కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసన అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒక్కరోజు దీక్ష... దొంగ దీక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి వచ్చారని అన్నారు. చంద్రబాబు తన ఎదుగుదల కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా వాడుకున్నారని అంబటి రాంబాబు అన్నారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ధర్మాన్ని ఎక్కడైనా కాపాడారా? అని అంబటి ప్రశ్నించారు.
గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ..‘అధికారులపై మీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు దాడులు చేశారు ఇది ధర్మమా? హోదా అవసరం లేదని చెప్పి మీరు చెప్పలేదా. ప్యాకేజి కావాలని అడిగారు మరల హోదా కావాలని అంటున్నారు. మీరు చేస్తున్న దీక్షకు ఎలా మద్దత్తు ఇస్తారు. హోదా కోసం జపాన్ తరహా ఆందోళన చెయ్యడం ఏమిటో అర్థం కావడం లేదు. హోదా సీఎం చేసే దీక్షకు డ్వాక్రా, మహిళలు స్కూల్ పిల్లలు కాదు రావాల్సింది టీడీపీ నాయకులు,కార్యకర్తలు తరలి రావాలి.