
అల్లుడు శీను...
దర్శకుడు వీవీ వినాయక్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు తీయడంలో సిద్ధహస్తుడు. ఆయన యాక్షన్ ఎంత బాగా తీస్తారో, కామెడీ అంతకన్నా బాగా పండిస్తారు. తాజాగా ఆయన చేస్తున్న సినిమా కూడా అలాంటిదే.
నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో సమంత కథానాయిక. చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రానికి ‘అల్లుడు శీను’ అని టైటిల్ ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో వినాయక్ ఈ పేరుని ఖరారు చేసినట్లు తెలిసింది. కథానుగుణంగా రకరకాల ట్విస్టులతో కథ సాగుతుందని సమాచారం.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... ఇప్పటివరకూ గ్లామర్‌ని ఓ మోస్తరుగానే పలికించిన సమంత... ఈ సినిమా కోసం కాస్త హాట్‌గా దర్శనమివ్వనున్నట్లు ఫిలింనగర్ టాక్. ఆమె గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలువనుందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే. మే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారట