Samantha To Play Female Lead Role In Jr NTR Koratala Siva Movie - Sakshi
Sakshi News home page

Samantha: స్టార్‌హీరోతో మరోసారి జతకట్టనున్న సమంత!

Published Sun, Dec 26 2021 5:49 PM | Last Updated on Sun, Dec 26 2021 6:21 PM

Samantha To Play Female Lead Role In Jr NTR Koratala Siva Movie - Sakshi

Samantha To Play Female Lead Role In Jr NTR Koratala Siva Movie: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌30వ సినిమా రూపొందనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా సమంతను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌లో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబినేషన్‌ను రిపీట్‌ చేయనున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది.

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సినిమాల విషయంలో దూకుడు పెంచిన సామ్‌ వరుస సినిమాలు సైన్‌ చేస్తుంది. కాగా పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ స్టూడెంట్‌ లీడర్‌గా కనిపించనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement