బిగ్ బాస్‌లో నేనా..? టైం లేదు: అనసూయ
అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ అంచనాల నడుమ ఎన్టీఆర్ హోస్ట్‌గా మొదలైన 'బిగ్‌బాస్' రియాల్టీ షోకు ఆదరణ లభించడం లేదని ప్రచారం జరుగుతోంది. కేవలం ఎన్టీఆర్ శని, ఆదివారల్లో కనిపించడం ఓ కారణం అయితే.. హౌస్‌మేట్స్‌లో ఎవరూ పెద్దగా ఇప్పుడు 'ఫైల్'లో ఉన్నవాళ్ళు కాకపోవడం మరో కారణం. అంతా ఔట్‌డేటెడ్ గ్యాంగ్.. అన్న విమర్శలు విన్పిస్తున్నాయి. అంతేగాకుండా సోషల్ మీడియాలో షో గురించి నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో 'బిగ్‌బాస్' రియాల్టీ షోకి ఊపు తెచ్చేందుకోసం, పలువురు హాట్ సెలబ్రిటీస్‌ని 'వైల్డ్ కార్డ్ ఎంట్రీ' ద్వారా తీసుకొస్తున్నారనే ప్రచారం ఊపందుకొంది.
ఈ లిస్ట్‌లో అందరికన్నా ముందు విన్పించిన పేరు హాట్ యాంకర్ అనసూయదే. అయితే, అనసూయ మాత్రం తన చుట్టూ విన్పిస్తోన్న 'బిగ్‌బాస్' గాసిప్స్‌ని కొట్టి పారేసింది. తనకు అంత టైమ్ లేదని తేల్చి చెప్పేసింది. టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నానని అనసూయ ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చేసింది.