ఎన్టీఆర్, చరణ్ సినిమాలపై ఉద్యమాల ప్రభావం | Movements effect on Jr.NTR, RamCharan films | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్, చరణ్ సినిమాలపై ఉద్యమాల ప్రభావం

Published Thu, Aug 22 2013 5:39 PM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM

ఎన్టీఆర్, చరణ్ సినిమాలపై ఉద్యమాల ప్రభావం

ఎన్టీఆర్, చరణ్ సినిమాలపై ఉద్యమాల ప్రభావం

తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల ప్రభావంతో తమ సినిమాలు అనుకున్న సమయానికి విడుదల చేయలేక చిత్ర నిర్మాలు అల్లాడుతున్నారు. క్రేజీ హీరోలు అందరిపైన ఈ ప్రభావం పడుతోంది. తండ్రుల రాజకీయ నిర్ణయాల ప్రభావం కొడుకుల సినిమాలపై పడుతోంది. ఈ విధంగా  మొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన  ‘ఎవడు’ చిత్రానికి దెబ్బతగితే,  ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రానికి తగులనుంది. చిత్రం ఏమిటంటే సినిమా అడకపోతే వాస్తవానికి నష్టపోయేది నిర్మాత. నిర్మాత ఎవరు? ఏ ప్రాంతం వారు? అనే విషయం ఉద్యమకారులు ఆలోచించడంలేదు.

హీరోల కుటుంబ సభ్యులు రాజకీయాలలో ఉంటే ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటోంది. కేంద్ర మంత్రి చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు తెలుపలేదని, మంత్రి పదవికి రాజీనామా చేయలేదని అతని కుమారుడు చిత్రాలను సీమాంధ్రలో  అడ్డుకుంటామని సమైక్యాంధ్రవాదులు హెచ్చరించారు. దాంతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా విడుదల తేదీలను పలుమార్లు ప్రకటించి వాయిదాలమీద వాయిదాలు వేశారు.   ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరి కృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపధ్యంలో అతని కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వం అని ఓయు విద్యార్థి జెఎసి హెచ్చరించింది. జూనియర్ ఎన్టీఆర్ సమైక్యావాదో, తెలంగాణవాదో స్పష్టం చేయాలని జెఎసి డిమాండ్ చేసింది.
దీంతో ఈ ప్రభావం హరీష్‌శంకర్ దర్శకత్వంలో  జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్య వస్తావయ్యా' చిత్రం విడుదలపై పడనుంది.  చిరంజీవి సో్దరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఉద్యమాల ప్రభావం వల్ల ఈ చిత్రం విడుదల తేదీలను కూడా వాయిదాలపై వాయిదాలు వేస్తూ వస్తున్నారు.

ఎవడు, రామయ్య వస్తావయ్యా రెండు చిత్రాలకు నిర్మాత దిల్ రాజు. ఇంకో విశేషమేమిటంటే  ఈ రెండు సినిమాలలో హీరోయిన్గా  శృతిహాసన్ నటించగా,  రామయ్యావస్తావయ్యా, అత్తారింటికి దారేది చిత్రాలలో సమంత హీరోయిన్గా నటించింది. మరో విశేషం ఏమిటంటే అత్తారింటికి దారేది, ఎవడు రెండు సినిమాలకు  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement