రేపు సెన్సార్ కి 'జనతా గ్యారేజ్' | Janatha Garage to go for censors tomorrow | Sakshi
Sakshi News home page

రేపు సెన్సార్ కి 'జనతా గ్యారేజ్'

Published Thu, Aug 25 2016 7:53 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

రేపు సెన్సార్ కి 'జనతా గ్యారేజ్'

రేపు సెన్సార్ కి 'జనతా గ్యారేజ్'

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్'  సెప్టెంబరు 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్.. రిలీజ్ సంబంధిత పనులను వేగవంతం చేసింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం సాయంత్రం సెన్సార్‌కు వెళ్లనుంది. సెన్సార్ పూర్తి కాగానే అన్ని ప్రాంతాలకు ప్రింట్స్ పంపిణీ కానున్నాయి.

మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో తనకంటూ బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటించారు. సమంత, నిత్యా మీనన్‌లు తారక్ సరసన హీరోయిన్లుగా నటించారు. దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ఇప్పటికే హల్ చల్ చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement