కసరత్తులతో బిజీ.. | Bellamkonda Srinivas is getting ready for Boyapati Srinu's film | Sakshi
Sakshi News home page

కసరత్తులతో బిజీ..

Published Wed, Nov 5 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

కసరత్తులతో బిజీ..

కసరత్తులతో బిజీ..

 ‘అల్లుడు శీను’తో తనలో మంచి మాస్ హీరో ఉన్నాడని నిరూపించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రం త్వరలో ఆరంభం కానుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. చిత్రవిశేషాలను బోయపాటి తెలియజేస్తూ - ‘‘వినాయక్ దర్శకత్వంలో శ్రీనివాస్ చేసిన తొలి చిత్రంలో అతనిలోని మాస్ యాంగిల్ కనబడింది. అందుకు భిన్నంగా రెండో సినిమా ఉండాలనుకుంటున్నాం. ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. శ్రీనివాస్ గెటప్, లుక్ చాలా భిన్నంగా ఉంటాయి. శరీరాకృతిలో కూడా మార్పు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ మార్పు కోసం శ్రీనివాస్ కసరత్తులు చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే షూటింగ్ ఆరంభిస్తాం’’ అని చెప్పారు. శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘బోయపాటి శ్రీనుగారు చెప్పిన కథ అద్భుతంగా ఉంది. నా రెండో సినిమాకి ఆయన దర్శకుడు కావడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌కి ఈ చిత్రం మరో మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement