
ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది
గత కొన్ని రోజులుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 12 వ తేదీన పాటలను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. శిల్ప కళావేదికలో గ్రాండ్ ఈవెంట్కు సిద్ధమవుతోంది. ప్రస్తుతం జనతా గ్యారేజ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎన్టీఆర్, సమంతలపై పాట చిత్రీకరణకు మూవీ టీం కేరళ చేరుకుంది. ఎన్టీఆర్ సరసన మరో కథానాయికగా నిత్యామీనన్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ప్రి రిలీజ్ బిజినెస్ పరంగా దూసుకుపోతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా పక్కాగా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.