
ఒకరోజు ముందే ఆ సినిమా రిలీజ్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' సెప్టెంబర్ 2వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన 'జనతా గ్యారేజ్' సెప్టెంబర్ 2వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సోమవారంతో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా అనుకున్న తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా పోస్ట్ ప్రొడక్షన్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మార్చారు. ముందు ప్రకటించినట్లు సెప్టెంబర్ 2న కాకుండా, ఒకరోజు ముందే.. అంటే సెప్టెంబర్ 1 వ తేదీనే ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని దర్శకుడు కొరటాల శివ స్పష్టం చేశారు. ఈ మేరకు అందరి ఆశీస్సులు కావాలంటూ ట్వీట్ చేశారు.
మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో తనదైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన 'జనతా గ్యారేజ్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యా మీనన్, సమంతలు హీరోయిన్లుగా నటించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
And all set for September 1st. Need ur love and blessings. Thank u all.
— koratala siva (@sivakoratala) 23 August 2016
And here it is.. pic.twitter.com/2LCQwcWnzZ
— koratala siva (@sivakoratala) 23 August 2016