాద్‌లో పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘బెల్లంకొండ శ్రీనివాస్ కొత్తవాడైనా చాలా బాగా నటించాడు. తను చేసిన ఫైట్లు, డాన్సులు చూసి ఆశ్చర్యపోయాను. కచ్చితంగా యూత్‌స్టార్స్‌లో ఒకడిగా ఎదుగుతాడు’’ అని చెప్పారు.