ఎన్టీఆర్ కు షాకిచ్చిన జపాన్ యువతి | Japan Fan Surprises Janatha Garage Team | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ కు షాకిచ్చిన జపాన్ యువతి

Published Tue, Apr 26 2016 3:46 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

ఎన్టీఆర్ కు షాకిచ్చిన జపాన్ యువతి

ఎన్టీఆర్ కు షాకిచ్చిన జపాన్ యువతి

యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఓ మహిళా అభిమాని స్వీట్ షాకిచ్చింది. ఏకంగా జపాన్ నుంచి ఆ యువతి తారక్ను కలిసేందుకే ఇండియాకు విచ్చేసింది. ఆమె సరాసరి హైదరాబాద్లో జరుగుతున్న 'జనతా గ్యారేజ్' షూటింగ్ స్పాట్కు వెళ్లడంతో అంతా ఆశ్చర్యపోయారు. తారక్ సినిమాలు కొన్ని జపనీస్లోకి డబ్ చేసి విడుదల చేయడం తెలిసిన విషయమే. 'బాద్షా' సినిమా అక్కడ మంచి బిజినెస్ చేసింది కూడా. అలా తారక్ సినిమాలు చూసి అభిమాని అయిపోయిన నాన్ అనే యువతి అతడిని కలిసేందుకు ఏకంగా జపాన్ నుంచి హైదరాబాద్కు చేరుకుంది.

మంగళవారం నగరానికి చేరుకున్న ఆమె తారక్ ఎక్కడున్నాడో తెలుసుకుని డైరెక్ట్గా స్పాట్కు వెళ్లి యూనిట్ ను ఆశ్చర్యపరిచింది. తన అభిమాన నటుడిని కలుసుకుని ఉబ్బితబ్బిబ్బయ్యింది. తారక్ సినిమాల్లోని కొన్ని డైలాగులు తెలుగులో చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. తాను నటించిన పలు సినిమాల గురించి ఆమె మాట్లాడటం చూసిన ఎన్టీఆర్ మహదానంద పడిపోయారు. తెలుగు నేర్చుకోవాలని ఉందని, త్వరలో నేర్చేసుకుంటానని అంటోంది. ఎన్టీఆర్ సినిమాలన్నీ చూసినట్లు నాన్ చెప్పింది. అంతేకాకుండా ఆమె 'నాకు తెలుగు అంటే ఇష్టం' కోట్ రాసిన టీ షర్ట్ ధరించింది. ఎల్లలు దాటి వచ్చిన అభిమానానికి ఎన్టీఆర్తోపాటు యూనిట్ మొత్తం ఫుల్ ఖుషీ అయ్యారు.

కాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతా గ్యారేజ్' ఆగష్టులో విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్లు కథానాయికలుగా నటిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement