అందుకే 'జనతా' ఫంక్షన్‌కు రాలేదు: సమంత | Samantha did not attend Janatha Garage audio launch | Sakshi
Sakshi News home page

అందుకే 'జనతా' ఫంక్షన్‌కు రాలేదు: సమంత

Published Mon, Aug 15 2016 1:16 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

అందుకే 'జనతా' ఫంక్షన్‌కు రాలేదు: సమంత - Sakshi

అందుకే 'జనతా' ఫంక్షన్‌కు రాలేదు: సమంత

తారక్ తాజా సినిమా 'జనతా గ్యారేజ్‌' ఆడియో ఫంక్షన్‌ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌, హీరోయిన్ నిత్యామేనన్ సహా టాలీవుడ్‌ ప్రముఖులు చాలామంది పాల్గొన్నారు. అయితే, గత శుక్రవారం జరిగిన ఈ వేడుకకు ప్రధాన హీరోయిన్‌ అయిన సమంత రాలేదు. 'ఈ రోజు అనారోగ్యంగా ఉంది. అందుకే 'జనతా గ్యారెజ్‌' ఆడియో ఫంక్షన్‌కు హాజరుకాలేకపోతున్నా' అని సమంత ట్విట్టర్‌లో వివరణ ఇచ్చింది. సమంతతోపాటు ఈ సినిమాలో నటిస్తున్న సీనియర్‌ నటుడు మోహన్‌ లాల్‌ కూడా ఆడియో ఫంక్షన్‌కు అటెండ్‌ కాలేకపోయారు. దీంతో ఆయన వీడియో సందేశాన్ని పంపించారు.

అయితే, సహజంగానే సమంత ఈ ఆడియో ఫంక్షన్‌కు హాజరుకాకపోవడం ఊహాగానాలకు తావిచ్చింది. ప్రస్తుతం నాగాచైతన్య-సమంత ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే వారు పెళ్లి చేసుకోబోతున్నారని బలంగా కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఇది హాట్‌ న్యూస్‌గా మారింది. సమంత ఎక్కడికి వెళ్లినా.. ఆమెను  ఇదే విషయమై మీడియా ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'జనతా' ఫంక్షన్‌కు దూరంగా ఉండాలని చైతూ సమంతకు సూచించాడట. అందుకే ఆమె 'జనతా గ్యారెజ్' ఆడియో ఫంక్షన్‌కు దూరంగా ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. తాను అనారోగ్యంగా ఉండి రాలేకపోతున్నానని ట్విట్టర్‌లో సమంత వివరణ ఇచ్చినా..  చైతూ-సమంత ప్రేమకథ చుట్టే రూమర్స్‌ అల్లుకొని చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement