ఆడియో లాంచ్ పోస్టర్.. | NTR's Janatha Garage Audio Launch Poster | Sakshi
Sakshi News home page

ఆడియో లాంచ్ పోస్టర్..

Published Thu, Aug 4 2016 6:14 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

ఆడియో లాంచ్ పోస్టర్.. - Sakshi

ఆడియో లాంచ్ పోస్టర్..

'జనతా గ్యారేజ్' ఆడియో లాంచ్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం కేరళలో పాట చిత్రీకరణలో బిజీగా ఉంది టీం. 4 రోజుల షెడ్యూల్ లో సమంత, నిత్యామీనన్, తారక్ లపై పాటను చిత్రీకరిస్తున్నారు. అది పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాక ఎన్టీఆర్, కాజల్లపై స్పెషల్ సాంగ్ ను షూట్ చేస్తారు. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్.

కాగా జనతా గ్యారేజ్ ఆడియోను ఆగస్టు 12 వ తేదీన శిల్ప కళావేదికలో వైభవంగా విడుదల చేయనున్నారు. అదే విషయాన్ని కన్ఫామ్ చేస్తూ గురువారం ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబరు 2 వ తేదీన జనతా గ్యారేజ్ ధియేటర్లకు రానుంది.  సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ,  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రఖ్యాత మళయాళ నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement