టాప్‌ రేటింగ్‌లో ‘రామాయణం’ | TRP: Ramayan Grabs Top Spot Even If The Channel Changes | Sakshi
Sakshi News home page

టీఆర్‌పీ: టాప్‌ రేటింగ్‌లో ‘రామాయణం’

Published Sat, Aug 15 2020 11:25 AM | Last Updated on Sat, Aug 15 2020 11:44 AM

TRP: Ramayan Grabs Top Spot Even If The Channel Changes - Sakshi

న్యూఢిల్లీ: 33 ఏళ్ల కిందట దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం, మహాభారతం సీరియళ్లు టెలివిజన్‌ చరిత్రలో ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేశాయి. అంతటి విశేష ప్రజాదరణ పొందిన ఈ సీరియళ్లు కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో మరోసారి బుల్లితెరపై కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు దూరదర్శన్‌లో ప్రసారమైన రామాయణం ప్రస్తుతం దంగల్‌ అనే ఛానల్‌లో ప్రసారమవుతోంది. తాజాగా బ్రాడ్‌ కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ (బార్క్‌) అందించిన నివేదిక ప్రకారం టెలివిజన్‌లో ఎక్కువ మంది తిలకించే కార్యక్రమాల్లో రామాయణం మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. (స్టార్ మాలో రామాయణం)

ఆగస్టు 1 నుంచి 31 వరకు భారతీయ ప్రేక్షకులు టీవీల్లో ఏయే కార్యక్రమాలను ఎక్కువగా వీక్షించారనే దానిపై బార్క్ ఒక నివేదిక విడుదల చేసింది. దీని ఆధారంగా టీఆర్‌పీల పరంగా రామాయణం ఇప్పటికీ టాప్‌ రేటింగ్‌లో దూసుకుపోతుందని పేర్కొంది. జీ టీవీలో వస్తున్న శ్రద్ధా ఆర్య, ధీరజ్‌ ధూపర్‌ నటించిన కుండలి భాగ్య సీరియల్‌  రెండో స్థానంలో ఉంది. అలాగే మహిమా శానిదేవ్‌ కీ మూడవ స్థానంలో కొనసాగుతంది. దూరదర్శలో ప్రసారమవుతోన్న శ్రీ కృష్ణ నాలుగో స్థానం, స్టార్‌ ప్లస్‌లో ప్లే అవుతున్న అనుపమా అయిదో స్థానం దక్కించుకున్నాయి. (‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’)

బార్క్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తితో సతమతమవుతున్న జనాలు కాస్తా వినోదం కోరుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో ప్రేక్షకులు కామెడీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు ది కపిల్‌ షో, తారక్ మెహతా కా ఓల్తా చాష్మా వంటి కామెడీ కార్యక్రమాలతో మరోసారి నవ్వుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement