NTR 30 Movie First Look Released Before Junior NTR Birthday - Sakshi
Sakshi News home page

NTR 30 Movie First Look: ఎన్టీఆర్30.. అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్!

Published Fri, May 19 2023 7:00 PM | Last Updated on Fri, May 19 2023 7:42 PM

NTR 30 Movie First Look Released Before Junior NTR Birthday - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'ఎన్టీఆర్‌30'. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.  ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

(ఇది చదవండి: గ‍్లోబల్ స్టార్ NTR గురించి మీకు తెలియని విషయాలు!)

అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఎన్టీఆర్ 30 టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి అందరూ ఊహించినట్లుగానే దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కత్తి చేతిలో పట్టుకుని సముద్రం పక్కన నిలబడి ఉన్న ఎన్టీఆర్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

(ఇది చదవండి: ఎన్టీఆర్30 టైటిల్ నాదే.. బండ్ల గణేష్‌ ట్వీట్‌ వైరల్)

జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, తారక్ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అభిమానుల్లోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ సినిమాలో ఇప్పటికే జాన్వీ లుక్‌ని రివీల్‌ చేయగా.. ఇంతవరకు ఎన్టీఆర్‌ లుక్‌ని రిలీజ్‌ చేయలేదు. తారక్‌ బర్త్‌డేకు ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించనుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement