'జనతా గ్యారేజ్'లో కొత్త సన్నివేశాలు | New scenes added in Janatha Garage | Sakshi
Sakshi News home page

'జనతా గ్యారేజ్'లో కొత్త సన్నివేశాలు

Published Mon, Sep 12 2016 4:09 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

'జనతా గ్యారేజ్'లో కొత్త సన్నివేశాలు

'జనతా గ్యారేజ్'లో కొత్త సన్నివేశాలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో అతి పెద్ద హిట్గా నిలిచిన 'జనతా గ్యారేజ్' కళ్లు చెదిరే కలెక్షన్లతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.70కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద  అదే జోరుని కొనసాగిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి మరో రెండు సన్నివేశాలను జత చేశారు. ఆదివారం నుంచి ఈ కొత్త సన్నివేశాలతో కలిపి సినిమా ప్రదర్శితమవుతోంది. దీంతో అభిమానులు మళ్లీ చూసే అవకాశాలు ఎక్కువ.

మిర్చి, శ్రీమంతుడు సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ.. జనతా గ్యారేజ్ హిట్తో మరింత టాప్ లెవల్కు చేరుకున్నాడు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో తారక్ సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటించారు. కొత్త సన్నివేశాలు జత చేయడంతో ఈ వారం కూడా కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement