NTR30 First Look To Be Out On May 19th Jr NTR's Birthday Special - Sakshi
Sakshi News home page

NTR30 First Look Update: తారక్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. ఒకరోజు ముందుగానే సర్‌ప్రైజ్‌

Published Fri, May 19 2023 2:46 PM | Last Updated on Fri, May 19 2023 3:32 PM

NTR30: The First Look To Be Out On May 19th - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌30 అనే వర్కింగ్‌లో టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ తారక్‌కి జోడీగా నటిస్తుంది. ఇప్పటికే పట్టాలెక్కిన ఈ సినిమా షూటింగ్‌ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతుంది.  ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా తారక్‌ ఫ్యాన్స్‌ కోసం మేకర్స్‌ అదిరిపోయే అప్‌డేట్‌ను అందించారు.

ఈ సినిమా నుంచి ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఈరోజు(శుక్రవారం)రాత్రి  7.02 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈమేరకు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే జాన్వీ లుక్‌ని రివీల్‌ చేయగా ఇంతవరకు ఎన్టీఆర్‌ లుక్‌ని రిలీజ్‌ చేయలేదు. దీంతో ఈ అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో వెయిట్‌ చేస్తున్నారు. తారక్‌ బర్త్‌డేకు ఒకరోజు ముందుగానే సర్‌ప్రైజ్‌ లభిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement