హిట్‌ కాంబినేషన్  రిపీట్‌ | Ram Charan and director Sukumar to reunite for a new project RC17 | Sakshi
Sakshi News home page

హిట్‌ కాంబినేషన్  రిపీట్‌

Published Tue, Mar 26 2024 12:28 AM | Last Updated on Tue, Mar 26 2024 3:17 PM

Ram Charan and director Sukumar to reunite for a new project RC17 - Sakshi

రామ్‌చరణ్, సుకుమార్‌

హిట్‌ మూవీ ‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్  ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

రామ్‌చరణ్‌ కెరీర్‌లోని ఈ 17వ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టి, వచ్చే ఏడాది చివర్లో రిలీజ్‌ చేయాలన్నది చిత్రబృందం ప్లాన్‌ అని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement