
'నా ప్రాణం లెక్క చేయనంత'
యువ హీరో మంచు మనోజ్ ఒక్క ట్వీట్తో తారక్ ఫ్యాన్స్ను ఫిదా చేశాడు. ట్విట్టర్లో ఓ అభిమాని 'అన్నా.. నీకు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టం?' అని ప్రశ్నించగా.. నా ప్రాణం లెక్కచేయనంత అంటూ సమాధానమిచ్చాడు మనోజ్. దాంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్ చేయాలి అని, మంచువారి మంచి ఫ్రెండ్షిప్ అని.. రకరకాల కామెంట్లు పోస్టు చేస్తున్నారు అభిమానులు. ఇండస్ట్రీలో తారక్, మనోజ్ల మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉందన్నది తెలిసిన విషయమే.
కాగా ప్రస్తుతం మంచు మనోజ్.. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో 'ఒక్కడు మిగిలాడు' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మనోజ్ ఉద్యమకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రెజీనా హీరోయిన్గా నటిస్తుంది. శివ ఆర్. నందిగం ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
@HeroManoj1 @akramsyedrocks anna niku ntr ante enta ishtam?
— Yashwanth Kumar (@yashwanthk115) 19 August 2016
Naa Pranam Lekacheyani anthaa:) https://t.co/iqRnDHHcgf
— Manchu Manoj (@HeroManoj1) 19 August 2016