‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. రామ్‌చరణ్ కెరీర్‌లోని ఈ 17వ సినిమాను ఈ ఏడాది మార్చిలో ప్రకటించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణను వచ్చే ఏడాది చివర్లోప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం.
అంతేకాదు... ‘రంగస్థలం’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సమంత ఈ సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తారని, ఆల్రెడీ సంప్రదింపులు జరిగాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. మరి... ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్, సమంత మళ్లీ జోడీగా నటిస్తారా? లేదా అనే విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment